Breaking News

అడవి ఒడిలో...

Published on Thu, 12/05/2024 - 04:10

‘నాకు ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో డ్రైవర్‌ ఉద్యోగం వచ్చింది’ అని మార్గరెట్‌ బారు తన సంతోషాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు అభినందనలు  తెలియజేసిన వారికంటే 
ఆశ్చర్యపోయిన వారే ఎక్కువ.

‘డ్రైవర్‌ ఉద్యోగం... అది కూడా అడవిలో... నువ్వు ఆడపిల్ల అనే విషయం మరిచావా’ అన్నవారు కూడా ఉన్నారు. అయితే వారి ఆశ్చర్యాలు, అభ్యంతరాలేవీ మార్గరెట్‌ దారికి అడ్డుకాలేకపోయాయి.ఒడిషాలోని దిబ్రుఘర్‌ అభయారణ్యంలోని తొలి మహిళా సఫారి డ్రైవర్‌గా ఎంతోమంది యువతులకు స్ఫూర్తిని ఇస్తోంది  మార్గరెట్‌ బారు.

దిబ్రుఘర్‌ అభయారణ్యానికి సమీపంలోని క్రిస్టియన్పడా మార్గరెట్‌ బారు స్వగ్రామం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మెట్రిక్యులేషన్‌ పాసైన తరువాత చదువు మానేయాల్సి వచ్చింది. అభయారణ్యంలో వివిధ ఉద్యోగాలలో మహిళల నియామకానికి అటవీశాఖ ప్రకటన మార్గరెట్‌కు ఆశాకిరణంలా తోచింది.

తన కుటుంబానికి ఆసరాగా ఉండడానికి ఏదో ఒక ఉద్యోగం తప్పనిసరిగా చేయాలనుకున్న మార్గరెట్‌ డ్రైవర్‌ ఉద్యోగానికి ఎంపికైంది.
అయితే సఫారీ డ్రైవర్‌ ఉద్యోగంలో చేరాలనుకున్నప్పుడు ఇతరుల నుంచే కాదు కుటుంబసభ్యుల నుంచి కూడా అభ్యంతరాలు, సందేహాలు ఎదురయ్యాయి.
అయినప్పటికీ మార్గరెట్‌ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. డ్రైవింగ్, వెహికిల్‌ మెయింటెనెన్స్, జంగిల్‌ రోడ్లను నావిగేట్‌ చేయడంలో ప్రాక్టికల్‌ ఎక్స్‌పీరియన్స్‌తో ఆరునెలల కఠినమైన శిక్షణ తరువాత ఉద్యోగంలో చేరింది.

దిబ్రుఘర్‌ అభయారణ్యంలోని 13మంది సఫారీ డ్రైవర్‌లలో ఏకైక మహిళ మార్గరెట్‌. అయితే ఎప్పుడూ అసౌకర్యంగా భావించలేదు. అభద్రతకు గురి కాలేదు.
రోజు ఉదయం ఆరు నుంచి మార్గరెట్‌ ఉద్యోగ జీవితం మొదలవుతుంది.
‘అడవిలో రోడ్లు నాకు సహనాన్ని, ధైర్యాన్ని నేర్పాయి. ప్రతిరోజూ ఒక కొత్త సాహసం చేసినట్లుగా భావిస్తాను. ఈ ఉద్యోగం ద్వారా నా కుటుంబానికి అండగా ఉన్నందుకు గర్వంగా ఉంది’ అంటుంది మార్గరెట్‌.

డ్రైవర్‌ ఉద్యోగం వల్ల మార్గరెట్‌ ఆర్థిక స్వాతంత్య్రం సాధించడం ఒక కోణం అయితే, సంప్రదాయ ఉద్యోగాలకు అతీతం గా కొత్తదారిలో పయనించాలని కలలు కనే అమ్మాయిలకు రోల్‌మోడల్‌గా నిలవడం మరో కోణం.

మార్గరెట్‌లాగే మూసధోరణులకు భిన్నంగా ప్రయాణిస్తోంది సంగీత. ఒకప్పుడు ఆమె మార్గరెట్‌ రూమ్‌మేట్‌. 24 సంవత్సరాల సంగీత సీక్రా దిబ్రూఘర్‌లో మొదటి మహిళా ఎకో గైడ్‌.
‘అడవిలో మీకు భయం వేయదా? ఇది రిస్క్‌ జాబ్‌... సిటీలో ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు కదా... ఇలాంటి మాటలు ఎన్నో వింటుంటాను. అయితే అడవి అనేది అమ్మలాంటిది. అమ్మ ఒడిలో ఉన్నప్పుడు భయం ఎందుకు! నేను, నా స్నేహితురాలు ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తి ఇవ్వడం సంతోషంగా ఉంది’ అంటుంది సంగీత సీక్రా. 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)