Breaking News

సినిగళంలో నీల కంఠుడు

Published on Sun, 02/15/2026 - 06:43

‘కైలాసాన కార్తీకాన శివరూపం ప్రమిదే లేని ప్రమదాలోక హిమదీపం’ అని రాశారు వేటూరి ‘సాగర సంగమం’లో.

తెలుగు సినిమాల్లో శివుడి ప్రస్తావన ఆది నుంచి ఉన్నా అనేక పాటల్లో శివుని ప్రస్తావనను, ప్రభావాన్ని ప్రేక్షకులకు అందించినవారిలో కె.విశ్వనాథ్, వేటూరి ఉంటారు.
‘నటరాజ శత సహస్ర రవితేజా... నట గాయక వైతాళిక మునిజనభోజా’ అని వేటూరి తాను కె.విశ్వనాథ్‌తో పని చేసిన తొలి హిట్‌ ‘సిరిసిరిమువ్వ’లో శివుణ్ణి స్తుతించారు. ఆ తర్వాత ‘శంకరాభరణం’లో ‘ఓంకారనాదాను సంధానమౌ గానమే శంకరాభరణము’ అని  సకల కళలకూ మూలమైన నటరాజ స్వరూపం పరమశివుడిని పల్లవిగా చేశారు.

భగవంతుడ్ని చేరుకోడానికి సంగీతం కూడా ఒక అనుసంధాన మార్గమే కదా. అందుకే ‘అద్వైత సిద్దికి అమరత్వ లబ్దికి గానమే సోపానమూ’ అని కూడా అన్నారు వేటూరి.

శివతత్వాన్ని పూర్తిగా తెలిసి రాసిన సాహిత్యం ‘సాగరసంగమం’లోనూ వినిపిస్తారు వేటూరి, విశ్వనాథ్‌లు. శివుడు లయకారుడు. సంగీతంలోనూ... సాహిత్యంలోనూ... గానంలోనూ కూడా లయే ప్రధానం.   శివుడు మాట్లాడితే సాహిత్యం. మాట్లాడకపోతే వేదాంతం. అన్నీ శివుడే అని చెప్పటానికి వేటూరి, విశ్వనాథ్‌ కలసి చేసిన ప్రయోగం సాగరసంగమంలోని ‘ఓం నమఃశివాయ’ పాట. అందులో ‘నీ లయలే ఈ కాలగమనమై’ అంటారు. ‘ప్రకృతి పార్వతి శివునితో కలిసి అడుగులు వేస్తాయి’ అని కూడా అంటారు. ‘జీవితమే చిర నర్తనమాయే’ అనడం వేటూరి మాస్టర్‌స్ట్రోక్‌. ఇక  బాపు ‘భక్త కన్నప్ప’లో వేటూరి రాసిన ‘కిరాతార్జునీయం’ మరో కవికి సాధ్యం కానిది.

వెనక్కు వెళ్లి చూస్తే తెలుగు సినిమా సాహిత్యంలో పరమ శివుడికి ప్రత్యేక స్థానమే ఉంది. రావణ విరచిత ‘శివ దండకాన్ని’ సంపాదించి దాన్ని రావణ పాత్రతోనే పాడించేలా పరిశోధన చేసి సాధించారు సముద్రాల రాఘవాచార్యులు ‘భూకైలాస్‌’లో. దాన్ని గాలి పెంచెల నరసింహా రావు స్వరసారధ్యంలో నిజంగానే రావణుడే పాడుతున్నారా అన్నంత ఎక్స్‌ప్రెసివ్‌గా గానం చేసి రక్తి కట్టించారు ఘంటసాల. 

తెరమీద రావణపాత్రలో ఎన్టీఆర్‌ అయితే ఇక చెప్పడానికేముంది. ‘భూకైలాస్‌’లోనే శివుణ్ణి ‘లోక శుభంకరుడు’గా వర్ణించారు సముద్రాల. ‘అన్య దైవము గొలువ నీదు పాదము విడువ’ అంటాడు రావణుడు శివభక్తితో ‘నీలకంధరా దేవ’ పాటలో. ఇక పింగళి గారు ‘సత్య హరిశ్చంద్ర’లోని ‘నమో భూతనాథ’ పాటలో శివుణ్ణి ‘సదా సుప్రకాశ’ అన్నారు.

‘అర్ధనారీశ్వర’ తత్వాన్ని అర్ధం చేసుకున్న వారెవరైనా శివపార్వతులను ఒకటిగానే చూస్తారు. అందుకే భయం కలిగినప్పుడు అభయం కోసం అమ్మవారైన పార్వతిని స్తుతిస్తుంది ద్రౌపది ‘నర్తనశాల’లో.  సముద్రాల రాసిన ‘జననీ శివకామినీ’ పాటను భక్తిరసస్ఫోరకంగా స్వరపరిచారు సుసర్ల దక్షిణామ్మూర్తి. అంతే గొప్పగా గానం చేశారు సుశీల. 

