Breaking News

‘ఉమ’ నిస్టు సగమై సంగమమై!

Published on Wed, 02/26/2025 - 10:44

లోకంలో భార్యను ప్రేమించే వారు చాలామంది ఉండొచ్చు. అయితే శివుడు తన భార్యను ప్రేమించినంతగా మరొకరెవరూ ప్రేమించలేరేమో అనిపిస్తుంది. ఎందుకంటే శివుడికి పార్వతి మీద  ప్రేమ ఎంతటి గొప్పదంటే ఆమెకు తన శరీరంలో సగభాగాన్ని పంచి ఇచ్చేటంత! 

శివుడి అర్ధనారీశ్వర తత్వాన్ని, శివుడిలో శక్తిగా వెలిగే అమ్మవారిని దర్శించడానికి సౌందర్యలహరిలో అనేక ఉదాహరణ లున్నాయి కానీ... మచ్చుకు మొదటి రెండు శ్లోకాలు పట్టుకుంటే చాలు. 

‘శివశ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం 
న చే దేవం దేవో న ఖలు కుశలః స్పందితు మపి 
అత స్త్వా మారాధ్యాం హరిహర విరించాదిభిరపి 
ప్రణంతుం స్తోతుం వా కథ మకృత పుణ్యః ప్రభవతి‘

శివుడు శక్తితో కలిసినప్పుడే శక్తిమంతుడై సృష్టి స్థితి లయలు చేయగలుగుతున్నాడు. శక్తి కలవనప్పుడు కనీసం స్పందించే శక్తి కూడా లేనివాడుగా ఉన్నాడు. అలాంటి నీగురించి చెప్పాలంటే గతజన్మల్లో పుణ్యం లేకపోతే...బ్రహ్మ–విష్ణు–రుద్రులకైనా సాధ్య మవుతుందా? అమ్మవారిని  పొగుడుతూ మొట్టమొదటి శ్లోకం మొట్టమొదటి మాట ‘శివ‘ అని అయ్యవారితో మొదలుపెట్టడంలో శంకరుడి హృదయాన్ని పట్టుకోవాలి. 

‘కలాభ్యాం చూడాలంకృత శశికలాభ్యాం నిజతపః 
ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే
శివాభ్యా మస్తోక త్రిభువన శివాభ్యాం హృది పున 
ర్భవాభ్యా మానందస్ఫురదనుభవాభ్యాం నతి రియమ్‌‘ 

శివపార్వతులు ఒకరి తపస్సుకు ఒకరు ఫలమైనవారు. ఒకరు ఎక్కువా కాదు. ఒకరు తక్కువా కాదు. ఆది దంపతులు ఇద్దరూ సమానం. అమ్మవారి సౌందర్యానికి తగిన శబ్దసౌందర్యంతో సాగిన రచన ఇది. శంకరాచార్యుల సంస్కృతంలో శబ్ద సౌందర్యం, అర్థగాంభీర్యం వర్ణించడానికి మాటలు చాలవు. కవిత్వం,  ప్రాసలు, తూగు, చమత్కారం, భావం, సాంద్రత, ఎత్తుగడ, ముగింపు, మకుటం, పునరుక్తి లేకుండా ఒకే విషయాన్ని రక రకాలుగా చెప్పడం, అత్యంత సంక్లిష్టమైన విషయాలను అరటిపండు ఒలిచిపెట్టినట్లు అత్యంత తేలికగా చెప్పడం... ఇలా తోడుకున్నవారికి తోడుకున్నన్ని అందాలు, ఆనందాలు, అర్థాలు, పరమార్థాలు. శంకరుడు పుట్టక΄ోయి ఉంటే దేవుళ్ళకు ఇన్నిన్ని స్తోత్రాలే ఉండేవి కావు. 

 చదవండి: Shivaratri 2025 : శివరాత్రికి, చిలగడ దుంపకి ఉన్న సంబంధం ఏమిటి?

బ్రహ్మ సృష్టి చేయాలనుకున్నప్పుడు అవసరమైన శివుడి అర్ధనారీశ్వర రూపంలో ఇంకా అనేక ఆధ్యాత్మిక, యోగ సాధనా రహస్యాలు దాగున్నాయి. కాళిదాసు రఘువంశ  ప్రార్థన శ్లోకాల్లో చెప్పినట్లు–

‘వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే,
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ‘

అని శివరాత్రి పూట శివుడిలో భాగమైన పార్వతికి; పార్వతిలో భాగమైన శివుడికి; వేరు చేయడానికి వీల్లేకుండా కలిసి ఉన్న జగత్తుకు తల్లిదండ్రులైన ఆదిదంపతులిద్దరికీ నమస్కారం పెట్టి... లోకంలో దంపతులు కూడా అలా వేరు చేయడానికి వీల్లేకుండా కలిసి ఉండాలని కోరుకుందాం. 

 – పమిడికాల్వ  మధుసూదన్‌ 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)