Breaking News

Kaleswaram అసలు బాధితులు... సామాన్య ప్రజలే!

Published on Sat, 06/28/2025 - 17:55

కాళేశ్వరం మూడు బ్యారేజీ లలో జరిగిన అవినీతిపై విచా రిస్తున్న సుప్రీంకోర్టు న్యాయ మూర్తి పినాకినీ చంద్రఘోష్, మాజీ ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖర రావును విచారించారు. ఈ విచా రణలో కేసీఆర్‌ యూటర్న్‌ ఎందుకు తీసుకున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. నాడు తుమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత లేదని... ప్రాజెక్టును ‘రీ డిజైనింగ్, రీ ఇంజినీరింగ్‌’ పేరుతో అక్కడి నుంచి కాళేశ్వరానికి మార్చి... అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అంతా తానై వ్యవహరించింది కేసీఆర్‌ అనే సంగతి అందరికీ తెలిసిందే. అటువంటి ఆయన తుమ్మిడిహెట్టి దగ్గర కాళేశ్వరం బ్యారేజీల్లో నీటిని నిలువ చేయాలన్న నిర్ణయం అంతా అధికారులదే అనీ, తనకేం సంబంధం లేదనీ చంద్రఘోష్‌ కమిషన్‌ ముందు సాక్ష్యం ఇచ్చారు. పంపు హౌస్‌ హెడ్‌కు తాకేంతవరకు నీటిని నిలువ చేయమని తాను ఆదేశాలు ఇవ్వలేదని తప్పించుకున్నారు. 

రాష్ట్రంలో ప్రాజెక్టుల ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ కోసం తమ ప్రభుత్వహయాంలో రూ. 280 కోట్ల నిధులు విడుదల జరి గిందనీ, వినియోగించే అధికారాలు వారికే ఇచ్చా మనీ చెప్పారు. ప్రభుత్వ ఆమోదంతోనే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామన్నారు. బ్యారేజీల కోసం స్థలాల ఎంపిక పూర్తిగా సాంకేతికంగానే జరిగిందని తెలి పారు. కాళేశ్వరం నిర్మాణం కోసం నిధులు సమీకరించేందుకే ఇరిగేషన్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశా మనీ, ప్రాజెక్టు వినియోగం ద్వారా సమకూరే నిధులతో ఆ రుణాలను తిరిగి చెల్లించాల నుకున్నామనీ వివరించారు. కానీ, వివిధ కారణాల వల్ల అది సాధ్యం కాలేదన్నారు. 

‘తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదు’ అనే సీడబ్ల్యూసీ పత్రం బీఆర్‌ఎస్‌–బీజేపీ పవిత్ర మైత్రిలో భాగంగా సృష్టించబడింది. ప్రతిఫలంగా బీఆర్‌ఎస్‌ రాష్ట్రపతి ఎన్నిక, వ్యవసాయ చట్టాలు, నోట్ల రద్దు తదితర బిల్లులకు మద్దతునిచ్చింది. వీరి బంధం 2022 వరకు సాగింది. ఈ బంధం తెగిన (2022) తర్వాత ‘కాళేశ్వరం కేసీఆర్‌ కుటుంబపు ఏటీఎం’ అని మోదీ, అమిత్‌ షాలు, రాష్ట్ర నాయకులు అన్న మాటల తూటాలు మర్చిపోలేము.

తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదనేది ఎంత కల్పితమో కాళేశ్వరం బ్యారేజీల అవినీతి అక్ర మాలపై చీల్చి చెండాడిన ఎన్డీఎస్‌ఏ నివేదిక నిగ్గు తేల్చింది. 2022–23లో మేడిగడ్డ నుండి విడుదలైన నీరు 4,628 టీఎంసీలు. 2019–20లో 2,046 టీఎంసీలు. 2021–22లో 2,671 టీఎంసీలు. 2023–24 మేడిగడ్డ ఐదు అడుగులు కుంగి, మూడు అడుగుల వెడల్పుతో నిట్టనిలువునా, అడుగు నుండి పైవరకు చీలిన సంవత్సరం 1,942 టీఎంసీల నీరు విడు దలైంది. పై ఐదేళ్లలో మొత్తం 13,151 టీఎంసీల నీటిని మేడిగడ్డ విడుదల చేసింది. ఇందులో 85–90 శాతం నీరు తుమ్మిడిహెట్టి–ప్రాణహిత నుండి వచ్చిందే! ప్రాణహిత నది లేకపోతే మేడిగడ్డ వద్ద బ్యారేజీ అనే ఆలోచన కేసీఆర్‌కు వచ్చేది కాదు. వ్యాప్‌ కోస్‌ లైడార్‌ సర్వే మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఉందని నిర్ణయించగా, ఆ నివేదిక ఆధారంగా బ్యారేజీల నిర్మాణంపై నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్‌ కమిషన్‌ ముందు సాక్ష్యం ఇచ్చారు. వ్యాప్‌ కోస్‌ సీఎండీ రాజిందర్‌ గుప్తా ఇంట్లో 38 కోట్ల రూపాయలను, నోయిడా, తదితర ప్రాంతాలలో విలువైన రియల్‌ ఎస్టేట్‌ భూములు, విల్లాల రిజి స్ట్రేషన్‌ పత్రాలు, భారీ బంగారం నగలను, సీబీఐ 2023 మే 3న దాడులు చేసి జప్తు చేసి ఆయన్ని జైల్లో పెట్టింది నిజం కాదా? ఈ డబ్బంతా ఎక్కడిది? తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదనే సాకుతో బ్యారేజీ స్థలాన్ని మేడిగడ్డకు మార్చేందుకు పొందినదే అనేది విమర్శకుల అనుమానం.

ప్రతి ఇంజనీర్‌కూ బ్యారేజ్‌కు, డ్యామ్‌కు ఉన్న తేడా తెలుసు. వాటిని ఎలా నిర్వహించాలో తెలుసు. బ్యారేజీలో 2.5 టీఎమ్‌సీల కంటే ఎక్కువ నీళ్లు నిలపకూడదు. ఎక్కువైన నీళ్లన్నీ నదికైనా లేదా కాలువకైనా వెళ్లాలి. మరి, మేడిగడ్డలో 16, అన్నారంలో 12, సుందిళ్లలో 8 టీఎంసీలు నిల్వ చేయాలని ఆదేశించింది ఎవరు? కాళేశ్వరం కార్పొరేషన్‌ తీసుకున్న రుణాలు, ఆ ప్రాజెక్టు వినియోగం ద్వారా సమకూరే లాభాలతో, ఆ రుణాలను చెల్లించడం అసాధ్యం. అప్పులిచ్చిన బ్యాంకులు, కేంద్ర సంస్థలు... అసలు, వడ్డీలు పొందుతుండగా; ప్రజల సేవలకు, భారీగా కోత పడింది. చివరకు అసలు, వడ్డీలు నెల నెలా చెల్లించేది కోట్లాది సామాన్య ప్రజలే అనేది వాస్తవం. 

నైనాల గోవర్ధన్‌
వ్యాసకర్త సామాజిక కార్యకర్త, నీటిపారుదల ప్రాజెక్టుల విశ్లేషకులు

 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు