Breaking News

లెమన్‌గ్రాస్ టీతో ఎన్ని లాభాలో తెలుసా..!

Published on Tue, 06/18/2024 - 16:22

మనం ఎన్నో రకాల టీల గురించి విన్నాం. వాటిలో కొన్ని ఆరోగ్యకరమైన గ్రీన్‌ టీ వంటి  పలు పానీయాలు గురించి కూడా విన్నారు. అలాంటి కోవకు చెందిన నిమ్మగడ్డి టీ  గురించి విన్నారా. దీని వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబతున్నారు నిపుణులు. జీర్ణక్రియ దగ్గర నుంచి బరువు తగ్గడం, రోగ నిరోధక శక్తి వరకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందించగలదు ఈ టీ. అలాంటి ఈ లెమన్‌గ్రాస్‌ టీని ఎలా తయారు చేస్తారు? దీని వల్ల కలిగే లాభలేంటో సవివరంగా తెలుసుకుందామా..!

లెమన్‌ గ్రాస్‌ టీ తయారీ విధానం..

కావాల్సినవి:
నీళ్లు: నాలుగు కప్పులు, నిమ్మగడ్డి: మూడు కాడలు (పచ్చివి), తేనె: మూడు చెంచాలు (బెల్లం కూడా వేసుకోవచ్చు)

తయారీ: ముందుగా గిన్నెలో నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి బాగా మరిగించుకోవాలి. అందులో నిమ్మగడ్డి వేసి మరో పది నిమిషాలు మరిగించి, ఆవిరి బయటికి రాకుండా మూతపెట్టేయాలి. కప్పులో తేనె వేసుకొని, తేనీటిని అందులోకి వడకట్టుకోవాలి. చక్కటి పరిమళంతో పసందైన నిమ్మగడ్డి టీ రెడీ!. మధుమేగ్రస్తులు బెల్లం ఉపయోగించొచ్చు లేదా వేయకుండా తీసుకోవచ్చు. 

ఆరోగ్య ప్రయోజనాలు..

  • దీనిలో ఉండే సిట్రల్‌ జెరేనియల్‌ గుండె జబ్బులు, స్ట్రోక్‌లు వంటివి రాకుండా కాపాడుతుంది. 

  • యాంటీ కేన్సర్‌ సామర్థ్యాలను కలిగి ఉంది. లెమన్‌ గ్రాస్‌లో ఉండే ఔషధ గుణాలు కేన్సర్‌తో పోరాడటంలో సహాయపడతాయి. సెల్‌ డెత్‌కు కారణమయ్యే వాటిని నివారించేలా రోగ నిరోధక శక్తిని పెంచి కేన్సర్‌తో పోరాడగలిగే శక్తిని ఇస్తుంది. 

  • గ్యాస్ట్రిక్‌ అల్సర్లకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉంటుంది. 

  • రక్తపోటుని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేగాదు ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల నిమ్మరసం మూత్ర ఉత్పత్తిని పెంచి రక్తపోటును తగ్గిస్తుంది.

  • కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది

  • బరువు తగ్గడంలో సహాయపడుతుంది

  •  జీవక్రియను నియంత్రిస్తుంది. శరీరం నుంచి అదనపు వ్యర్థాలను తొలగించి జీవక్రియను వేగవంతం చేస్తుంది. 

  • రుతుక్రమంలో ఎదురయ్యే అధిక రక్తస్రావం వంటి అసౌకర్యాలను తగ్గిస్తుంది. 

ఇది ఎంత సురక్షితమైనదైనప్పటికీ అతిగా తాగితే దుష్ప్రభావాలను ఎదుర్కొనక తప్పదు. అవేంటంటే..

  • తల తిరగడం

  • ఆకలి పెరగటం

  • నోరు పొడిబారడం

  • తరుచుగా మూత్రవిసర్జన 

  • అలసట

  • దద్దుర్లు, దురద, శ్వాస ఆడకపోవడం, వేగవంతమైన హృదయ స్పందన వంటి అలర్జీలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ గర్భవతిగా ఉన్నట్లయితే, వాళ్లలో తక్కువ హృదయ స్పందన రేటు లేదా తక్కువ పొటాషియం స్థాయిని కలిగి ఉంటే ఎట్టిపరిస్థితుల్లో లెమన్‌గ్రాస్ టీని తాగకూడదు.

(చదవండి: హెయిర్‌ పెర్ఫ్యూమ్‌లు ఎక్కువగా ఉయోగిస్తున్నారా? నిపుణులు వార్నింగ్‌)

 

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)