Breaking News

మామిడి ఒరుగులు: 15 వేల రూపాయలు పెడితే లక్ష ఆదాయం.. అప్పటి నుంచి!

Published on Sat, 06/11/2022 - 10:20

సీజనల్‌గా ప్రకృతి ఇచ్చే వరాల్లో మామిడి ఒకటి. మామిడి కాయలనే ఉపాధిగా మార్చుకుంది ఖమ్మం జిల్లా మండాలపాడు వాసి రావిలాల అనూష. ఏడేళ్ల క్రితం 15  వేల రూపాయలతో మామిడి ఒరుగుల వ్యాపారాన్ని మొదలుపెట్టిన అనూష నేడు 30 మంది మహిళలకు ఉపాధి ఇస్తోంది.

వేసవిలో రెండు నెలలు మాత్రమే చేసే ఈ తయారీ మార్కెట్‌ రంగంలో తనకో కొత్త మార్గాన్ని చూపింది అని వివరించింది అనూష. 

‘మాది వ్యవసాయ కుటుంబం. నేను డిగ్రీ వరకు చదువుకున్నా. పెళ్లై, ఇద్దరు పిల్లలు. ఎకరంన్నర భూమిలో పత్తి సాగు చేస్తున్నాం. ఏడేళ్ల క్రితం మార్కెట్‌లో పత్తి అమ్ముతున్నప్పుడు మామిడి ఒరుగుల వ్యాపారం గురించి తెలిసింది. సాధారణంగా ప్రతి వేసవిలో ఇంట్లో మామిడి ఒరుగులను తయారుచేసుకుంటాం. వాటిని వర్షాకాలంలో వంటల్లో వాడుకుంటాం.

అలాంటి ఈ ఒరుగులను పొడి చేసి, ఉత్తరభారతదేశంలో పెద్ద మార్కెట్‌ చేస్తున్నారని తెలిసింది. పులుపుకు బదులుగా వంటల్లో ఆమ్‌చూర్‌ పొడిని వాడుతుంటారని, ఈ బిజినెస్‌లో మంచి లాభాలు చూడవచ్చని తెలుసుకొని, దీని తయారీనే పెద్ద ఎత్తున చేయాలనుకున్నాం.  

పదిహేనువేల రూపాయలతో మొదలు
మొదటి ఏడాది మావారు రామకృష్ణ నేను కలిసి 15వేల రూపాయలతో మామిడికాయలను కొనుగోలు చేశాం. మా బంధువుల నాలుగు మామిడి చెట్ల నుంచి 2 టన్నుల వరకు మామిడి కాయలు సేకరించి, ముక్కలు కోసి ఎండబెడితే ఏడు సంచులు అయ్యాయి. వాటిని అమ్మాం. ముందు మా కుటుంబమే ఈ పనిలో నిమగ్నమైంది. తర్వాత తర్వాత పనికి తగినట్టు ఇతరులను నియమించుకున్నాం.

ఆ యేడాది లక్ష రూపాయల ఆదాయం చూశాం. తర్వాత ఏడాది ఇంకాస్త ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి, ఇరవై క్వింటాళ్ల ఒరుగులు తయారుచేసి నిజామాబాద్‌ తీసుకెళ్లి మార్కెట్‌ చేశాం. 

నష్టం వచ్చినా వదల్లేదు
ప్రతి యేటా పనిని పెంచుతూనే వస్తున్నాం. ఐదేళ్లుగా ప్రతియేటా 50 క్వింటాళ్ల ఒరుగులు తయారుచేస్తున్నాం. ఒకసారి లాభం వచ్చిందంటే, మరోసారి తీవ్రమైన నష్టం కూడా చూస్తున్నాం. మామిడికాయ నుంచి ముక్క కట్‌ చేసి, ఆరబెట్టాక బాగా ఎండాలి. ఏ మాత్రం వర్షం వచ్చినా, ఒరుగులు పాడైపోతాయి. అమ్ముడుపోవు. వాతావరణం మీద ఆధారపడే తయారీ విధానం కాబట్టి, సమస్యలు తప్పవు.

మా ఇంటిపైన, ఖాళీగా ఉన్న రోడ్డువారన మామిడి ముక్కలను ఎండబెడుతుంటాం. దాదాపు ఎండల్లోనే పని అంతా ఉంటుంది. రెండు నెలల పాటు టెంట్లు వేసి, ఈ పని చేస్తుంటాం. ఈ పనిలో అంతా మహిళలే పాల్గొంటారు. రోజూ 30 మందికి పైగా పాల్గొనే ఈ పని రెండు నెలల పాటు కొనసాగుతుంది. 

మా వర్క్‌ చూసి డీఆర్‌డీఎ, వి–హబ్‌ వాళ్లు రుణం ఇచ్చి సాయం చేశారు. కారం, పసుపు మిషన్లను కూడా కొనుగోలు చేశాం. ఒరుగులను పొడి చేసి అమ్మాలనుకున్నాం. ‘కృషి’ పేరుతో లేబుల్‌ కూడా వచ్చింది. కానీ, ఒరుగులను పొడి చేసే మిషన్లతో పాటు, లేబుల్‌ ప్రింట్‌కు, ప్యాకింగ్‌కి లక్షల్లో ఖర్చు అవుతుంది. వచ్చే ఏడాది ఆమ్‌చూర్‌ పొడిని మా సొంత లేబుల్‌తో అమ్మాలని ప్రయత్నాలు చేస్తున్నాను’ అని వివరించింది అనూష. 
– నిర్మలారెడ్డి 

Videos

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై మరో అక్రమ కేసు బనాయింపు

IPL మ్యాచ్ లు ఎలా షూట్ చేస్తారు? తెరవెనుక రహస్యాలు..!

మిస్ వరల్డ్ వివాదం 2025.. పోటీ నుండి తప్పుకున్న బ్రిటిష్ బ్యూటీ.. కారణం అదేనా..!

YSRCP నేతలను చావబాదడమే నా టార్గెట్

కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్.. రంగంలోకి వైఎస్సార్సీపీ నేతలు

రైతులపై సోలార్ పిడుగు

కరోనా వచ్చినా.. I Don't Care.. నా సభే ముఖ్యం..!

ఇద్దరి ప్రాణాలు తీసిన ఇన్ స్టా పరిచయం

ఆ నలుగురితో నాకు సంబంధం లేదు..!

మూడు రోజులు భారీ వర్షాలు..

Photos

+5

'భైరవం' ప్రీ రిలీజ్ లో ఫ్యామిలీ తో సందడి చేసిన మంచు మనోజ్ (ఫొటోలు)

+5

ఘనంగా కాళేశ్వరం సరస్వతి పురస్కారాలు.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

'భైరవం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన హీరోయిన్‌ లయ.. ఫోటోలు

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)