ఆరుద్రకు ఏం తక్కువ. ‘మా రేడు నీవని ఏరేరి తేనా మారేడు దళములు నీ పూజకు’ అని రాశారు ‘భక్త కన్నప్ప’లో. ‘గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని’ అనే పంక్తి ఎన్నిసార్లు విన్నా బాగుంటుంది. ‘ఏకలవ్య’లో మల్లెమాల రాసిన ‘మ్రోగింది ఢమరుకం మేల్కొంది హిమనగం’ కూడా గుర్తు చేసుకోదగ్గది. ‘అమెరికా అమ్మాయిలో’నూ ఓ శివభక్తి గీతం వినిపిస్తుంది. నారాయణరెడ్డి రాసిన సాహిత్యం చిదంబర నిలయుడి మూర్తిని మన కళ్లెదుట నిలుపుతుంది. 

‘వారణాసిని వర్ణించే నా గీతిక నాటి శ్రీనాథుని కవితై వినిపించగా’ అంటూ ‘ఇంద్ర’ కోసం రాసిన ‘భంభం భోలే’ లో ‘గంగలో నిత్యం కనలేదా శివ కారుణ్యమే’ అని సిరివెన్నెల మాత్రమే రాయగలరు.

‘భరత వేదముగ నిరత నాట్యముగ కదలిన పదమిది పరమేశా’ అని పౌర్ణమి’లోని పాట తరచూ వినిపించే సిరివెన్నెల మరో రచన. ఆపదల్లో ఉన్న వారికి అభయం ఇచ్చి తన వారినిగా చేసుకునే సువిశాల శివతత్వ దర్శనమే ‘ఖలేజా’లో వినిపించే రామజోగయ్యశాస్త్రి గీతం ‘సదాశివ సన్యాసి’. 

శివతత్త్వమే అత్యంత శుభకరము, భవహరము, హృదయంగమము. మరి ఈశ్వర సాయుజ్యం ΄÷ందేందుకు ప్రయత్నోన్ముఖులైన వారికి ఆనందం కాక మరేమిటి? 
ఇంక ఇహలోక బంధాలనూ... జంజాటాలనూ పట్టించుకునే పరిస్థితి ఉంటుందా? విభూతిని ధరించని ఫాలభాగం, శివాలయం లేని గ్రామం, ఈశ్వరుని ధ్యానించని మానవ జన్మం వ్యర్థములు అంటారు. 

శివ అంటే సంస్కృతంలో శుభము, సౌమ్యము అని అర్థాలున్నాయి. ఈ ప్రపంచమూ అందరి జీవనమూ  శుభ సౌమ్యాలతో గడవాలని కోరుకుందాం.

– భరద్వాజ 

Videos

బడ్జెట్ లో నిరుద్యోగులకు టోకరా.. బాబుపై 420 కేసు!?

ఇది రాష్ట్రం కోసం పెట్టిన బడ్జెట్ కాదు జగన్ కోసం పెట్టిన బడ్జెట్..

చెయ్యి ఆయనది, గడ్డం ఆయనది.. మీకేంటి నొప్పి?

అనిత ఓవరాక్షన్ కు అంబటి కూతురు ఊర మాస్ వార్నింగ్

కాపుతో పెట్టుకున్నారు.. వంగవీటి నరేంద్ర మాస్ వార్నింగ్

పవన్ వారసుడు అకీరా ఎంట్రీ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే..?

చంద్రబాబు లడ్డూ కల్తీ జరిగిందని చెప్పడానికి అసలు కారణం ఇదే..

నీకు అంత దమ్ముంటే హెరిటేజ్ నాది కాదు అని చెప్పు

ఛత్తీస్ గఢ్ లోని దాంతరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

పంచారామ క్షేత్రంలో అపచారం

Photos

+5

బ్రహ్మమురారి.. సురార్చితలింగం (ఫొటోలు)

+5

సాహసం శ్వాసగా సాగిపో: విశాఖలో నేవీ విన్యాసాలు (ఫొటోలు)

+5

విశ్వక్‌సేన్‌ 'ఫంకీ' సక్సెస్‌ మీట్‌ (ఫోటోలు)

+5

ట్రావెల్‌ అడ్వెంచర్‌ టాక్‌ షో 'సోల్‌ ట్రిప్‌' (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో నరేశ్‌- పవిత్ర (ఫోటోలు)

+5

నాగేంద్ర హారాయ త్రిలోచనాయ ! (ఫొటోలు)

+5

డాక్టర్‌గా హీరోయిన్ శ్రీలీల.. పట్టా అందుకున్న మధుర క్షణాలు (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ హల్దీ వేడుక (ఫొటోలు)

+5

క్రిస్టల్‌ ఐవరీ లెహంగాలో పాలరాతి శిల్పంలా రాధికా స్టన్నింగ్‌ లుక్స్‌ ..! (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మరో డాక్టర్ (ఫొటోలు)