Breaking News

కుక్కలా మారిన వ్యక్తి..ఆడ కుక్కతో ప్రేమలో..

Published on Wed, 09/13/2023 - 16:50

ఓ జపాన్‌ వ్యక్తి ఇటీవల కుక్కలా మారి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ వ్యక్తి ఓ ప్రముఖ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో.. కుక్కలా మారిన తర్వాత తన అసాధారణ జీవితం ఎలా ఉందో వివరిస్తూ..చాలా షాకింగ​ విషయాలు చెప్పాడు. అతడు చెప్పిన విషయాలు చూస్తే వామ్మో ఇవేం కోరికలు అనిపించేలా ఉన్నాయి. 

వివరాల్లోకెళ్తే..ఇటీవలే జపాన్‌కి చెందిన వ్యక్తి తనకెంతో ఇష్టమైన "కోలీ" అనే కుక్కలా మారి ఆశ్చర్యపర్చాడు. అందుకోసం ఎన్నో కంపెనీలు సంప్రదించగా ఓ కంపెనీ ముందుకు వచ్చి కుక్కను తలిపించే కాస్ట్యూమ్‌ డిజైన్‌ చేసేందుకు ముందుకు వచ్చింది. . ఇటీవలే అచ్చం కుక్కలా కనిపించే ఆ కాస్ట్యూమ్‌ని ధరించి వీధుల్లో హల్‌చల్‌ చేసి నెట్టింట వైరల్‌గా మారాడు కూడా. ఇప్పుడా వ్యక్తి తనకు ఇలా కుక్క జీవితం ఎంతో నచ్చిందని చెబుతున్నాడు. కుక్క మాదిరిగా నాలుగు కాళ్లపై నడవడం ఇబ్బందిగా ఉన్నా సంతృప్తిగా ఉందని చెప్పడం విశేషం.

ఆ వ్యక్తి ఆ కుక్కలా కనిపించే కాస్ట్యూమ్స్‌ కోసం ఒకటి, రెండు కాదు ఏకంగా రూ. 12 లక్షలు ఖర్చుపెట్టాడు. అంత ఖర్చుపెట్టాడు కాబట్టి ఇష్టపడక ఏం చేస్తాడులే! అని అనుకోకండి. పైగా కుక్కలా అసాధారణ జీవితం గడుపుతున్న అతడికి కలుగుతున్న కోరికలు వింటే మాత్రం ఓర్నీ ఇవేం కోరికలు అని నోరెళ్లబెట్టడం ఖాయం. ఇంతకీ ఆ కుక్కలా మారిన వ్యక్తి తనలానే కుక్కలా మారాలనుకునే స్త్రీ కూడా ఉంటే బాగుండనని, ఆమెతో ప్రేమలో పడాలని అనుకుంటున్నాడట.

అంతేకాదు కుక్కలా ఉన్న తనకు సినిమాలో నటించే అవకాశం వస్తే బావుండనని అంటున్నాడు. ఒక్క అవకాశం ఇస్తే తానేంటో చూపించుకుంటానని చెబుతున్నాడు. ఇలా జీవితం గడపడం ఎంత అసౌకర్యంగా అసాధారణంగా ఉన్నా తనకు అలా ఉండటమే ఇష్టమని తేల్చి చెప్పాడు. కోలీ జాతి కుక్కలంటే తనకెంతో ఇషమని అలా ఉండాలన్న కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉందని మరీ చెబుతున్నాడు. ఓర్నీ వెర్రీ వెయ్యి రకాలు అంటే ఏంటో అనుకున్నాం. ఇలానే ఉంటుందేమో కదా!.

(చదవండి: వధువు ఎంట్రీ మాములుగా లేదుగా!ఐడియా అదుర్స్‌)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)