Breaking News

మూడు కొండలెక్కితేగానీ చేరుకోని ఆ ఆలయానికి..

Published on Sat, 06/17/2023 - 17:46

హిందూ దేవుళ్లలో హనుమంతుని ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అంతా హనుమంతుడిని భక్తిగా కొలుస్తారు. అలాంటి హనుమంతుని జన్మస్థలంగా భావించే నాసిక్‌లో అంజనేరి కొండల వద్ద ఉన్న ఆ స్వామి గుడిని సందర్శించడాని భక్తులు ఎన్నో ప్రయాసలు పడి వెళ్లాల్సి వస్తోంది. నిటారుగా ఉన్న ఆ రహదారి వెంబడి వెళ్లాలంటే సుమారు రెండు నుంచి మూడు గంటలు పడుతోంది.

దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఆలయానికి త్వరితగతిన చేరుకునేలా రోప్‌వే నిర్మించాలని నిర్ణయించింది. వచ్చే రెండేళ్లలో బ్రహ్మగిరి ట్రెక్కింగ్‌ పాయింట్‌ నుంచి అంజనేరి కొండల వరకు ఈ రోప్‌ వేని నిర్మించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏ1) పర్వరత్మల పథకం కింద ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన టెండర్లను ఆహ్వానించింది.

ఇక హనుమంతుని జన్మస్థలం అయిన అంజనేరి కొండలు వద్ద ఆ స్వామికి సంబంధించిన గుహ తోపాటు అంజనీమాత ఆలయం కూడా ఉంది. వీటిని యాత్రికులు, ట్రెక్కర్లు సందర్శిస్తారు. సుమారు 4 వేల అడుగులకు పైగా ఎత్తులో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవాలంటే మూడు పర్వతాలు ఎక్కాలి. ఇక్కడకు 5.7 కి.మీ పొడవున్న రోప్‌వే మూడు పర్వతాల మీదుగా వస్తే పైకి వెళ్లే ప్రయాణం కొన్ని నిమిషాలకు తగ్గిపోతుంది. కాగా, 2024 నాటికి మొత్తం 18 రోప్‌వే ప్రాజెక్టులను కేంద్ర ప్లాన్‌ చేస్తునట్లు సమాచారం. 

(చదవండి: కోడి ముందా.. గుడ్డు ముందా? ఎట్టకేలకు సమాధానం ఇచ్చిన శాస్త్రవేత్తలు)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)