Breaking News

అందంగా లేనా? అస్సలేం బాలేనా? ఈ డిజార్డర్‌ గురించి తెలుసుకోండి!

Published on Fri, 07/19/2024 - 11:02

ప్రసిద్ధ దర్శకుడు కరణ్‌ జోహార్‌ తాను ‘డిస్‌మార్ఫియా డిజార్డర్‌’తో బాధపడుతున్నానని తెలిపాడు. శరీరంలోని ఏదో ఒక అవయవం పట్ల వ్యక్తిలో తీవ్రమైన అసంతృప్తి ఉండి అది సరిగా లేదని పదే పదే బాధపడటమే ఈ డిజార్డర్‌. యువతీ యువకుల్లో టీనేజీ కాలంలో ఇదిపాదుకుంటే మున్ముందు వారు సామాజిక జీవితంలో ఇబ్బందిపడాల్సి ఉంటుంది. తగిన కౌన్సెలింగ్‌తో దీని నుంచి బయటపడొచ్చు.

ఒక సైకియాట్రిస్ట్‌ దగ్గరకు ఒక టీనేజ్‌ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి చూడటానికి అందరూ భావించేటట్టుగా ‘అందం’గా ఉంది. చర్మం రంగు, రూపం, హైట్‌ అన్నీ బాగున్నాయి. కాని ఆ అమ్మాయికి ‘నా ముక్కు బాగా లేదు’ అని సందేహం, అనుమానం, అదే నిజం అనిపించే అబ్సెషన్‌. ఆ ముక్కును ఎలా అందంగా చేయించాలి అనేదే ఆమె సమస్య. ‘కాదు నీ ముక్కు చక్కగా ఉంది. నువ్వు అనుకున్నంత లోపం ఏ మాత్రం లేదు’ అని వీరికి చెప్తే ఒక నిమిషం తెరిపిన పడతారు. 

మరో నిమిషంలోనే ఆ అనుమానం పెనుభూతంలా ముందుకొస్తుంది. ఈ రుగ్మతను ‘బాడీ డిస్‌మార్ఫియా డిజార్డర్‌’ అంటారు. ఇది అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌లో ఒక కోవ కిందకు వస్తుంది. ఇది ఉన్నట్టుగా చాలామందికి తెలియదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు కరణ్‌ జోహార్‌ దీని గురించి మాట్లాడి తాను ఆ డిజార్డర్‌తో బాధపడుతున్నట్టు చెప్పాడు.  అందుకే నేను లూజ్‌ బట్టలు ధరిస్తాను’ అని తెలిపాడు.

మైఖేల్‌ జాక్సన్‌ కూడా
డిస్‌మార్ఫియా డిజార్డర్‌తో బాధపడిన వాళ్లలో మైఖేల్‌ జాక్సన్‌ ఒకడు. అతనికి తన ముక్కు నచ్చలేదు. దాని వల్ల లెక్కకు మించి ప్లాస్టిక్‌ సర్జరీలు చేసి చివరకు ప్లాస్టిక్‌ ముక్కు అంటించాల్సి వచ్చింది. మగవారికి తమ జుట్టు, కళ్లు, భుజాలు, పురుషాంగం, పిరుదులు... వీటిలో ఏదో ఒకటి అస్సలు బాగలేదనే భావన బాల్యంలోనో టీనేజీలోనో స్థిరపడి΄ోతుంది. ఆడవాళ్లకు తమ కళ్లు, ముక్కు, పెదవులు, ఒంటి రంగు... వీటిలో ఏదో ఒక అవయవం గురించి అసంతృప్తి ఏర్పడుతుంది. నిజానికి లోకంలో ఎవరూ చెక్కినట్టుగా ఉండరు. 

ప్రతి ఒక్కరూ ఎలా ఉన్నా తమదైన రూపంతో బాగానే ఉంటారు. అయితే డిస్‌మార్ఫియా డిజార్డర్‌లో చూడటానికి మెరుగ్గా ఉన్నా, అంతపెద్ద లోపం ఏదీ లేక΄ోయినా వారి మైండ్‌ ‘నీ ఫలానా అంగం ఏం బాగ లేదు బాగలేదు’ అని చెప్తూ ఉంటుంది.

మిర్రర్‌ చెకింగ్‌
ఈ డిజార్డర్‌తో బాధపడేవాళ్లు తమకు లోపం ఉందని భావిస్తూ బట్టలతో, ఆభరణాలతో దానిని కవర్‌ చేసుకుంటున్నామని అనుకుంటూనే పదే పదే అద్దంలో చూసుకుంటూ ఉంటారు. లేదా ఎదుటివారిని ‘బాగున్నానా బాగలేనా?’ అని అడుగుతూ విసిగిస్తూ ఉంటారు. ‘బాగున్నావ్‌’ అన్నా నమ్మరు. ప్లాస్టిక్‌ సర్జరీ, కాస్మటిక్‌ సర్జరీలు చేయించుకున్నా వీరికి సంతృప్తి కలగదు. ఎందుకు? సమస్య మైండ్‌లో ఉంది కాబట్టి. ఈ సమస్య ఉన్నవారు కాలక్రమంలో నలుగురినీ కలవని స్థితికి చేరుకుంటారు.

కౌన్సెలింగ్‌
డిస్‌మార్ఫియా డిజార్డర్‌తో బాధ పడేవారు ముందు చేయవలసిన పని తమ యథాతథ రూపాన్ని యాక్సెప్ట్‌ చేయడం. ‘నేను నా రూపాన్ని సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను’ అని పదే పదే చెప్పుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. లేదా సైకియాట్రిస్ట్‌లను కలిస్తే వారు కౌన్సెలింగ్‌తో సమస్యను దూరం చేస్తారు. లేదా మరీ పదే పదే అందుకు సంబంధించి నెగెటివ్‌ థాట్స్‌ వస్తుంటే మందులతో చికిత్స చేస్తారు. ప్రకృతిలో ప్రతి ప్రాణి భిన్నమైన రూపాలతో ఉంటారని తెలుసుకుంటే శారీరక లోపాకు సంబంధించిన ఇలాంటి రుగ్మతలు దరి చేరవు.

 

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు