Breaking News

ఆ.. డిస్కషన్స్ రావు

Published on Sun, 06/08/2025 - 00:25

స్టార్‌ హీరోయిన్‌గా మామూలు వెలుగు వెలగలేదు కాజల్‌ అగర్వాల్‌. పెళ్ళయిన తర్వాత కెరీర్‌ ముగింపుకి వచ్చినట్లే అని అనుకున్న వాళ్ల నోరు మూయించేలా మళ్లీ తెరపైకి రాబోతోంది.

⇒  ఈ ఏడాది కాజల్‌ అగర్వాల్‌కి ఓ రకంగా స్పెషల్‌ ఇయర్‌. జూన్‌ 19న 40వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది.
⇒ 2020లో పెళ్ళయిన తర్వాత ‘భగవంత్‌ కేసరి’లో బాలకృష్ణతో కలిసి నటించింది. ‘ఆచార్య’లో చిరంజీవితో కలిసి నటించే చాన్స్ వచ్చినా, మొదట్లోనే ఆ క్యారెక్టర్‌ని స్క్రిప్టులో నుంచి తీసేశారు. చిత్రీకరించిన సీన్స్, సాంగ్‌ కూడా డిలీట్‌ చేసేశారు.

⇒ హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ జోనర్‌ సినిమా ట్రై చేసి, ‘సత్యభామ’తో మంచి రిజల్ట్స్‌ అందుకోలేకపోయింది.
⇒  సల్మాన్‌ ఖాన్‌ ‘సికిందర్‌’ సినిమా డిజాస్టర్‌ అనే మాట అటుంచి, అసలు ఏ మాత్రం ప్రాధాన్యం లేని క్యారెక్టర్‌ చేసి, అందరిని షాక్‌కి గురి చేసింది కాజల్‌ అగర్వాల్‌.

⇒  ఇటువంటి దశలో – కాజల్‌కి అద్భుతమైన అవకాశం వచ్చింది. విష్ణు మంచు నటిస్తున్న  ‘కన్నప్ప’ సినిమాలో పార్వతీదేవిగా నటిస్తోంది. కాజల్‌కి ఇది మొదటి పౌరాణిక పాత్ర.

⇒  కాజల్‌ అగర్వాల్‌ పార్వతీదేవి గెటప్‌ చూసే, మండోదరి పాత్ర ఆఫర్‌ వచ్చింది. సాయి పల్లవి, రణ్‌బీర్‌ కపూర్‌ – సీతారాములుగా నటిస్తున్న ‘రామాయణం’ సినిమాలో యశ్‌ రావణాసురుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అతని సరసన మండోదరిగా కాజల్‌ అగర్వాల్‌ నటించబోతోందని సమాచారం.
⇒  విష్ణు మంచుకి ట్విన్‌ సిస్టర్‌గా ‘మోసగాళ్ళు’ సినిమాలో నటించింది కాజల్‌ అగర్వాల్‌. ఆ పరిచయం కారణంగానే పార్వతీదేవి పాత్ర వచ్చింది.

⇒  అక్షయ్‌ కుమార్‌ శివుడు క్యారెక్టర్‌ చేస్తున్నాడనే సంగతి తెలిసిందే! కొన్నేళ్ళ ముందు అక్షయ్‌ కుమార్‌ కాంబినేషన్‌లో ‘స్పెషల్‌ ఛబ్బీస్‌’ సినిమాలో చేసింది కాజల్‌ అగర్వాల్‌ .
⇒  వ్యక్తిగత విషయాలకొస్తే, భర్త గౌతమ్‌ ఇంటీరియర్‌ డెకార్స్‌కి సంబంధించిన ఇ కామర్స్‌ బిజినెస్‌ చేస్తుంటాడు. భర్త ఆదాయం కన్నా– కాజల్‌ అగర్వాల్‌ ఆస్తి పాస్తులు ఎక్కువ. తామిద్దరి మ«ధ్య ఫైనాన్షియల్‌ మేటర్స్‌ గురించి డిస్కషన్స్ రావని చెప్పింది కాజల్‌.

⇒  నటిగా ఎంత బిజీగా ఉన్నా, బాబు ఆలనా పాలనకి ఇంపార్టెన్స్‌ ఇస్తానని చెప్పింది. ‘సత్య భామ’ షూటింగ్‌కి కొడుకుని ముంబై నుంచి తనతో పాటు తీసుకొచ్చింది. ప్రైవేట్‌ హౌస్‌లో ఉండి, బాబుతో టైమ్‌ స్పెండ్‌ చేసింది.
⇒  పెళ్ళయిన తర్వాత హీరోయిన్లకి కెరీర్‌ ముగిసి పోయిందనేది ఇప్పుడు కరెక్ట్‌ కాదని, కొత్తదారులకు తలుపులు తెరుచుకుంటాయని అంటుంది కాజల్‌ అగర్వాల్‌. 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)