Breaking News

వీలునామా రిజిస్ట్రేషన్‌ తప్పనిసరేం కాదు!

Published on Wed, 06/04/2025 - 09:13

1999లో మా తాతగారు చనిపోవడానికి ఒక సంవత్సరం ముందు వీలునామా రాశారు. అందులో నాకు నా కజిన్‌ (పెద్దమ్మ కూతురు)కి సమానమైన వాటా రావాలి అని చెప్తూనే ఆ వీలునామా మేము ఇద్దరం మేజర్లు అయిన తర్వాత మాత్రమే చెల్లుతుంది అని కూడా రాశారు. నేను, మా కజిన్‌ దాదాపు ఒకటే వయసు వాళ్ళం. 2007లో మేజర్లం అయ్యాం. సమస్య ఏమిటంటే, ఆ వీలునామా రిజిస్టర్‌ కాలేదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ ఆఫీసుకు వెళ్తే ఇది చాలా పాతది – ఈ వీలునామా చెల్లదు, కోర్టును ఆశ్రయించాలి అంటున్నారు. మా మేనమామకు – ఇంకొక పిన్నిగారికి కూడా సంతానం ఉంది కానీ వారికి ఈ ఆస్తిలో మా తాతగారు ఏమీ వాటా ఇవ్వలేదు. ఈ విషయాలు అన్నీ తెలిసినప్పటికీ కూడా ఇప్పుడు మేము కోర్టుకు వెళితే వాళ్లు పేచీ పెడతారని భావిస్తున్నాము. ఏం చేయమంటారు? 
 – సరళ, విశాఖపట్నం

వీలునామా రిజిస్టర్‌ చేసుకోవడం మంచిది అయినప్పటికీ రిజిస్టర్‌ చేయాలి అనే ఖచ్చితమైన నియమం ఎక్కడా లేదు! రిజిస్టర్‌ చేయని వీలునామా అయినా చట్టబద్ధంగా చెల్లుతుంది. ఈ విషయాన్ని ఇదివరకే చాలాసార్లు తెలియజేశాను. చాలా పాత వీలునామా కాబట్టి ఇది చెల్లదు అనడం సరికాదు. వీలునామాను అమలుపరచుటకు (ఎగ్జిక్యూట్‌ చేయుటకు) ఎటువంటి కాలపరిమితీ లేదు. 

మీరు తీసుకువెళ్లిన వీలునామా ఆధారంగా రిజిస్ట్రార్‌ గారు ఖచ్చితంగా మీ పేరున ఆస్తి బదిలీ చేయవలసి ఉంటుంది. పైగా ఈ ఆస్తిపై, సదరు వీలునామాపై అభ్యంతరాలు ఉన్నాయి అంటూ ఎవరు ఎటువంటి ఫిర్యాదులు వాళ్లకు అందనప్పుడు రిజిస్ట్రేషన్‌ను ఆపే హక్కు వారికి లేదు. ఇక్కడ మరో విషయం... కోర్టులో దావా వేస్తే మీరు అనుమానం వ్యక్తపరచిన విధంగా మీ తాత గారి సంతానం అయిన వేరే కుటుంబ సభ్యులు, వారి పిల్లలు ఇప్పుడు పేచీ పెట్టే అవకాశం లేకపోలేదు. 

సివిల్‌ కోర్టుకు వెళ్తే మీరు డిక్లరేషన్‌ సూట్‌ వేయవలసి ఉంటుంది. అయితే సివిల్‌ కోర్టుకు వెళ్లే ముందు, మరొక దరఖాస్తు సదరు రిజిస్ట్రార్‌ గారికి సమర్పించి అక్నాలెడ్జ్‌మెంట్‌ తీసుకోండి. వారు అప్పటికీ వినను అంటే దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లుగా లిఖితపూర్వకంగా వ్రాసి ఇమ్మని అడగండి. అలా ఇచ్చినా ఇవ్వక΄ోయినా, హైకోర్టు లాయర్‌ గారిని సంప్రదించి రిట్‌ పిటిషన్‌ ద్వారా హైకోర్టును ఆశ్రయించి రిజిస్ట్రార్‌ గారి నిర్ణయాన్ని (లేదా మీ దరఖాస్తుపై జాప్యాన్ని) చాలెంజ్‌ చేయండి. హైకోర్టు ద్వారా మీకు అనుకూలమైన ఆర్డర్‌ రావడానికి అవకాశాలు బాగానే ఉన్నాయి. అప్పుడు సివిల్‌ కోర్టుకు వెళ్లవలసిన అవసరం రాదు.

– శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది
(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్‌ చేయవచ్చు. )

(

#

Tags : 1

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)