Breaking News

వర్షాకాలంలోపాపాయి పువ్వులాంటి చర్మంకోసం : చిట్కాలివిగో!

Published on Thu, 07/04/2024 - 12:17

మండించే ఎండల నుంచి ఉపశమనంగా వర్షాకాలం వచ్చేసింది. అయితే   వర్షంతోపాటు కొన్ని రకాల ఇబ్బందులు, జలుబు, జ్వరం లాంటివి వెంటే వస్తాయి. అప్రమత్తంగా ఉండాలి.   ముఖ్యంగా  చిన్నారుల్లో  ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ.  చిన్న పిల్లలు ఆరోగ్యం, చర్య సంరక్షణ చాలా అవసరం.   

ఈ నేపథ్యంలో  మారికో లిమిటెడ్ చీఫ్ రీసెర్చ్  అండ్‌ డెవలప్ మెంట్ ఆఫీసర్ డాక్టర్ శిల్పా వోరా అందించే చిట్కాలను  పరిశీలిద్దాం.

పెద్దవారితో పోలిస్తే శిశువు చర్మం చాలా సున్నితంగా ఉంటుంది  దాదాపు 30శాతం పల్చగా, సుకుమారంగా  ఉంటుంది.  పెళుసుగా , పొడిగా ఉండి తొందరగా వాతావరణ పరిస్థితుల ప్రభావానికి లోనవుతుంది. దీంతో చర్మం ఎరుపెక్కడం, ఇన్ఫెక్షన్లు లాంటి వివిధ చర్మ సమస్యలొస్తాయి.  

పాపాయి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పరిశుభ్రత, మాయిశ్చరైజేషన్ రెండూ  చాలా అవసరం. వర్జిన్‌(పచ్చి) కొబ్బరి నూతోనె  పాపాయి మృదువైన చర్మానికి మసాజ్‌ చేయాలి.

వర్జిన్‌ కోకోనట్‌ ఆయిల్‌ ఆధారిత నరిషింగ్ లోషన్ లేదా క్రీంతో  క్రమం తప్పకుండా బేబీ బాడీని మాయిశ్చరైజ్ చేయాలి. తల్లి పాలలో లభించే పోషకాలుండే ఈ ఆయిల్‌ శిశువు చర్మాన్ని 24 గంటలూ తేమగా ఉంచేలా సాయపడుతుంది. చర్మానికి తగిన పోషణ కూడా అందుతుంది.

బలమైన ఎముకలు, కండరాల అభివృద్ధి , నరాల అభివృద్ధిని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది.

దీనితో పాటు,  బిడ్డకు సరైన దుస్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం. వర్షాలకి ఉష్ణోగ్రతలు తగ్గి, గాలిలో తేమ పెరుగుతుంది. దీంతో  చిన్నారికి చెమటలు పట్టే అవకాశం ఎక్కువ. కనుక వదులుగా ఉండే దుస్తులను వాడాలి. 

అలాగే సింథటిక్ దుస్తులు కాకుండా మెత్తటి కాటన్‌, చలికి రక్షణగా ఉలెన్‌ దుస్తులను వాడాలి. లేదంటే అధిక చెమటతో, పొక్కులు, దద్దుర్లు వస్తాయి.  ఈ  సీజన్‌లో డైపర్‌లను తరచుగా మార్చుతూ అక్కడి చర్మం తడిగా లేకుండా చూసుకోవాలి.

 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)