యాభై లక్షల ప్రశ్న... పచ్చల రాజధాని ఏది?

Published on Sun, 09/14/2025 - 06:16

స్త్రీలకు నవరత్నాలు ఇష్టం. అయితే వాటిలో కొన్నే కొందరికి ‘మేచ్‌‘ అవుతాయి అని కూడా నమ్ముతారు. వజ్రం, ముత్యం, కనకపుష్యరాగం, కెంపు, పగడం, వైఢూర్యం, నీలం, గోమేధికం... వీటన్నింటితో పాటు పచ్చ... అన్నీ అద్భుతమైన ఆకర్షణ కలిగినవే. స్త్రీలు వీటిని తమ ఆభరణాల్లో పొదిగి మిలమిలా మెరుస్తారు. అయితే ఇప్పుడు ఈ నవరత్నాలకు సంబంధించిన ఒక ప్రశ్నకు జవాబు తెలియపోవడం వల్ల 25 లక్షలు కోల్పోయింది మాన్సీ శర్మ.

 ఇటీవల ప్రసారమైన కౌన్‌ బనేగా కరోడ్‌పతి ఎపిసోడ్‌లో మాన్సీ శర్మకు హాట్‌సీట్‌ దక్కింది. ఆమె ఢిల్లీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తోంది. అమితాబ్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం వల్ల 25 లక్షలు గెలుచుకుంది. తర్వాతి ప్రశ్నకు సమాధానం చెప్తే 50 లక్షలు వస్తాయి. అప్పుడు అమితాబ్‌ అడిగిన ప్రశ్న– పచ్చల రాజధానిగా పేరుబడ్డ ముజో నగరం ఏ దేశంలో ఉంది అని. ఆప్షన్స్‌లో ఎ) నికరాగ్వే బి)నైజీరియా సి)జింబాబ్వే డి)కొలంబియా అని ఇచ్చారు.

అయితే ఈ ప్రశ్నకు మాన్సీ శర్మ జవాబు చెప్పలేకపోయింది. 25 లక్షలతో ఆట ముగించి అంతటితో సంతృప్తి పడింది. ఈ ప్రశ్నకు సరైన జవాబు కొలంబియా. పచ్చల రాజధానిగా పేరుబడ్డ ముజో నగరం ఈ దేశంలోనే ఉంది. ఇక్కడ పచ్చల మైనింగ్‌ కోసం పూర్వం జాతుల మధ్య రక్తపాతాలు జరిగాయి. స్పానిష్‌ జాతీయులు ఇక్కడి ఆదివాసులైన ముజో ఇండియన్సును ఊచకోత కోశారు కూడా. అయితే కాలక్రమంలో ఈ ప్రాంతం అన్ని దాడులను తట్టుకుని నిలబడింది. 

ఇక్కడి పచ్చల గనుల్లో నేటికీ విలువైన పచ్చలు వెలికి తీస్తున్నారు. అవి ప్రపంచ మార్కెట్‌లో అత్యంత ఖరీదైన పచ్చలుగా డిమాండ్‌ కలిగి ఉన్నాయి. ఇందుకు కారణం ఇక్కడి పచ్చలు దాదాపు 30 లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినవి అని శాస్త్రవేత్తల అంచనా. అందుకే వీటి క్వాలిటీకి తిరుగు ఉండదు. అన్నట్టు ఇక్కడి ముజో ఇండియన్సు ఈ పచ్చల గనులకు ఒక దేవత ఉందని నమ్ముతారు. ఆమె పేరు ‘ఆరె’. ఆ దేవత చల్లగా చూడటం వల్లే ఇక్కడ పచ్చలు పండుతుంటాయని అంటారు.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)