Breaking News

వందేళ్ల నాటి పైథానీ చీరలో బరోడా మహారాణి రాధికా రాజే..!

Published on Tue, 01/28/2025 - 12:15

డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ ఫేమస్‌ బ్రాండ్‌ సబ్యసాచి(Sabyasachi) 25వ వార్షిక వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 700 మందికి పైగా అతిథులు పాల్గొన్నారు. ఈ వేడుకలో పాల్గొనేవాళ్లంతా రాయల్టీకి అద్దం పట్టేలా డ్రెస్‌ లుక్‌ ఉండాలి. తప్పనిసరిగా నలుపు రంగు డ్రెస్‌కోడ్‌ అనుసరించాలనే నిబంధనలు ఉన్నాయి. అయితే ఈ నిబంధనలకు అనుగుణంగా రాజరికదర్పంతో అద్భుతంగా కనిపించారు మహారాష్ట్ర మహారాణి రాధికా రాజే గైక్వాడ్‌(Radhika Raje Gaekwad ). 

ఆమె ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన భవంతుల్లో ఒకటైన గుజరాత్‌ వడోదరలోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌లో నివశిస్తోంది. ఈ వేడుకలో ఆమె నాటి రాజరికపు చరిత్రను గుర్తు చేసేలా శతాబ్దాల నాటి పురాతన చీరలో మెరిసింది. ఇది వందేళ్ల నాటి పైథానీ నౌవారీ(Black Paithani Nauvari Saree) నలుపు రంగు చీర. చెప్పాలంటే తొమ్మిది గజాల కాటన్‌ పైథానీ చీర ఇది. ఈ చీర జరీని స్వచ్ఛమైన బంగారంతో తయారు చేస్తారు. 

 

ఇది మహారాష్ట్ర సంప్రదాయ చీర. రాధిక రాజేకు మన భారతీయ వారసత్వ చీరలంటే ఆమెకు మహా ప్రీతి. ఎవరికైన పురాతన కాలం నాటి చారిత్రక నేపథ్యంతో ముడిపడి ఉన్న చీరల గురించి తెలుసుకోవాలనుకునేవారికి ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఓ నిధిలా ఉంటుంది. అంతలా పురాతన చీరల కలెక్షన్‌ రాధిక రాజే వద్ద ఉంది. అందుకు సంబంధించిన చిత్రాలను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. అలాగే పోస్ట్‌లో తొమ్మిది గజాల లేదా నౌవారీ చీర గురించి రాశారు. టిష్యూలు, షిఫాన్‌లు విస్పీడ్రేప్‌, సున్నితమైన జరీ మోటిఫ్‌లు, గోసమర్‌ టచ్‌తో కూడిన కాటన్‌ చందేరీలు మహారాష్ట్ర మహిళలకు ఎంతో ఇష్టమైనవి.

 ప్రస్తుతం అలాంటి తొమ్మిది గజాల చీర కొనడం అనేది దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. పైగా వీటిని ఎక్కువగా సీనియర్‌ మహిళలు(అమ్మమ్మలు, బామ్మలు) ధరిస్తున్నారు. ఇలాంటి తొమ్మది గజాల చీరలను మాత్రం ముంబైలోని పనిమనుషులు, మత్స్యకారుల ఒంటిపై దర్శనమిస్తున్నాయి." అని పేర్కొన్నారు రాధికా రాజే.

 

(చదవండి: కోడలికి గిఫ్ట్‌గా 'ఖందానీ హార్‌'ఇచ్చిన నీతా అంబానీ..! ప్రత్యేకత ఇదే)

 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)