Breaking News

మకర సంక్రాంతి: శని దోషాలు పోయి, సకల శుభాలు కలగాలంటే ఇలా చేయండి!

Published on Mon, 01/08/2024 - 11:03

హైదరాబాద్:  ఉభయ తెలుగు రాష్ట్రాల్లో  సంక్రాంతి అతి ముఖ్యమైన పండుగు, భోగి, మకర సంక్రాంతి, కనుమ మూడు రోజులను  విశేషంగా భావిస్తున్నారు.  ఈ ఏడాది 2024 జనవరి 15 మకర సంక్రాంతి  జరుపుకుంటున్నారు. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం కాలాన్ని సూర్య చంద్ర, నక్షత్రాల ఆధారంగా లెక్కిస్తారు.అలా సూర్య భగవానుడు ధనూరాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించిన పుణ్యసమయమే మకర సంక్రాంతి.  మకర సంక్రాంతి నాడు సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా కష్టాల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ రోజు చేసే దానం అనేక శుభ ఫలితాలను ఇస్తుంది. సకల శుభాలు  కలగాలంటే ఖచ్చితంగా ఈ  బియ్యం, కిచిడీ, బెల్లం, నల్ల నువ్వులు, దుప్పట్లు దానం చేయాలని కూడా చెబుతారు.

పితృదేవతలకు  తర్పణం
సంక్రాంతి రోజు సూర్యునికి అర్ఘ్యం, నైవేద్యం సమర్పించడం ద్వారా కష్టాల నుండి ఉపశమనం పొందవచ్చని పండితులు చెబుతారు.  అలాగే సంక్రాంతి రోజున నవధాన్యాలు, పండ్లు, కూరగాయలు, వస్త్రాలు దానం చేస్తే విశేష ఫలము లభిస్తుందలకేవలం మకర సంక్రాంతి రోజు పితృ దేవతలకు నువ్వులతో తర్పణాలు వదలుతారు కూడా.  నూతన వస్త్రములను దానం చేయాలి.

సత్యనారాయణ వ్రతం
మకర సంక్రాంతి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం చాలా విశేషం.  సంక్రాంతి రోజున నవధాన్యాలు, పండ్లు, కూరగాయలు, వస్త్రములు వంటివి దానము చేసినటువంటి వారికి విశేషమైనటువంటి పుణ్య ఫలము లభిస్తుందని పండితులు మాట.

ప్రత్యేకంగా నువ్వులు  దానం,పూజ
సంక్రాంతి రోజున తన ఇంటికి వచ్చిన తండ్రి సూర్య భగవానుడికి శని దేవుడు నల్ల నువ్వులతో స్వాగతం పలుకుతాడని, దీనికి మెచ్చిన సూర్యుడు ఈ రోజు తనను నువ్వు పూజించిన వారికి సకల సంతోషాలు కలుగుతాయని దీవించాడని పురాణాలు చెబుతున్నాయి. దీంతో మరక సంక్రాంతి రోజు సూర్యుడికి పూజలు చేయడంతోపాటు, నల్లనువ్వులు కలిపిన నీటిని సూర్యుడికి సమర్పించాలి.  అలాగే శనికి ప్రీతికరమైన నల్లనువ్వులను  ధారపోసినా,  నదానమిచ్చినా శని బాధల నుంచి ఉపశమనం కలుగుతుందని,  ఏలిన నాటి శని దోషాలు తొలగి  జీవితంలో వెలుగులు ప్రసరిస్తాయట. 

ఈ రోజు నెయ్యి దానం చేయడం వల్ల అన్ని రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే జాతకంలో సూర్యుడు-గురు గ్రహ స్థానం బలపడుతుంది.  సంక్రాంతి నాడు బెల్లం దానం చేస్తారు.  అటుకులు బెల్లం కలిపి దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇంకా ఈ రోజు మినపపప్పు, బియ్యంతో చేసిన ఖిచ్డీని దానం చేస్తారు. ఫలితంగ  మనుషుల జాతకంలో సూర్యుడు, చంద్రుడు , బృహస్పతి స్థానం బలంగా ఉంటుందని చెబుతారు.

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు