Breaking News

ల్యాబ్‌లో తయారైన డైమండ్‌ అచ్చమైన వజ్రమేనా?!

Published on Sat, 12/21/2024 - 14:43

ఆభరణాల్లో ల్యాబ్‌ గ్రోన్‌ డైమండ్స్‌ హవా మొదలైంది. ఆభరణాల్లో  పొదగడం మొదలైన తర్వాత వీటి గురించి తెలుస్తోంది. కానీ నిజానికి ల్యాబ్‌ గ్రోన్‌ డైమండ్స్‌ తయారీ 1950లలోనే మొదలైంది. అప్పట్లో పారిశ్రామిక అవసరాలకు, డెంటల్‌ ట్రీట్‌మెంట్, ఎయిర్‌΄ోర్ట్‌ రన్‌వేలలో ఉపయోగించేవారు. వజ్రానికి ఉన్న గట్టిదనం దృష్ట్యా వీటిని ఉపయోగించేవారు. అప్పటి వరకు డైమండ్‌ అంటే మనకు తెలిసింది ఆభరణాల్లో వాడే మైన్‌డ్‌ డైమండ్స్‌ గురించి మాత్రమే. 

ఇవి భూమిలోపలి   పొరల్లో కార్బన్, వాయువుల ఒత్తిడితో వేల సంవత్సరాలకు వజ్రం రూపం సంతరించుకున్నాయి. అదే కంపోజిషన్‌లో అదే వాతావరణ పరిస్థితులను లాబొరేటరీలో కల్పించినప్పుడు డైమండ్‌ ఓర్‌ పూర్తిస్థాయి వజ్రంగా రూపొందుతుంది. అంటే భూమి  పొరల్లో వందల ఏళ్లకు జరిగే ప్రక్రియ లాబొరేటరీలో కొద్ది వారాల్లో పూర్తవుతుంది. 

  • వజ్రాల రాశిలో నుంచి ల్యాబ్‌ డైమండ్‌ని, మైన్‌డ్‌ డైమండ్‌ని వేరు చేయడం సాధ్యం కాని పని. థర్మల్‌ కండక్టివిటీ పెన్‌ టెస్ట్‌ ద్వారా కూడా వర్గీకరించలేం. అడ్వాన్స్‌డ్‌ యూవీ కార్బన్‌ డాటింగ్‌ టెస్ట్‌ ద్వారా వజ్రం వయసును కనుక్కోవడం మాత్రం సాధ్యమవుతుంది. 

  • క్లారిటీ వర్గీకరణ, కలర్‌ గ్రేడింగ్, సర్టిఫికేషన్‌లో రెండింటికీ ఒకే ప్రమాణాలు పాటిస్తారు. ఇప్పుడు ల్యాబ్‌ డైమండ్స్‌లో   పోల్కీలు కూడా వస్తున్నాయి. 

  • సాధారణంగా అయోమయానికి గురి చేసేవి అమెరికన్‌ డైమండ్స్‌ మాత్రమే. ఆ పేరుతో దొరికేవి సీజెడ్స్‌. అంటే క్యూబిక్‌ జెరకాన్స్‌. సాంకేతిక నామం సీజెడ్స్‌ అయితే వాటిని మార్కెట్‌లోకి తెచ్చిన బ్రాండ్‌ పేరు అమెరికన్‌ డైమండ్స్‌. ఇప్పుడు లభిస్తున్న మోజనైట్స్‌ కూడా దాదాపు అలాంటివే. వాటిని సిమిలెంట్స్, సింథటిక్స్‌ పేర్లతో వ్యవహరిస్తారు. 

  • ధరించడం, భద్రపరచడం విషయంలో ల్యాబ్‌ డైమండ్స్‌  పొదిగిన ఆభరణాలకు కూడా మైన్‌డ్‌ డైమండ్స్‌ ఆభరణాలకు పాటించిన నియమాలే వర్తిస్తాయి. ఇవన్నీ తెలిసిన తర్వాత వచ్చే ప్రధానమైన  సందేహం రీసేల్‌ వాల్యూ గురించి. ల్యాబ్‌ డైమండ్స్‌కి కూడా నూటికి నూరుశాతం  ఎక్సేంజ్‌ వాల్యూ, 80 శాతం రీసేల్‌ వాల్యూ ఉంటుంది.

– విశేషిణి రెడ్డి, జీఐఏ జెమ్మాలజిస్ట్‌

 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు