Breaking News

రామావతార పరమార్థం : సరస్వతీ దేవి ప్రేరణతోనే కైకేయి వైరం

Published on Tue, 07/15/2025 - 11:36

సాధారణంగా లోకంలో... రామాయణంలోని మంథర కపట స్వభావం గలది అనీ, భరతుని కంటే కూడా రామునిపై ఎక్కువ పుత్ర ప్రేమను చూపించే కైకేయి మనసును విరిచి, రాముడిని వనవాసానికి పంపేటట్లు చేసిందనీ ఆమె పాత్ర స్వభావం గురించి ఒక విశ్లేషణ ఉంది. కానీ, అధ్యాత్మ రామాయణంలో, రామావతార పరమార్థం నెరవేరటానికి సరస్వతీ దేవి ప్రేరణతో ఆమె అలా వైరభావం ప్రదర్శించినట్లు తెలుస్తున్నది.

రామ పట్టాభిషేక వార్త విని, కౌసల్యా దేవి ఈ శుభకార్యం నిర్విఘ్నంగా జరగాలని లక్ష్మీదేవిని పూజించింది, దుర్గాదేవిని పూజించింది. అయినా ఆమె మనసులోకించిత్‌ వ్యాకులత ఉందిట. జరగబోయేది ముందుగానే సూచనగా తెలుస్తున్నది ఆమెకు. అప్పుడు దేవలోకంలో దేవతలంతా కలిసి, వాగ్దేవి సరస్వతిని ప్రేరేపించారు: ‘నీవు భూలోకంలో అయోధ్యా నగరానికి వెళ్లు. రామ రాజ్యాభిషేకానికి విఘ్నం కలగజేయటానికి యత్నించు. ముందు మంథర మనసులో ప్రవేశించి, ఆమెలో వ్యతిరేక భావం కలిగించు. తర్వాత కైకేయిలో ప్రవేశించి ఆ విధంగానే చెయ్యి. రామ రాజ్యాభిషేకం ఆగిపోతే గానీ, రామావతార పరమార్థం నెరవేరదు,’ అని చెప్పారు. సరస్వతి దేవి సరేనని బయలుదేరింది. అయోధ్యా నగరం చేరి మంథర మనసులో ప్రవేశించింది.

కైకేయితో మంథర ‘నీకు గొప్ప ఉపద్రవం రాబోతోంది. రేపు రామునికి పట్టాభిషేకం జరగబోతోంది’ అంది. కైకేయిసంతోషంతో దివ్యమైన మణి నూపురాన్ని మంథరకు బహు మతిగా ఇచ్చింది. సరస్వతీ దేవి ప్రేరణతో మంథర... కైకేయి మనసు బాధ పడేట్లు, రామ పట్టాభిషేకం జరిగితే కౌసల్యకు దాసిలా ఉంటావని చెపుతుంది. ఆ మాటల ప్రభావంతో కైకేయి మనసులో మార్పు వచ్చి, కోప గృహంలో చేరింది. తర్వాత రాముడు అరణ్యవాసానికి వెళ్లడం, సీతాపహరణం, రావణ సంహారం... ఇలా ఎన్నో ఘట్టాల్లో రాముడు తాను నిర్వర్తించా ల్సిన సకల కార్యాలను నిర్వర్తించాడు.
– డా.చెంగల్వ రామలక్ష్మి

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)