Breaking News

ఎవరు పేద? ధనం లేకపోయినా పరవాలేదు గానీ..!

Published on Thu, 05/01/2025 - 11:04

ఒక వ్యక్తి హజ్రత్‌ జునైద్‌ బొగ్దాదీ (ర) వద్దకు వచ్చి: ‘అయ్యా.. నేనొక నిరుపేదను. పేదరికం నా కాళ్ళూ చేతులూ కట్టి పడేసింది. ఎవరికీ ఏమీ చేయలేకపోతున్నాను. దీనికి కారణం ఏమిటీ?.’ అని ప్రశ్నించాడు. దానికి జునైద్‌ బొగ్దాదీ, ‘నువ్వు దానధర్మాలు చేస్తావా? ఇతరులపట్ల ఉదారబుద్ధితో వ్యవహరిస్తావా?’ అని ఎదురు ప్రశ్నించారు. ‘అయ్యా.. అదేకదా నా సమస్య, నేనే నిరుపేదను. ఆ కారణంగానే ఏమీ చేయలేక పోతున్నానన్నదే నా బాధ. దానధర్మాలు చేయడానికి, ఉదారంగా వ్యవహరించడానికి నా దగ్గరేమున్న దని.?’ అన్నాడా వ్యక్తి నిర్లిప్తంగా..

‘అదేమిటీ అలా అంటావు? ఎంతో గొప్పసంపద ఉంది. పరులతో పంచుకోగల నిధులున్నాయి నీ దగ్గర. ’ అన్నారు బొగ్దాదీ. ఆ వ్యక్తి ఆశ్చర్యచకితుడై, ‘అయ్యా.. నేను చాలా చిన్నవాణ్ణి. నన్ను ఆట పట్టించకండి’ అన్నాడు.

‘అయ్యయ్యో..! ఆట పట్టించడంకాదు. ఇది నిజం. నేను చెబుతావిను.’ అంటూ.. ‘నీ దగ్గర ఉన్న గొప్ప సంపద నీ ముఖారవిందం. ఎంత పేదరికమైనా, ఎన్ని కష్టాలొచ్చినా ముఖంపై చిరునవ్వును చెదరనీయకు. ఇతరులను చిరునవ్వుతో పలకరించడం కూడా సదఖాతో సమానం అన్నారు మన ప్రవక్త. (జామె తిర్మజీ 1956) దీనికోసం ధనం అవసరంలేదు. ఇది పూర్తిగా ఉతం. ఇది ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది.

రెండవది కళ్ళు. ఇవి లక్షలాది మందిని ప్రభావితం చేస్తాయి. ఆ కళ్ళతో ఒక్కసారి అమ్మవైపు ప్రేమతో చూస్తే ఒక హజ్‌ చేసినంత పుణ్యం లభిస్తుంది. హజ్‌ అంటే ధనవంతులు చేయగలిగే ఆరాధనే గదా..!’ 

మూడవది నోరు. నోరు మందైతే ఊరు మందవుతుంది. ధనం లేకపోయినా పరవాలేదు. నోరు బాగుంటే చాలు. అంతేకాదు, నోటితో ఇతరులకు మంని బోధించవచ్చు. మంని చర్చించవచ్చు. దాన్ని విలువైనదిగా భావించు. ఆనందం, సానుకూలత వ్యాప్తి చెందుతాయి. ‘నీదగ్గరున్న మరోనిధి నీ మనసు. మంచి ఆలోచనలతో ఉదయాన్ని ప్రారంభిస్తే, ప్రశాంతత నీసొంతమవుతుంది. మానసిక ప్రశాంతత  ప్రాప్తమైతే నీ అంత ధనవంతుడు మరెవరూ ఉండరు. తద్వారా ఇతరుల ఆనందంలో, కష్టసుఖాల్లో పాలుపంచుకోవచ్చు. వారి జీవితాలను తాకవచ్చు. మరోగొప్ప సంపద నీ శరీరం. దాంతో ఇతరులకు అనేక మంచి పనులు చేయవచ్చు. అవసరమైన వారికి సహాయం అందించవచ్చు. సహాయం చెయ్యడానికి డబ్బులే అవసరం లేదు.
మంచి మనసుంటే చాలు. ఇప్పుడు చెప్పు నువ్వు పేదవాడివా?’ అన్నారు జునైద్‌ బొగ్దాదీ రహ్మతుల్లా అలై. ఈ మాటలు విన్న ఆ వ్యక్తి పరమానందభరితుడై, ఆత్మసంతోషంతో, ఆత్మవిశ్వాసంతో పెద్దపెద్ద అంగలు వేసుకుంటూ ముందుకు సాగిపోయ్యాడు.
– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌ 
 

#

Tags : 1

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)