Breaking News

‘ఈ క్షణంలో జీవించటం నేర్చుకో’.. ! మనీషాకు యువరాణి రాసిన మందు చీటీ

Published on Sun, 11/03/2024 - 04:46

మందు మనిషి మీద పనిచేస్తే, మాట మనసు మీద పనిచేస్తుంది. ’మందు చీటీ’ వంటిదే ఒక మంచి మాట. చికిత్స తీసుకుంటున్నప్పుడు.. ‘నీకు తప్పక నయం అవుతుంది‘ అనే మాట ఎలాగైతే దివ్యౌషధంలా మనసుపై పని చేస్తుందో, కోలుకుని తిరిగి వచ్చాక ‘వెల్డన్‌ ఛాంపియన్‌‘ అనే మాట కూడా గొప్ప సత్తువను, ఉత్సాహాన్ని ఇస్తుంది.

వేల్స్‌ యువరాణి కేట్‌ మిడిల్టన్‌ నుంచి మనీషా కోయిరాలాకు ఇటీవల ఒక ఉత్తరం వచ్చింది! ‘కేన్సర్‌ నుంచి పూర్తిగా కోలుకున్న వారిలో మీరూ ఒకరని నాకు తెలిసింది. చాలా సంతోషంగా అనిపించింది. తిరిగి మీరు మునుపటిలా మీ ప్రొఫెషన్‌ ని కొనసాగించటం, చారిటీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనటం ఇతరులకు స్ఫూర్తిని ఇస్తుంది..‘ అని ఆ ఉత్తరంలో రాశారు కేట్‌. యువరాణి కేట్‌ మిడిల్టన్‌ కూడా కేన్సర్‌ నుంచి బయట పడినవారే! ప్రివెంటివ్‌ కీమోథెరపీతో ఆమె ఈ ఏడాదే కేన్సర్‌ను జయించారు.

యువరాణి రాసిన ఉత్తరం మనీషాకు తన జీవిత లక్ష్యాలలో మరింతగా ముందుకు సాగేందుకు అవసరమైన మానసిక బలాన్ని ఇచ్చింది. ‘నేను ట్రీట్మెంట్‌లో ఉన్నప్పుడు కూడా కేన్సర్‌ నుంచి పూర్తిగా కోలుకున్న వారు నాకు ధైర్యాన్ని ఇస్తూ మాట్లాడ్డం నన్ను త్వరగా కోలుకునేలా చేసింది. ఈ విషయంలో (క్రికెటర్‌) యువరాజ్‌ సింగ్‌ కి, (నటి) లీసా రే కి నేను కృతజ్ఞతలు చెప్పాలి. వాళ్లలాగే ఇతరులకు ధైర్యం చెప్పటం, నయం అవుతుందని నమ్మకం ఇవ్వటం ఇక పై నా వంతు... ‘ అంటున్నారు మనీషా.

నాల్గవ స్టేజ్‌లో ఉండగా 2012 లో మనీషా లో ఒవేరియన్‌ కేన్సర్‌ ను గుర్తించారు వైద్యులు. ఐదేళ్ల చికిత్స తర్వాత 2017 లో మనీషా కేన్సర్‌ నుంచి బయటపడ్డారు. అప్పటి నుంచీ ఇండియా, నేపాల్‌ దేశాలలో కేన్సర్‌ కేర్‌ కోసం పని చేస్తున్నారు. ‘యువరాణి వంటి ఒక గొప్ప వ్యక్తి నాకు వ్యక్తిగతంగా ఇలా లేఖ రాయటం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కేన్సర్‌ బాధితుల కోసం నేను చేస్తున్న పనికి మరింతగా శక్తిని ఇచ్చింది‘ అంటున్న మనీషా, కేన్సర్‌ తనకొక పెద్ద టీచర్‌ అని చెబుతున్నారు.
‘కేన్సర్‌ నన్నెంతగా బాధించినప్పటికీ ఎంతో విలువైన జీవిత పాఠాలను కూడా నేర్పింది. ’ఆశను కోల్పోకు, మంచి జరుగుతుందని నమ్ము. ఈ క్షణంలో జీవించటం నేర్చుకో. నీకు సంతోషాన్నిచ్చేవి ఏవో కనిపెట్టు..’ అని ఆ టీచర్‌ నాకు చెప్పింది..‘ అంటారు మనీషా.. కేన్సర్‌ గురించి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)