Breaking News

మ్యూజిక్‌ లాలిపాప్‌..! తింటూ..సంగీతం వినొచ్చు..

Published on Thu, 01/08/2026 - 18:01

లాలీపాప్స్ అంటే పిల్లలకు ఎంతో ఇష్టమో తెలిసిందే. పంచదార క్యాండీలాంటి ఈ చాక్లెట్‌లంటే పెద్దలకు కూడా ప్రియమైనవే. అలాంటి లాలిపాప్‌ని టెక్నాలజీ సాయంతో వినూత్నంగా ఆవిష్కరించారు. వాటి ప్రత్యేకత తెలిస్తే విస్తుపోతారు. 

ప్రపంచ సమావేశమైన సీఈఎస్‌ 2026 లాస్‌ వేగాస్‌లో వినూత్న ఆవిష్కరణలతో ప్రారంభమైంది. ఈ ఈవెంట్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ), రోబోటిక్స్‌ టెక్నాలజీలో ఉన్నత స్థాయి పురోగతిని ప్రదర్శిస్తుండగా..ఒక ఆశ్చర్యకరమైన ఆవిష్కరణ అందర్నీ ఆమితంగా ఆకట్టుకుంది. అదేంటంటే..క్యాండీ చాక్లెట్‌గా పిలిచే లాలిపాప్‌ని కొరికనప్పుడు మ్యూజిక్ వినిపిస్తుంటుందట. 

వీటిని లాలిపాప్‌స్టార్‌గా పిలుస్తారట. ఈ అసాధారణమైన క్యాండీ బోన్‌ కండక్షన్‌ టెక్నాలజీతో పనిచేస్తుందట. ఈ క్యాండీలో మనం  ఐస్ స్పైస్, ఏకాన్, అర్మానీ వైట్  వంటి కళాకారుల పాటలు వినొచ్చట. ఆక్యాండీని చప్పరించినా లేదా కొరికనప్పుడూ మన పుర్రె ఎముకల ద్వారా లోపలి చెవికి ప్రయాణించే ధ్వని సంగీతంలా వినిపిస్తుందట. అంటే మన నోటిలోనే సంగీత కచేరి వినోచ్చన్నమాట. 

సింపుల్‌గా చెప్పాలంటే..ప్రపంచపాప్‌ దిగ్గజాల పాటలన్నీ మన నోటిద్వారానే వినొచ్చు. పైగా కొరకండి సంగీతాన్ని అస్వాదించండి అని సదరు లావా కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొంది కూడా. అంతేగాదు వీటి ధర ఏకంగా రూ. 808లు. ఇవి కేవలం స్టార్‌వెబ్‌సైట్‌లో లభిస్తాయట. అయితే నెటిజన్లు ఈ ఆవిష్కరణపై మండిపడుతున్నారు. ఇంతకుమునుపు పిల్లల టూత్‌బ్రెష్‌లలో ఇలాంటి టెక్నాలజీనే వినియోగించారని గుర్తు చేస్తూ పోస్టులు పెట్టారు.  పైగా అత్యంత పనికిమాలిన వస్తువుగా తిట్టిపోయడం గమనార్హం. 

(చదవండి: హీరో రామ్‌చరణ్‌ ఇంట జపాన్‌ చెఫ్‌ చేతి బిర్యానీ..! టేస్ట్‌ ఎలా ఉందంటే..)
 

#

Tags : 1

Videos

రాయవరం ప్రజలు బాబుకు కౌంటర్ పేర్ని నాని ఫన్నీ రియాక్షన్

చిరు వెంకీ జస్ట్ టీజర్ మాత్రమే..! ముందుంది రచ్చ రంబోలా

హైకోర్టు తీర్పు ప్రభుత్వం, అధికారులకు చెంపపెట్టు: పేర్ని నాని

చాకిరీ మాకు.. పదవులు మీ వాళ్లకా? పవన్‌ను నిలదీసిన నేతలు

East Godavari: చంద్రబాబు బహిరంగ సభకు కనిపించని ప్రజా స్పందన

Business: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

తెలంగాణ డీజీపీకి హైకోర్టులో ఊరట..!

పోలీసుల తీరుపై మనోహర్ రెడ్డి ఫైర్

అర్ధ రూపాయి, రూపాయికి ఇస్తావా? లోకేష్ వ్యాఖ్యలకు పేర్ని నాని దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

ఏపీలో సంక్రాంతి రద్దీ.. బస్టాండ్లలో ప్రయాణికుల అవస్థలు

+5

రెడ్ శారీలో మెరిసిపోతున్న హీరోయిన్ నిధి అగర్వాల్

+5

నగరంలో హీరోయిన్‌ డింపుల్‌ హయతీ సందడి (ఫొటోలు)

+5

విజయవాడలో ఘనంగా మహిళా ఫెస్ట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో రాజాసాబ్.. డార్లింగ్ ప్రభాస్ ఫోటోలు చూశారా?

+5

జూబ్లీహిల్స్‌లో ‍సందడి చేసిన సినీ నటి నివేదా పేతురాజ్ (ఫొటోలు)

+5

అర్థరాత్రి విమల్ థియేటర్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ (ఫొటోలు)

+5

'అనగనగా ఒక రాజు'లో మీనాక్షి చౌదరి.. ట్రెండింగ్‌లో ఫోటోలు

+5

'అనగనగా ఒక రాజు' ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్రహ్మానందం, మంగ్లీ (ఫోటోలు)