Breaking News

నిఖిల్ కామత్ సూపర్‌ ఫుడ్‌ ఇదే..! దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తుందా..?

Published on Fri, 01/24/2025 - 15:43

జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్(Nikhil Kamath)) అవిసే గింజలు, మఖానాలను ఇష్టంగా తింటానని ఒక ఇంటర్యూలో అన్నారు. భారతదేశంలో తదుపరి సూపర్‌ ఫుడ్‌(superfood) మఖానాలేనని కూడా చెప్పారు. ఆరోగ్య స్ప్రుహ ఉన్న ఈ ఆధునిక కాలంలో కచ్చితంగా గొప్ప ఆరోగ్య ఆహార బ్రాండ్‌గా అవతరిస్తుందని అన్నారు. ఇది డయాబెటిస్‌, కొలస్ట్రాల్‌, రక్తపోటు సమస్యలను అద్భుతంగా అదుపులో ఉంచుతుందని చెప్పారు. ఇది నిజంగానే దీర్ఘకాలిక వ్యాధుల(chronic illnesses)ను నివారించడంలో సహాయపడుతుందా అంటే..

పోషకాల ప్రొఫైల్‌..
మఖానా(Makhana)లో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మఖానాలో 9 శాతం ప్రోటీన్‌, ఫైబర్‌తో నిండి ఉంటుంది. సహజంగా లభించే సోడియం చాలా తక్కువ సాంద్రతలను కలిగి ఉంటుంది. 

దీనిలో కొద్దిపాటి కొవ్వు మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్(MufA) రూపంలో ఉంటుంది. పైగా గ్లూటెన్ రహితంగా ఉంటుంది. అందువల్ల బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెరను నిర్వహించడానికి, శరీర కొవ్వును తగ్గించడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికీ అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుందట. మఖానాలో ఫ్లేవనాయిడ్లు, ఆల్కలాయిడ్లు కేన్సర్‌ నిరోధక లక్షణాలను పెంచుతుందట. ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ ఎంజైమ్‌లు మూత్రపిండాలు శుభ్రపరచడానికి కూడా ఉపయోగపడుతుందట. పెద్దలకు 25-30 గ్రాములు, పిల్లలకు 10-20 గ్రాములు చొప్పున తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

దీన్ని స్మూతీలు, కూరలు, స్నాక్‌ల రూపంలో తీసుకోవచ్చు. అయితే పాలతో మరింత పోషక విలువలను అందిస్తుందట. అలాగే ఇక్కడ తినమగానే.. ప్యాకింగ్‌ చేసిన రోస్ట్‌ మఖానాలు మాత్రం తినొద్దని హెచ్చరిస్తున్నారు. ఇవి ప్రయోజనాల కంటే అనారోగ్యకరమైన ప్రమాదాలనే ఎక్కువగా అందిస్తుందని సూచిస్తున్నారు. 

(చదవండి: తలనే లాక్‌ చేశాడు..! తాళం మాత్రం భార్య చేతిలో..)
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)