Breaking News

కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ స్కీమ్‌ గడువు ఎప్పటిదాకా అంటే..!

Published on Sat, 04/05/2025 - 12:26

మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఉన్న పథకాలు,  శిక్షణ కార్యక్రమాలు, మార్కెట్‌ మెళకువలు, అందుతున్న రుణాలు, వడ్డీ రేటు, సబ్సిడీలు, ఎక్కడ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి,  అవసరమైన డాక్యుమెంట్లు, సక్సెస్‌ రేట్‌ వంటి  వివరాలను ‘‘ఓనర్‌‘షి’ప్‌’’ పేరుతో  ప్రతి శనివారం అందిస్తున్నాం! ఈ వారం స్కీమ్‌ కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌

 

 తెలంగాణ ప్రభుత్వ రాజీవ్‌ యువ వికాస పథకానికి ఏప్రిల్‌ 14 ఆఖరు : తెలంగాణ యువతను ఆంట్రప్రెన్యూర్‌షిప్‌ వైపు నడిపించడానికి తెలంగాణ ప్రభుత్వం రాజీవ్‌ యువ వికాస పథకాన్ని  ప్రారంభించింది. దీనికింద రూ. నాలుగు లక్షల వరకు రుణసహాయాన్ని అందిస్తోంది. రాయితీ సౌకర్యమూ ఉంది. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్‌ 14.. ఆఖరు తేదీ. ఆ గడువులోపే అప్లై చేసుకోవాలి.

ప్రధాన మంత్రి మత్స్యకార అభివృద్ధి పథకం కింద పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. అందులో ఒకటి కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ (కేసీసీ) స్కీమ్‌. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల కింద రైతులు పాడి, పశువులు, చేపల పెంపకం వంటివి  ప్రారంభించడానికి కేసీసీతో దరఖాస్తు చేసుకొని రుణాన్ని  పొందవచ్చు. కొన్ని రాష్ట్రాలు మత్స్య సంపద అభివృద్ధి కోసం వడ్డీలేని ప్రత్యేక రుణాలు, గ్రాంట్లు, బీమా పథకాలు వంటివీ అందిస్తున్నాయి. వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా చేపల పెంపకం యూనిట్లకు రుణాలు మంజూరు చేస్తున్నాయి. 

చదవండి : మొన్ననే ఎంగేజ్‌మెంట్‌, త్వరలో పెళ్లి, అంతలోనే విషాదం

చేపలు, రొయ్యల పెంపకంలో అధిక దిగుబడి, లాభాల కోసం ప్రభుత్వం అందిస్తున్న శిక్షణను  పొందడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని పెంపొందిచుకోవడం ముఖ్యం. పరిశుభ్ర వాతావరణంలో చేపల అమ్మకాలను  ప్రోత్సహించడానికి ఈ శాఖ చేపల మార్కెట్‌ల నిర్మాణాలనూ చేపడుతోంది. 

చదవండి: ఏ భర్తా ఇవ్వలే(కూడ)ని వెడ్డింగ్‌ డే గిఫ్ట్‌ : కళ్లు చెమర్చే వైరల్‌ వీడియో

ఇప్పటివరకు రూ.760.89 లక్షల ఆర్థిక వ్యయంతో 84 చేపల మార్కెట్లను మంజూరు చేసింది. అలాగే మత్స్యకారుల సహకార,  పొదుపు సంఘాలనూ ఏర్పాటు చేసింది. మత్స్యకారులు, చేపల పెంపకందారుల (ఫిష్‌ ఫార్మర్స్‌) మూలపెట్టుబడి అవసరాలకు (విత్తనాలు, దాణా, సేంద్రియ ఎరువులు,  చార్జీలు, ఇంధనం, విద్యుత్‌ చార్జీలు, బీమా, శ్రమ, లీజు, అద్దె, నిర్వహణ ఖర్చులు మొదలైనవి) సరళీకృత విధానంలో ఒకే విండో కింద సకాలంలో తగినంత రుణ సహాయాన్ని అందించడం కిసాన్‌ క్రెడిట్‌ పథకం ముఖ్య లక్ష్యం. అంతేకాక కొన్ని ప్రత్యేక స్కీమ్‌ల కింద పడవలు, వినియోగ వస్తువులు, వలలు, గాలాలు వంటి వాటికీ సబ్సిడీ అందుతోంది.   

-బి.ఎన్‌. రత్న బిజినెస్‌ కన్సల్టెంట్, దలీప్‌

మీ సందేహాలను పంపవలసిన మెయిల్‌ ఐడీ ownership.sakshi@gmail.com 
నిర్వహణ : సరస్వతి రమ 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)