Breaking News

అక్కడ కాళీమాతకు నైవేద్యంగా న్యూడిల్స్‌..!

Published on Sun, 12/01/2024 - 15:36

హిందూవుల అత్యంత పవర్‌ఫుల్‌ దేవత కాళీమాత. ఆమె పూజ విధానం, ఆచారా వ్యవహారాలు అత్యంత విభిన్నంగా ఉంటాయి. అలాంటి శక్తిమంతమైన దేవత కాళీమాతకు నైవేద్యంగా న్యూడిల్స్‌ని నైవేద్యంగా పెట్టడం గురించి విన్నారా..? అది కూడా శక్తి పీఠాల్లో ఒకటిగా అలరారుతున్న కోల్‌కతాలోనే ఓ మామూల ప్రాంతంలోని రోడ్డు పక్కన ఉంది. అయితే ఆ దేవతను ఎవరూ కొలుస్తున్నారో వింటే ఆశ్చర్యపోతారు.

కలకత్తాలోని చైనీస్‌ టౌన్‌గా పిలిచే టాంగ్రా ప్రాంతంలో ఈ కాళిమాత ఆలయం ఉంది.  రహదారి పక్కనే ఉన్న ఓ చెట్టు వద్ద ఉంది. ఈ అమ్మవారిని తొలుత స్థానిక హిందువులు పూజించేవారు. ఆ తర్వాత అక్కడే నివశించే చైనా కమ్యూనిటీవారిచే పూజలు అందుకోవడమే గాక వారే ఆ చెట్టు వద్ద చిన్నగా ఉన్న ఆలయాన్ని పునరుద్ధరించి వారి ఆచార వ్యవహారంలో నిర్మించారు. 

అలా క్రమంగా ఆ ఆలయం పేరు చైనీస్‌ కాళీమందిరంగా ఏర్పడింది. ఈ గుడికి సంబంధించి ఓ ఆసక్తికర కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అదేంటంటే..ఒక చైనీస​ బాలుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యలు అతడిపై ఆశ వదిలేసుకోవాలని చెప్పడంతో ఆ బాలుడి కుటుంబ సభ్యులు ఈ కాళీ మందిరానికి తీసుకువచ్చి..భక్తితో పూజించడం ప్రారంభించారు. అనూహ్యంగా కొద్ది రోజుల్లోనే ఆ బాలుడు కోలుకోవటం ప్రారంభించాడు. అప్పటి నుంచి అక్కడ ఉండే చైనా వాళ్లే ఈ అమ్మవారిని భక్తిగా కొలవడం ప్రారంభించారు. 

ఈ ఆలయ బాగోగులు చూసుకునేది కూడా ఓ చైనీస్‌ వ్యక్తే. అతడు తనను తాను చైనీస్‌ హిందువుగా పేర్కొనడం వివేషం. అంతేగాదు ఈ చైనీస్‌ కాళీ మందిరంలో అమ్మవారికి న్యూడిల్స్‌ని నైవేద్యంగా పెడతారట. దాన్నే భక్తులకు ప్రసాదంగా ఇస్తారట. ఇలా ఎన్నో ఏళ్లుగా న్యూడిల్స్‌నే కాళీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. 

ఆ ఆలయం కూడా చైనీస్‌ డ్రాగన్‌ పెయింట్‌తో ఉంటుంది. ఆ విగ్రహ వెనకాల ఓం గుర్తుల తోపాటు చైనా మూలాంశాలతో కూడిన గుర్తులు కూడా ఉంటాయి. ఈ మాతను దర్శించుకునేందుకు సుదూరప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలిరావడం విశేషం. 

(చదవండి: కోడిపుంజులాంటి హోటల్‌..!)
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)