Breaking News

అనంత్‌-రాధిక ప్రీ వెడ్డింగ్‌ : ఇవాంకా ట్రంప్‌ డ్రెస్సింగ్‌ స్టయిల్‌ అదిరిందిగా!

Published on Mon, 03/04/2024 - 17:57

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎందరో అతిరథ మహారథులు, ప్రముఖులు, సెలబ్రెటీలు విచ్చేసి సందడి చేశారు. ఇక ఈ వేడుకల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు కుమార్తె ఇవాంకా తన కుటుంబంతో సహా పాల్గొంది. ఈ వేడుకలో ఆమె దేశీ అలంకరణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మార్చి 1న జరిగిన అనంత్‌ రాధిక ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో ఇవాంకా తన భర్త జారెడ్ కుష్నర్, కుమార్తె అరబెల్లా రోజ్‌తో కలిసి సందడి చేసింది.

ఇదొక 'మ్యాజికల్‌ రాత్రి" అంటూ క్యాప్షన్‌ ఇచ్చి మరీ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్‌ చేసింది. ఆమె ఆ వేడుకల్లో మనీష్‌ మల్హోత్రా డిజైన్‌ చేసిన గోల్డ్‌ సిల్వర్‌ కలయిక గల చీరను ధరించింది. అందుకు తగట్టుగా వీ షేప్‌లో ఉండే మ్యాచింగ్‌ బ్లౌజ్‌తో గ్రాండ్‌ లుక్‌లో కనిపించింది. అయితే ఈ చీర ధర ఏకంగా రూ. 2.65 లక్షలు. అంతేగాదు ఆ చీరకు తగ్గ రేంజ్‌లో చెవులకు డైమండ్‌ జూకాలు ధరించింది. మంచి గ్లామరస్‌ లుక్‌లో అందర్నీ మిస్‌మరైజ్‌ చేసింది.

ఇక రెండో రోజు జంగిల్‌ సఫారీలో జరిగిన వేడుకల్లో ఇవాంకా త్రెడ్‌ వర్క్‌తో కూడిని కుర్తాని ధరించింది. సింపుల్‌ మేకప్‌తో తన కూతురు అరబెల్లా రోజ్‌తో కలిసి సందడి చేసింది. ఇక అదే రోజు సాయంత్రం మనీష్‌ మల్హోత్రా డిజైన్‌ చేసిన తెల్లటి లెహంగాలో భారతీయ వనితలా రెడీ అయ్యింది. 

ఇక చివరి రోజు ఉదయం గోల్డెన్‌ ఎంబ్రాయిడరీతో కూడిన తెల్లటి గౌనుతో ఆకర్షించింది. ఇకా ఆమె భర్త, కూతురు కూడా దేశీ వస్త్రాధారణలో అలరించడం విశేషం. ఇక అదే రోజు సాయంత్రం అంబానీ కుటుంబం దేవుడి పూజలతో ఆ వేడుకలకు ముగింపు పలికే కార్యక్రమం కావడంతో వచ్చిన అతిధులందరికి సంప్రదాయ డ్రెస్‌ కోడ్‌ని ధరించాలని సూచించడం జరిగింది.

దీంతో ఇవాంకా ఆ సాయంత్రం మనీష్‌ మల్హోత్రా డిజైన్‌ చేసిన నిమ్మపండు రంగు కశ్మీరీ లెహంగాతో సంప్రదాయ మహిళ వలే కనిపించింది. ఈ లెహంగా ధర అక్షరాల రూ. 5 లక్షలు.

ఏదీఏమైన అంబానీ ఇంట పెళ్లి వేడుకల్లో పాల్గొన్న విదేశీయులు సైతం మన భారతీయ సంస్కతి తగ్గ వస్తాలంకరణలో కనిపించడం గ్రేట్‌ కదూ. బహుశా ఆ క్రెడిట్‌ అంతా అంబానీ కుంటుంబానికే దక్కుతుంది. 

(చదవండి: అనంత్‌-రాధికా: నీతా అంబానీ లాంగ్‌ నెక్లెస్‌ ధర ఎంతో తెలుసా!)
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)