ఉద్యోగం మాని మూడేళ్లయినా ఫైనల్‌ సెటిల్మెంట్‌ రాలేదు?

Published on Wed, 09/10/2025 - 09:43

ఒక పెద్ద కార్పొరేట్‌ కంపెనీలో ఏడాది పాటు పని చేశాను. మరొక మంచి ఉద్యోగం రావడంతో కంపెనీ మారాను. మొదటి కంపెనీ వారు రిలీవింగ్‌ లెటర్‌ ఇస్తూ నా పని విధానం బాగుంది అంటూ – భవిష్యత్తుకు అభినందనలు కూడా తెలియజేశారు. రెండవ కంపెనీ వారు బ్యాక్‌ గ్రౌండ్‌ పరిశీలనలో కూడా నామీద సానుకూలంగానే చె΄్పారు. 3,4 ఏళ్ల తర్వాత ఇప్పుడు మూడవ కంపెనీకి ఇటీవలే మారాను. నా బ్యాక్‌ గ్రౌండ్‌ పరిశీలనలో మొదట పని చేసిన కంపెనీ వారు నా మీద కొన్ని అభియోగాలు మోపారు. నేను వారి కంపెనీ గోప్యతను దెబ్బతీశాను అని, ఫుల్‌ అండ్‌ ఫైనల్‌ సెటిల్మెంట్‌ కూడా ఇంకా చేయలేదు అని చెప్పగా ప్రస్తుతం పని చేస్తున్న కంపెనీ వారు నాకు నోటీసు జారీ చేశారు. 

మూడేళ్ల తర్వాత ఇదేమిటి అని మొదటి కంపెనీ వారిని ప్రశ్నించగా, నా బ్యాక్‌గ్రౌండ్‌ లో ఎటువంటి లోపం లేదు అంటూ మరలా ఒక రి΄ోర్ట్‌ ఇవ్వడంతో ప్రస్తుత కంపెనీ వారు నోటీసును ఉపసంహరించుకున్నారు. కానీ మొదటి కంపెనీ వారు ఇప్పటికీ కూడా ఫుల్‌ అండ్‌ ఫైనల్‌ సెటిల్మెంట్‌ చేయలేదు – అడిగితే వారి గోప్యతకు నేను భంగం కలిగించాను అని అభియోగం ఉన్నది కాబట్టి మేము చేయము అని అంటున్నారు. రెండేళ్ల క్రితం ఒక మెయిల్‌ రాసి వదిలేసాను కానీ ఇప్పుడు ఈ సమస్య వస్తుంది అని అనుకోలేదు. మరొక కంపెనీకి మారినప్పుడు కూడా ఇదే సమస్య రావచ్చు అని అనిపిస్తుంది. ఈ పరిస్థితులలో నేను ఏం చేయాలి?
– జాన్‌ వెస్లీ, విశాఖపట్నం 

ఒక కంపెనీలో ఉద్యోగం చేసిన తర్వాత రిలీవింగ్‌ లెటర్‌ తీసుకుని వెళ్లి మరొక కంపెనీలో కూడా చేరిన తర్వాత, మూడు సంవత్సరాలపాటు నిశ్శబ్దంగా ఉండి, ఇప్పుడు మీ బ్యాక్‌గ్రౌండ్‌ వెరిఫికేషన్‌లో మీకు వ్యతిరేకంగా సమాచారాన్ని ఇవ్వడం చట్టరీత్యా తప్పు. రిలీవింగ్‌ లెటర్‌లో మీ కాండక్ట్‌ కూడా బాగుంది అని రాశారు కాబట్టి, ఒకసారి ఒక స్టేట్మెంట్‌ చేసిన తర్వాత ఆ స్టేట్‌మెంట్‌ను వ్యతిరేకిస్తూ మరొక స్టేట్మెంట్‌ చేయడం కుదరదు. మీ కేసులో అది పరువు నష్టానికి కూడా దారితీస్తుంది. ఒకవేళ కంపెనీ వారికి మీపై ఏదైనా ఫిర్యాదు వంటివి ఉండి ఉంటే వారు సరైన సమయంలోగా మీకు నోటీసులు లేదా సమాచారాన్ని అందించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. 

అయితే మీరు కూడా ఫుల్‌ అండ్‌ ఫైనల్‌ సెటిల్మెంట్‌ రాకపోయినప్పటికీ చాలా సమయాన్ని వృథా చేశారు. ఏది ఏమైనా, సదరు కంపెనీ వారు మీకు భవిష్యత్తులో ఇబ్బంది కలిగే విధంగా బ్యాక్‌గ్రౌండ్‌ వెరిఫికేషన్‌లో సమాధానాలు ఇచ్చే ఆస్కారం లేకపోలేదు. ఉద్యోగం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి కంపెనీ వారితో సామరస్యంగా మాట్లాడి పరిష్కరించుకునే ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. అప్పటికీ కూడా వారు వినకపోతే, అన్ని విషయాలను ΄పోందుపరిచి ఒక లీగల్‌ నోటీస్‌ పంపండి. తదుపరి మీకు రావలసిన ఫుల్‌ అండ్‌ ఫైనల్‌ సెటిల్మెంట్‌తో పాటు మీకు జరిగిన అన్యాయానికి తగిన పరిహారం కోరుతూ సివిల్‌ కోర్టులో దావా కూడా వేయవచ్చు. మీకు లేబర్‌ హక్కుల చట్టాలు వర్తించినట్లయితే లేబర్‌ కమిషనర్‌ను, తద్వారా లేబర్‌ కోర్టును కూడా ఆశ్రయించవచ్చు. 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)