Breaking News

బ్యాంకు వారిని సెటిల్‌ మెంట్‌ అడగవచ్చు

Published on Wed, 04/09/2025 - 09:51

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక పథకం కింద 2019 లో దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం వారే రాయితీ కలిగించి బ్యాంకు నుంచి హామీరహిత రుణం ఇప్పించగా, ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టాను. కొన్ని నెలలపాటు వ్యాపారం బాగానే సాగింది. కానీ కోవిడ్‌ సమయంలో వ్యాపారం మూతపడింది. భారీ అద్దె, జీతాలు, పైగా బ్యాంకు నెలసరి వాయిదా చెల్లింపుల వలన వ్యాపారం మూతపడాల్సి వచ్చింది. అద్దె భరించలేక వ్యాపారం ఆపేసి సామాగ్రి మొత్తం అమ్మేశాము. అలా అమ్మగా వచ్చిన మొత్తాన్ని – మా వద్ద ఉన్న నగదును కలిపి బ్యాంకు వారికి చెల్లించాము. ప్రస్తుతం  పొరుగు రాష్ట్రంలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను. మూడు సంవత్సరాల తర్వాత బ్యాంకు వారు కోర్టు నోటీసులు పంపడమే కాకుండా ‘30 లక్షలు ఉద్దేశపూర్వకంగా చెల్లించలేదు’ అంటూ పోలీసు స్టేషన్లో చీటింగ్‌ కేసు కూడా నమోదు చేశారు.  పోలీసులు అరెస్ట్‌ చేస్తారు అని అంటున్నారు. ఇవన్నీ ఎదుర్కొనే శక్తి ప్రస్తుతానికి నా దగ్గర లేదు. పరిష్కారం చూపగలరు.– సంతోష్, నిజామాబాద్‌

ఈ సమస్య మీ ఒక్కరిది మాత్రమే కాదు. కోవిడ్‌ కి ముందు బ్యాంకు రుణాలు తీసుకున్న చాలా మంది ఇలాగే దివాలా తీయడమే కాక పలు రకాల కేసులు కూడాఎదుర్కొంటున్నారు. బ్యాంకు వారు సాధారణంగా డి.ఆర్‌.టి. (డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌)లో కేసు వేసి బకాయిలను వసూలు చేసుకుంటూ  ఉంటారు. మీరు పొందినది హామీ రహిత రుణం అన్నారు కాబట్టి పెద్దగా ఆందోళన పడవలసిన అవసరం లేదు. అదే విషయాన్ని మీరు డి.ఆర్‌.టీ.కి తెలియ జేసి, ఎలాంటి పరిస్థితులలో మీ వ్యాపారం మూతపడవలసి వచ్చినదో చెప్పండి. అలాగే మీకు సహకారం అందించిన ప్రభుత్వ విభాగానికి కూడా ఒక దరఖాస్తు పెట్టుకుంటూ ఈ విషయాలను వివరించండి.

చీటింగ్‌ కేసులు పెట్టడం కూడా ఈ మధ్య బ్యాంకు వారు సర్వసాధారణంగా చేస్తున్నారు. బహుశా సివిల్‌ కేసులలో రికవరీ కష్టం అనుకున్న సందర్భాల్లో రుణగ్రస్తులను ఒత్తిడికి గురి చేయడానికి ఇలా చేస్తున్నట్టు గమనిస్తున్నాము. ఎందుకంటే రుణం చెల్లించనంతమాత్రాన ప్రతి కేసూ చీటింగ్‌ పరిధిలోకి రాదు. మీ కేసులో మీరు అసలు బ్యాంకు వారిని సంప్రదించలేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక పథకం కింద ప్రభుత్వం వారే మిమ్మల్ని ఎంచుకొని రుణం ఇప్పించారు. మీరు ఆ వ్యాపారాన్ని కూడా మీ శక్తిమేరకు నడిపారు. వ్యాపారం మూతపడటంలో కూడా మీపాత్ర లేదు. కోవిడ్‌ లో కొన్ని వేల వ్యాపారాలు మూతపడ్డాయి. కాబట్టి చీటింగ్‌ కేసు మీ మీద రుజువు కావడం దాదాపు సాధ్యపడదు. చీటింగ్‌ కేసులో సాధారణంగా అరెస్టు చేయరు. స్టేషన్‌ బెయిలు ఇస్తారు.  పోలీసువారికి అన్ని విషయాలను ఆధారంతో సహా సమర్పిస్తే, వారు ఫైనల్‌ రిపోర్టు వేసి మరీ క్లోజ్‌ చేసిన కేసులు నా దృష్టిలో ఉన్నాయి. కాబట్టి మీరు కూడా మీ వద్ద ఉన్న అన్ని రుజువులు  పోలీసువారికి అందజేయండి. ఒకవేళ కోర్టు దాకా వెళ్లినా, ‘మొదటినుంచి వీరు మోసపూరిత భావన కలిగి ఉన్నారు’ అని (బ్యాంకు ) ప్రాసిక్యూషన్‌ ద్వారా ఋజువు చేయవలసి ఉంటుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే, అలా ఋజువు చేయటం బ్యాంకువారికి కష్టమే కావచ్చు. మీ లోను విషయంలో మీరు బ్యాంకు వారిని సంప్రదించి సెటిల్మెంట్‌ కూడా కోరవచ్చు. మిగిలిన మొత్తంలో కొంత మాఫీ చేసి, సెటిల్‌ చేసేందుకు బ్యాంకువారు కూడా ముందుకు వస్తారు. కుదరని పక్షంలో కేసులను  ఎదుర్కొనేందుకు దగ్గర్లోని లాయర్‌ను సంప్రదించండి.
– శ్రీకాంత్‌ చింతలహైకోర్టు న్యాయవాది

మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం  sakshifamily3@gmail.com
చేయవచ్చు.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)