Breaking News

ఒక 24 గంటలు నిద్రలేకుండా గడిపారో ఊబకాయం, కానీ!

Published on Sat, 03/01/2025 - 15:14

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచన ప్రకారం.. ప్రతి ఒక్కరూ రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. నిద్ర లేమి మధుమేహం, కేన్సర్‌ లాంటి  అనేక దీర్ఘకాలిక పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుందని  అనేక అధ్యయనాలు ఇప్పటికే  వెల్లడించాయి. అంతేకాదు  తగినంత నిద్ర లేనపుడు మెదడు పనితీరు ప్రభావితమవుతుంది. అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. 24 గంటలు నిద్ర పోకపోవడం వలన  పెద్దల్లో ఊబకాయం ముప్పు పెరుగుతుందని తాజా పరిశోధన తేల్చింది. 

కువైట్‌లోని దాస్మాన్ డయాబెటిస్ ఇన్స్టిట్యూట్ (DDI) ఆరోగ్యకరమైన వ్యక్తి రోగనిరోధక వ్యవస్థపై స్వల్పకాలిక నిద్ర లేమి ప్రభావాన్ని అంచనా వేసింది.  ఊబకాయం, మధుమేహం , గుండె జబ్బులు వంటి పరిస్థితులను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో పరిశీలించింది. ఈ పరిశోధన ప్రకారం, ఆరోగ్యకరమైన పెద్దలలో ఒక రాత్రి నిద్రను దాటవేయడం వల్ల దీర్ఘకాలిక మంట (chronic inflammation)తో ముడిపడి ఉన్న కణాల్లో పెరుగుదల నమోదైంది.  ఇదే ఊబకాయానికి ముఖ్య లక్షణం. అయితే ఆసక్తికరవిషయం ఏమిటంటే, సాధారణ నిద్ర పునరుద్ధరించుకున్న తరువాత ఇది సాధారణ స్థితికి చేరింది. తమ పరిశోధన నిద్ర, రోగనిరోధక ఆరోగ్యం మధ్య  ఉన్న శక్తివంతమైన సంబంధాన్ని హైలైట్ చేస్తుంది అంటున్నారు పరిశోధకులు.

నిద్ర - బరువు మధ్య సంబంధంపై చాలా కాలంగా పరిశోధనలు సాగుతున్నాయి.  నిద్ర నియంత్రణ అనేది మెదడుకు మాత్రమే సంబంధించినది కాదు, మెదడు ,శరీరంలోని మిగిలిన భాగాల మధ్య సంక్లిష్ట పరస్పర చర్యపై ఆధారపడి ఉంటుందని ఇప్పటికే స్పష్టమైంది. ఆరోగ్యంపై నిద్ర లేమి ప్రభావం తెలిసినప్పటికీ, ఈ అనుబంధానికి అంతర్లీనంగా ఉన్న విధానం తక్కువగా  అర్థం చేసుకున్నారు. 237 మంది ఆరోగ్యకరమైన పెద్దలపై ఈ పరిశోధన జరిగింది. వీరిబాడీ మాస్ ఇండెక్స్ (BMI) ఆధారంగా  పీలగా ఉన్నవారు,  అధిక బరువుతో ఉన్నవారు,  ఊబకాయంతో ఉన్నవారు ఇలా  మూడు గ్రూపులుగా విభజించారు.  కాలేయం, గుండె, ఊపిరితిత్తులు , మూత్రపిండాల పనితీరు బావుందని నిర్ధారించుకున్నారు. అలాగే మధుమేహం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA), అధిక రక్తపోటు లేదా అధిక రక్తపోటుకు మందులు తీసుకుంటున్న వారు. గుండె సమస్యలు (గుండెపోటు, కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్ (CABG) శస్త్రచికిత్స, కరోనరీ యాంజియోప్లాస్టీ లేదా 'స్టెంట్లు')  గుండె సంబంధిత కారణాల వల్ల అకాల మరణం (40 ఏళ్లకు ముందు) సంభవించిన కుటుంబ చరిత్ర ఉన్నవారిని, డిప్రెషన్, సంబంధిత మందులు తీసుకుంటున్న వారికి కూడా మినహాయించారు.

"నిద్ర లేమి, రోగనిరోధక కణాల డైనమిక్స్ మధ్య పరస్పర చర్యను పరిశీలించేందుకు  ఐదుగురు 'సాధారణ బరువు' వ్యక్తులను - ఇద్దరు పురుషులు, ముగ్గురు స్త్రీలను - 24 గంటల పాటు నిద్ర లేమికి గురిచేశారు. వారి నాన్-క్లాసికల్ మోనోసైట్‌లు (NCM) , ప్రోఇన్‌ఫ్లమేటరీ సైటోకిన్‌ల స్థాయిలను గమనించారు. ఇందులో ఎన్‌సీఎంలో  తీవ్రమైన, గణనీయమైన పెరుగుదలను గమనించారు. అయితే  ఇది రెండు రోజుల తర్వాత  అంటే వారు సాధారణంగా నిద్రపోయినపుడు ఇది సాధారణ స్థితికి వచ్చిందని పరిశోధకులు వెల్లడించారు. ఈ అధ్యయనం ది జర్నల్ ఆఫ్ ఇమ్యునాలజీలో ప్రచురితమైంది. 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)