Breaking News

కోర్టుకు వెళ్ళకపోతే భూమేపోవచ్చు..!

Published on Wed, 11/20/2024 - 12:52

నేను ఇటీవలే హైదరాబాద్‌ శివార్లలో కొంతకాలం కొన్నాను. కొనేముందు అమ్మకందార్లు మాకు హద్దురాళ్ళు కూడా చూపించారు. భూమి కొనుగోలు చేసిన తర్వాత కొన్నాళ్ళకి మా హద్దుల ప్రకారం ఫెన్సింగ్‌ వేసుకుందాము అని వెళ్ళగా, మాకు భూమి అమ్మినవారు – మాకు దక్షిణాన ఉన్నవారు కూడా మా భూమి హద్దులు అవి కాదు అని, దాదాపు 10 గుంటల భూమి నష్టపోయేలా హద్దులు చూపిస్తున్నారు. అది మాత్రం కాదు కాబట్టి ఏమీ అనలేకపోతున్నాం. కోర్టుకు వెళ్తే కేసులు పరిష్కారం అయ్యేసరికి చాలాకాలం పడుతుంది. అంతవరకూ మా భూమిలో మేము ఏమీ చేసుకోలేము అంటున్నారు. దయచేసి మా సమస్యకు ఒక పరిష్కారం చూపగలరు.
– జి. రామ్మోహన్, కందుకూరు

భూమిని కొనేటప్పుడు హద్దులు సరిగా చూసుకుని, వీలైతే హద్దురాళ్ళు పాతుకుని, పక్కన ఉన్న భూమి యజమానులను కూడా సంప్రదించి కొంటే, ఇలాంటి సమస్యలు తలెత్తవు. ఏదేమైనా, మీరు ప్రభుత్వానికి సరైన స్టాంప్‌ డ్యూటీ కట్టి, చట్టప్రకారం రిజిస్టర్‌ చేసుకున్నారు కాబట్టి, అంతగా భయపడాల్సిన అవసరం లేదు. మీరు వెంటనే మీకు దగ్గరలోని ఏదైనా ‘మీ సేవా’ కేంద్రానికి వెళ్లి, ‘ఎఫ్‌–లైన్‌’ అప్లికేషన్‌/దరఖాస్తు చెయ్యండి. 

ప్రభుత్వ నిర్ణీత రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకున్నట్లు అయితే 45 రోజుల లోగా రెవిన్యూ అధికారులు మీ భూమిని సర్వేచేసి, హద్దులు చూపిస్తారు. అలా చేయని పక్షంలో, పైఅధికార్లకు, ఆర్‌.డీ.ఓ కి ఫిర్యాదు/దరఖాస్తు పత్రం ఇవ్వండి. అప్పటికీ చేయకపోతే మీరు సర్వే కోసం హై కోర్టును ఆశ్రయించవచ్చు. సర్వే అనంతరం కూడా ఏమైనా సమస్య వుంటే, సివిల్‌ కోర్టులో వ్యాజ్యం ద్వారా మీ భూమిలో మరొకరు జోక్యం చేసుకోకుండా ఆర్డరు పొందవచ్చు.

సివిల్‌ కోర్టులో కేసులు ఆలస్యం అవుతాయి అనేమాట కొంతవరకూ నిజమే. కానీ త్వరితగతిన మీ కేసు పరిష్కరించటానికి చట్టపరమైన వెసులుబాట్లు కూడా ఉన్నాయి. కేసు నడిచినంతవరకు మీ భూమిలో మీరు ఏమీ చేసుకోలేరు అన్నది అవాస్తవం. హద్దుల సమస్య ఉన్నంత భూమి వరకు మీ పక్కవారు రానివ్వరు. మిగతా భూమిలో మీరు ఏమైనా చేసుకోవచ్చు. 

పూర్తిగా కేసు పరిష్కారం అయ్యేలోపు మధ్యంతర ఉత్తర్వులు పొంది, మీ హక్కుని మీరు కాపాడుకోవచ్చు. కోర్టుకు వెళ్తే ఆలస్యం అవుతుంది అని కోర్టుకు వెళ్ళకపోతే భూమేపోవచ్చు కాబట్టి జాగ్రత్త! చట్టపరమైన చర్యలలో మాత్రమే పరిష్కారాలు పొందాలి. అప్పుడే శాశ్వత పరిష్కారాలు అందుతాయి. అలా కాదని అనుకుంటే ముందు ముందు సమస్యలు మరింత జటిలం కావచ్చు!
– శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది
న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com మెయిల్‌ చేయవచ్చు.  

(చదవండి: ఫేమస్‌ బ్రిటిష్‌ మ్యూజిక్‌ బ్యాండ్‌ లోగోకి ప్రేరణ కాళిమాత..!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)