Breaking News

ప్రైవేటు స్కూళ్లకు సైతం గ్రాట్యుటీ చట్టం వర్తిస్తుంది!

Published on Wed, 04/02/2025 - 10:39

నా పేరు జి.సుధీర్‌. నేను హైదరాబాద్‌ లో ఉంటాను. నేను ఒక కార్పొరేట్‌ విద్యా సంస్థలో గత పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. గత నెల (ఫిబ్రవరి 2025), మా హెడ్‌ నాకు వేరే బ్రాంచ్‌కు బదిలీ చేశారు. కానీ నేనూ ఆ రోజు నుండి డ్యూటీ కి వెళ్ళడం లేదు. నా రాజీనామా కూడా ఇవ్వలేదు. నా చివరి జీతం (ఫిబ్రవరి నెల) పొందడానికి, పి.ఎఫ్‌., గ్రాట్యుటీ సెటిల్‌మెంట్‌ కోసం నేను ఏమి చేయాలి? దీనిపై లీగల్‌గా ప్రోసీడ్‌ అవ్వాలంటే ఎలా? సలహా ఇవ్వగలరు.
– జి. సుధీర్, హైదరాబాద్‌.

ప్రైవేటు స్కూలు అయినప్పటికీ గ్రాట్యుటీ ప్రావిడెంట్‌ ఫండ్‌ పొందడం అనేది మీ హక్కు. ప్రైవేటు స్కూళ్లకు గ్రాట్యుటీ చట్టం వర్తించదు అంటూ పలు స్కూళ్ల యాజమాన్యాలు చేసిన వాదనలను సుప్రీంకోర్టు 2022లో తిరస్కరించింది. కాబట్టి మీరు కూడా గ్రాట్యుటీకి అర్హులు. 

అయితే గ్రాట్యుటీ పొందాలి అంటే మీరు కనీసం ఐదు సంవత్సరాలు (లేదా 4 సంవత్సరాల 7 నెలల కన్నా ఎక్కువ) సదరు సంస్థలో పనిచేసే ఉండాలి. అలా పని చేసి ఉంటే మీకు గ్రాట్యుటీ చట్టం నిర్ణయించిన కాల్కులేషన్‌ (జీతము 15 రోజులు X పనిచేసిన వ్యవధి / 26) ఆధారంగా గ్రాట్యుటీ చెల్లించవలసి ఉంటుంది. 

మీరు పనిచేసిన స్కూలు వారికి లిఖితపూర్వకంగా రాజీనామా చేసి, మీకు రావలసిన పి.ఎఫ్‌., గ్రాట్యుటీ సెటిల్‌మెంట్‌ కోసం ఒక దరఖాస్తు కూడా జత చేయండి. వారు పరిష్కరించని పక్షంలో హైదరాబాదులోని గ్రాట్యుటీ కమిషనర్‌ /లేబర్‌ కమిషనర్‌ను సంప్రదించి ఒక దరఖాస్తు సమర్పించవలసి ఉంటుంది. అలాగే పి.ఎఫ్‌ కూడా ఇవ్వకపోతే, పీ.ఎఫ్‌. కమిషనర్‌ వద్ద దరఖాస్తు/ఫిర్యాదు చేయవలసి ఉంటుంది. 

మీరు పని చేసిన స్కూలు వారికి నోటీసులు పంపించి వారి పక్షం కూడా విన్న తర్వాత మీకు రావలసిన బకాయిలు చెల్లించవలసినదిగా సదరు కమిషనర్లు ఆదేశాలు జారీ చేస్తారు. రెండు విభాగాల నుంచి కూడా మీకు సరైన ఉపశమనం లభిస్తుంది. న్యాయం జరుగుతుంది. ముందు మీరు స్కూల్‌కు రాజీనామా లేఖను అందజేయండి.
– శ్రీకాంత్‌ చింతలహైకోర్టు న్యాయవాది
(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్‌ చేయవచ్చు.)  

(చదవండి: పింక్‌ ట్యాక్స్‌ అంటే..? ఆఖరికి అందులో కూడా వ్యత్యాసమేనా..!)

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)