Breaking News

మంత్రదండంలాంటి ఉంగరం..!

Published on Sun, 11/24/2024 - 15:47

ఇప్పటికే చాలా రకాల స్మార్ట్‌ రింగులు మార్కెట్‌లోకి వచ్చాయి. వాటిలో చాలా రకాలు శరీర ఆరోగ్య పరిస్థితిని గుర్తించి యాప్‌ ద్వారా అప్రమత్తం చేస్తాయి. తాజాగా చైనాకు చెందిన ‘టు ఆల్‌ టెక్‌’ తయారు చేసిన ‘ఎల్‌–రింగ్‌2’ అనే ఈ ఉంగరం దాదాపు మంత్రదండం మాదిరిగానే పనిచేస్తుంది. ఇది వెనువెంటనే అనువాదం చేస్తుంది. 

లాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు వంటివి ఉపయోగించేటప్పుడు ఇది ఎయిర్‌ మౌస్‌లా ఉపయోగపడుతుంది. మాటలను ఎంపిక చేసుకున్న భాషలోని అక్షరాల్లోకి మారుస్తుంది. ప్రపంచంలోని ప్రధాన భాషలైన ఇంగ్లిష్, ఫ్రెంచ్, చైనీస్, జపానీస్, కొరియన్, జర్మన్, స్పానిష్, అరబిక్, పోర్చుగీస్, ఇటాలియన్‌ భాషల్లో ఇది తక్షణ అనువాద సేవలను అందిస్తుంది. ఇది జెశ్చర్‌ మోడ్‌లో కూడా పనిచేస్తుంది. 

అరచేతి ద్వారా చేసే పదహారు రకాల సంజ్ఞలకు అనుగుణంగా ఇది కర్సర్‌ కదలికలను నియంత్రిస్తుంది. దీనిని ఆండ్రాయిడ్, యాపిల్‌ ఐఓఎస్, విండోస్, హార్మొనీ ఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ ద్వారా వాడుకోవచ్చు. ఈ ఉంగరంతో పాటు ఇచ్చే పెట్టె చార్జింగ్‌ చేసుకోవడానికి, రకరకాల మోడ్స్‌ను మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. పెట్టెతో కలిపి దీని బరువు 33 గ్రాములు. ఉంగరం బరువు 2.8 గ్రాములు. దీని ధర 99 డాలర్లు (రూ.8,354) మాత్రమే! 

(చదవండి: అశోకుడి కాలం నాటి కోట.. ఏకంగా ఏథెన్స్‌ నగరాన్నే..!)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)