Breaking News

మూసేసిన డీవీసీ కేసును పునరుద్ధరించుకోవచ్చా?

Published on Wed, 07/29/2026 - 11:10

2024లో నేను నా భర్తపై  గృహహింస కేసుతో సహా క్రిమినల్‌ కేసులు దాఖలు చేశాను. అప్పటి నుంచి నా పిల్లలతో కలిసి నా పుట్టింటిలోనే ఉంటున్నాను. 2025లో నా పిల్లల భవిష్యత్తు కోసం, అలాగే నా భర్త మాతో తిరిగి కలుస్తానని నమ్మించడంతో గృహహింస కేసు (డీవీసీ)ను ఎలాంటి షరతులు లేకుండా ఉపసంహరించుకున్నాను. కానీ, ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటికీ మమ్మల్ని కాపురానికి తీసుకెళ్లలేదు. పైగా క్రిమినల్‌ కేసు 498 అ (సీసీ) ఇంకా కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు ఆ కేసును కూడా ఉపసంహరించుకుంటేనే మమ్మల్ని ఇంటికి తీసుకెళ్తానంటూ అర్థం లేని షరతులు పెడుతున్నాడు. 

తన మీద పెట్టిన కేసులు తీసేసేలా మమ్మల్ని నమ్మించి మోసం చేశాడని అర్థమయ్యింది. ఇప్పుడు నా సమస్య ఏమిటంటే...నేను షరతులు లేకుండా ఉపసంహరించుకున్న DVC కేసును పునరుద్ధరించుకునే అవకాశం ఉందా? నా వ్యక్తిగత వస్తువులు, కట్నం కింద ఇచ్చిన భూమి (పత్రాలు), ఇతర సామగ్రి ఇంకా నా భర్త వద్దే ఉన్నాయి. వాటిని కోర్టు ద్వారా తిరిగి పొందడానికి నాకు చట్టపరమైన వెసులుబాటు ఏమైనా ఉందా? దయచేసి నాకు తగిన న్యాయ సలహా అందించగలరు.
– సూసన్, నెల్లూరు

ఏ కేసు అయినా ఉపసంహరించుకునేప్పుడు ఏదైనా సమస్య కొనసాగితే మరలా తిరిగి కేసు ఫైల్‌ చేసే స్వేచ్ఛ ఇవ్వాలి అని కోర్టుని కోరి ఉంటే – అలాంటి స్వేచ్ఛని కోర్టు మీకు ఇవ్వవచ్చు. కానీ మీ కేసులో మీరే స్వచ్ఛందంగా బేషరతుగా ఉపసంహరించుకున్నారు కాబట్టి మరలా అదే కేసును తిరిగి పునరుద్ధరించడం సాధారణంగా కుదరదు. 

అయితే, పరిస్థితులను బట్టి కొత్తగా గృహహింస కొనసాగితే లేదా కొత్త కారణాలు ఏర్పడితే తాజా డీవీసీ దాఖలు చేసే అవకాశం లేక΄ోలేదు. రెండవసారి డీవీసీ కేసు వేయడానికి ఎలాంటి అవరోధమూ లేదు. పైగా మీ భర్త ఉద్దేశపూర్వకం గా మోసగించి కేసు విరమించుకునేలా చేశాడని చెబుతూ, దానిని కోర్టులో నిరూపిస్తే, మీకు మేలు జరుగుతుంది. మీ వ్యక్తిగత వస్తువులు, నగలు, ఆస్తి పత్రాలు లేదా ఇతర సామగ్రిని భర్త అక్రమంగా తన వద్ద ఉంచితే, వాటి స్వాధీనం కోసం డీవీసీ కేసులోనే అదనపు మధ్యంతర ఉత్తర్వులు కోరవచ్చు.

భర్త క్రిమినల్‌ కేసు ఉపసంహరణను షరతుగా పెట్టి కాపురానికి తీసుకెళ్తానని చెప్పడం చట్టపరంగా సమంజసం కాదు. గృహ హింస కేసులు, మెయింటైనెన్స్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాగానీ కాపురం చేయటానికి అడ్డు కాదు. మీ భర్త ఇప్పటికైనా కాపురానికి తీసుకెళ్తారు అంటే, ఎవరైనా లాయర్‌ ద్వారా మధ్యవర్తిత్వం చేసి ఒప్పందం రాసుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. కేసు ఉపసంహరణపై నిర్ణయం తీసుకునే ముందు తప్పనిసరిగా న్యాయవాది సలహా తీసుకోవడం అవసరం. పటిష్టమైన ఒప్పంద పత్రాలు రాసుకుని కేసులు ఉపసంహరించుకుంటే మీకు ఇలాంటి సమస్యలు రావు.

– శ్రీకాంత్‌ చింతల
(హైకోర్టు న్యాయవాది మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్‌ చేయవచ్చు.  )

(చదవండి: టీసీఎస్‌ ఉద్యోగాన్ని కాదనుకుని రైస్‌ వ్యాపారం..! కట్‌చేస్తే ఏడాదికి..)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)