Breaking News

చుట్టుముట్టిన ఆరోగ్య సమస్యలతో రైతుగా మారాడు..! కట్‌చేస్తే..

Published on Fri, 02/07/2025 - 13:48

చుట్టుముట్టిన ఆరోగ్య సమస్యలు అతడిని నగర జీవితం నుంచి గ్రామం బాట పట్టేలా చేశాయి. అక్కడే వ్యవసాయం చేసుకుంటూ బతకాలనుకున్నాడు. చివరికి అదే అతడికి కనివిని ఎరుగని రీతిలో లక్షలు ఆర్జించేలా చేసి..మంచి జీవనాధారంగా మారింది. ఒకరకంగా ఆ ఆరోగ్య సమస్యలే ఆర్థిక పరంగా స్ట్రాంగ్‌గా ఉండేలా చేయడమే గాక మంచి ఆరోగ్యంతో జీవించేందుకు దోహదపడ్డాయి. ఇంతకీ అతడెవరంటే..

అతడే హర్యానాకి చెందిన జితేందర్‌ మాన్‌(Jitender Mann). ఆయన చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో 20 ఏళ్లు టీసీఎస్‌ ఉద్యోగిగా పనిచేశారు. అయితే ఆ నగరాల్లో కాలుష్యం, శారీరక శ్రమ లేకపోవడం తదితర కారణాలతో నలభైకే రక్తపోటు, కీళ్ల నొప్పులు వంటి రోగాల బారినపడ్డారు. జస్ట్‌ 40 ఏళ్లకే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక రాను రాను ఎలా ఉంటుందన్న భయం ఆయన్ని నగర జీవితం నుంచి దూరంగా వచ్చేయాలనే నిర్ణయానికి పురిగొలిపింది. 

అలా ఆయన హర్యానాలోని సొంత గ్రామానికి వచ్చేశారు. అక్కడే తన భార్య సరళతో కలిసి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా రెండు ఎకరాల్లో సేంద్రియ మోరింగ ఫామ్‌(organic moringa farm)ని ప్రారంభించారు. అలాగే ఆకుల్లో పోషకవిలువలు ఉన్నాయని నిర్థారించుకునేలా సాంకేతికత(technology)ని కూడా సమకూర్చుకున్నారు. అలా అధిక నాణ్యత కలిగిన మోరింగ పౌడర్‌ని ఉత్పత్తి చేయగలిగారు ఈ జంట(Couple). 

వారి ఉత్పత్తులకు త్వరితగతిన ప్రజాదరణ పొంది..ఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరు,ముంబై వంటి నగరాలకు వ్యాపించింది. ఈ పౌడర్‌కి ఉన్న డిమాండ్‌ కారణంగా నెలకు రూ. 3.5 లక్షల ఆదాయం తెచ్చిపెట్టింది ఆ దంపతులకు. అలా ఇప్పుడు నాలుగు ఎకరాలకు వరకు దాన్ని విస్తరించారు. అత్యున్నత నాణ్యతను కాపాడుకోవడమే ధ్యేయంగా ఫోకస్‌ పెట్టారిద్దరు. 

అందుకోసం ఆకులను కాండాలతో సహా కోసి రెండుసార్లు కడిగి ఏడు నుంచి తొమ్మిది కాండాలను కలిపి కడతామని అన్నారు. తద్వారా ఆకుని సులభంగా ఎండబెట్టడం సాధ్యమవుతుందని జితేందర్‌ చెబుతున్నారు. ఆకులను పెద్ద ఫ్యాన్‌ల కింద నియంత్రిత గ్రీన్‌హౌస్‌ సెటప్‌లో ఎండబెట్టడం జరుగుతుంది. అందువల్ల 12 గంటలలోనే ఆకులను కాండాల నుంచి తీసివేసి ముతక పొడిగాచేసి జాగ్రత్తగా ప్యాక్‌ చేస్తారు. 

అంతేగాదు ఈ దంపతులు తాము నేలను దున్నమని చెబుతున్నారు. తాము కలుపు మొక్కలు, ఇతర ఆకులనే రక్షణ కవచంగా చేసుకుంటారట. అలాగే హానికరమైన రసాయన ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులను ఉపయోగించమని చెబుతున్నారు. ఇలా జితేందర్‌ వ్యవసాయ రంగాన్ని ఎంచుకోవడంతోనే ఆయన లైఫ్‌ మారిపోయింది. 

ఇదివరకటిలా ఆరోగ్య సమస్యలు లేవు. మంచి ఆరోగ్యంతో ఉన్నాని ఆనందంగా చెబుతున్నాడు. అలాగే ప్యాకేజింగ్‌ కోసం పొడిని పంపే ముందే తాము కొన్ని జాడీలను తమ కోసం పక్కన పెట్టుకుంటామని చెప్పారు. ఈ మొరింగ పౌడర్‌ వినియోగం తమకు మందుల అవసరాన్ని భర్తీ చేసేస్తుందని అందువల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని ధీమాగా చెబుతున్నారు. 

అలాగే జితేంద్ర దంపతులు తాము గ్రామానికి వెళ్లాలనుకోవడం చాలామంచిదైందని అంటున్నారు. "ఎందుకంటే మేము ఇక్కడ కష్టపడి పనిచేయడం తోపాటు ఆరోగ్యంగా ఉంటున్నాం. పైగా కాలుష్యానికి దూరంగా మంచి జీవితాన్ని గడుపుతున్నాం అని సంతోషంగా చెబుతోంది ఈ జంట.

 

(చదవండి: లెడ్‌లైట్‌ థెరపీ: అన్ని రోగాలకు దివ్యౌషధం..!)

 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా! 😍🦚

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)