Breaking News

కొండవీడు కత్తుల బావి

Published on Sun, 06/08/2025 - 01:37

పర్యాటక ప్రాంతాల్లో అలనాటి రాజుల కోటలు ముందు వరుసలో ఉంటాయి. వాటి చరిత్ర, శిల్పకళ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. దేశంలో అనేక కోటలు పర్యాటక కేంద్రాలుగా మారి, చరిత్ర ప్రేమికులను, సాహస యాత్రికులను, సాధారణ పర్యాటకులను కూడా అలరిస్తున్నాయి. అలాంటి కోవకు చెందినదే ఈ కొండవీడు కోట.ఇది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ కోటల్లో ఒకటి. కోటకు వెళ్లేమార్గం, పాములా వంకర్లు తిరిగిన ఘాట్‌ రోడ్డుపై ప్రయాణం ఉత్సాహభరితంగా సాగుతుంది. ఇప్పుడిప్పుడే పర్యాటకంగా కొండవీడు నూతన శోభను సంతరించుకుంటోంది. 

ఒకప్పటి ఈ అద్భుత నిర్మాణం నేడు శిథిలావస్థకు చేరింది. అయినా ఆనాటి కట్టడాలు, ప్రకృతి అందాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలో సముద్ర మట్టానికి 1700 అడుగుల ఎత్తులో కొండవీటి కొండపై ఉంటుందీ కోట. రెడ్డి రాజుల్లో మొదటి వాడైన ప్రోలయ వేమారెడ్డి అద్దంకిని రాజధానిగా చేసుకుని స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. అనంతరం అతని కుమారుడు అనపోతారెడ్డి రాజయ్యాక, అద్దంకి నుంచి రాజధానిని కొండవీడుకు మార్చాడు. శత్రుమూకల దండయాత్రల నుంచి రాజ్యాన్ని కాపాడటానికి ఈ కోటను నిర్మించాడు.

2010లో హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం రీసెర్చ్‌ స్కాలర్‌ రుచీ సింగ్, హిస్టరీ ప్రొఫెసర్‌ కేవీ రావులు కొండవీడును సందర్శించారు. అదే సమయంలో శివాలయం గర్భగుడి కింద బౌద్ధ చైత్యం వెలుగు చూసింది. శాతవాహనుల కాలంలోనే కొండవీడు బౌద్ధక్షేత్రంగా విరాజిల్లిందని చరిత్ర చెబుతోంది.

ఆ బురుజులే కాపలాకేంద్రాలు 
కొండవీడు దుర్గంలో 72 కోట బురుజులతో పాటు ప్రాకారాలు, ధాన్యాగారాలు, దేవాలయాలు, గుర్రపుశాలలు, ఆయుధశాల, మసీదు, ఖజానా వంటి నిర్మాణాలు నాటి చరిత్రకు ఆనవాళ్లుగా కనిపిస్తాయి. తారా బురుజు, జెట్టి బురుజు, నెమళ్ల బురుజులు వీటిలో ప్రత్యేకమైనవి. ఈ బురుజులే నాటి సైనికుల కాపలా కేంద్రాలుగా ఉండేవి. శత్రువులు కొండ వరకు రాకుండా కొండల దిగువ చుట్టూ కందకాలను వెడల్పుగా తవ్వి, ఆ నీటిలో మొసళ్లను వదిలారు.

నీటి సమస్య రాకుండా..
కోట పరిసరాల్లో పురావస్తుశాఖ తవ్వకాలు జరపగా రెండువేల ఏళ్లనాటి బౌద్ధస్థూపం, మట్టిపాత్రలు, చైనాకు సంబంధించిన పింగాణీ పాత్రల ముక్కలు బయటపడ్డాయి. నీటి అవసరాల కోసం కొండమీద ముత్యాలమ్మ, పుట్టాలమ్మ, వెదుళ్ల అనే మూడు గొలుసుకట్టు చెరువులు తవ్వారు. ఈ మూడూ సుమారు 12 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ మూడూ పూర్తిగా నిండితే కొండలమీదుగా కింది ప్రాంతాల్లోకి ప్రవహించి అక్కడి చెరువులు నిండేలా ఏర్పాటు చేసిన వ్యవస్థ నేటి తరానికి ఆదర్శప్రాయం.

కత్తుల బావి నేపథ్యమిదీ!
కొండవీడు కోట పేరు ప్రస్తావించగానే ముందుగా గుర్తుకొచ్చేది కత్తుల బావి. దీని వెనుక ఓ పెద్ద కథే వినిపిస్తుంది. ఆనాటి రెడ్డిరాజ్యంలోని 72 మంది సామంత రాజులను మట్టుబెట్టేందుకు ఓ బ్రాహ్మణుడు ఈ ఆలయం నిర్మించాడని ప్రతీతి. గర్భగుడి చెంతనే ఓ బావిని తవ్వించి, అందులో కత్తులు దాచి, సామంతరాజులను విందుకు ఆహ్వానించారని, బాలకృష్ణుని ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చిన సామంత రాజులంతా హత్యకు గురయ్యారని ఓ కథ ప్రచారంలో ఉంది. అలా ఆ బావిలో కత్తులు దాచినందువల్ల కత్తుల బావిగానూ, ఆ ప్రాంతం చీకటిగా ఉన్నందున చీకటి కోనేరుగానూ పేరొచ్చింది.

విజయానికి చిహ్నం
ఈ ఆలయానికి అభిముఖంగా 45 అడుగుల ఎత్తులో ఏకశిలా విజయస్థూపం ఉంది. విజయనగర రాజులు కొండవీడును హస్తగతం చేసుకున్న విజయానికి సూచికగా ఈ ఏకశిలా స్థూపాన్ని ఏర్పాటు చేశారు. రెడ్డిరాజుల పతనానంతరం కోట విజయనగర ప్రభువుల పరమైంది. అనంతరం గోల్కొండ సుల్తానుల చేతుల్లోకి వెళ్లింది.

యునెస్కో గుర్తింపు లభిస్తే!
2016లో తొలిసారిగా కొండవీడును చారిత్రక ప్రదేశంగా గుర్తించి, యునెస్కో జాబితాలో చేర్చాలంటూ ప్రతిపాదనలు వెళ్లాయి. దీనిపై సమగ్రంగా పరిశీలించి నివేదిక పంపించాలంటూ కేంద్రప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కొండవీడు సమగ్ర స్వరూపాన్ని వివరించే బ్లూప్రింట్‌ పనులు నిర్వహించేందుకు హైదరాబాద్‌లోని ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సర్కిల్‌ సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక దీన్ని యునెస్కో చారిత్రక వారసత్వ కట్టడ జాబితాలో చేర్చితే ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న కట్టడాలకు పునరుజ్జీవం లభిస్తుంది. కోట పరిసర ప్రాంతాలన్నీ పర్యాటకంగా అభివృద్ధికి నోచుకుంటాయి.

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)