Breaking News

అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు: స్టైయిలిష్‌ లుక్‌లో ఇషా!

Published on Sun, 03/03/2024 - 11:21

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సినీ సెలబ్రెటీలు దగ్గర నుంచి పలు రంగాల అధినేతలు దేశ విదేశాల నుంచి తరలి వచ్చి మీరీ ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో అనంత్‌ అంబానీ సోదరి ఇషా తన ప్రత్యేక వస్త్రాలంకరణలో అందర్నీ మిస్‌మరైజ్‌ చేసింది. ఈ వివాహ వేడుకల్లో ఇషా ఫ్యాషన్‌ ఐకాన్‌గా పేరుగాంచిని తన తల్లి నీతా అంబానీని ఫాలో అయ్యిందా అన్నంత రేంజ్‌లో ఉంది ఆమె లుక్‌.

ప్రముఖ ఫ్యాషన్‌ బ్రాండ్‌ కార్ల్‌ లాగర్‌ ఫెల్డ్‌ చెందిన బ్లాక్‌ డ్రెస్‌లో అజంతా శిల్పంలా ఉంది. చేతులకు, డైమండ్‌ బ్రాస్‌లెంట్‌, డైమండ్‌ ఉంగరాలతో మరింత గ్రాండ్‌గా కనిపించింది. చెవులకు కూడా ఆ డ్రస్‌కి తగ్గ డైమండ్‌ జూకాలు ధరించింది. ఐషా ధరించిన గౌను ఆ  బ్రాండ్‌ వ్యవస్థాపకుడు లాంగర్‌ ఫెల్డ్‌ చనిపోవడానికి కొద్దిరోజుల ముందు డిజైన్‌ చేసింది. ఆయన గత కొన్ని దశాబ్దాలుగా ఫ్యాషన్‌ ప్రపంచాన్ని ఏలుతున్న ప్రముఖ డిజైనర్‌ . తన క్రియేటివిటీతో ఎన్నో ప్రముఖ డిజైనర్‌ దుస్తులను పరిచయం చేసి ఫ్యాషన్‌కి అసలైన అర్థం ఇచ్చిన వ్యక్తి అతను.

అతని బ్రాండెడ్‌ దుస్తులకు పలు సినీ సెలబ్రెటీలు, వ్యాపార ప్రముఖులే అభిమానులు. ఈ బ్రాండ్‌ ధర కూడా ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇక ఈ ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో ఇషా ధరించిన లాగర్‌ఫెల్డ్‌ గౌనుపై వెండి ఆకుల రూపంలో  బ్లాక్ షీర్ సిల్హౌట్‌ అందంగా డిజైన్‌ చేశారు. ఆ డ్రెస్‌కి తగ్గట్టు లైట్‌ మేకప్, పెదాలకు నేచురల్‌ లిప్‌స్టిక్‌తో ప్రత్యేక ఆకర్షణ నిలిచింది ఇషా. చెప్పాలంటే పండు వెన్నెలలో ఉండే జాబిల్లిలా ఆమె స్టన్నింగ్‌ లుక్‌ కళ్లు తిప్పుకోనివ్వలేనంతగా కట్టిపడేస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ చక్కెర్లు కొడుతున్నాయి.మరీ మీరు కూడా ఓ లుక్కేయండి.

(చదవండి: అనంత్‌ అంబానీ అధిక బరువుకి కారణం ఇదే! ఆ విషంయలో కాబోయే భార్య..)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