Breaking News

ఆ థెరపీ పేరెంట్స్‌ని అర్థం చేసుకోవడానికి సహాయపడింది..!

Published on Fri, 01/17/2025 - 12:25

అమీర్‌ ఖాన్‌- రీనా దత్త కూతురుగా ఇరా ఖాన్‌ సినీ ప్రియులకు సుపరిచితమే. ఆమె‘మెంటల్‌ హెల్త్‌ సపోర్ట్‌ ఆర్గనైజేషన్‌’ సంస్థ వ్యవస్థాపకురాలు, సీఈవో కూడా. తన మానసిక ఆర్యోగ్యం(Mental health) గురించి బహిరంగంగానే మాట్లాడుతంటంది. తాను చాలా డిప్రెషన్‌కి గురయ్యానని కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పకొచ్చింది కూడా. దేని వల్ల తాను డిప్రెషన్‌కి గురయ్యింది, బయటపడేందుకు తీసుకన్న చికిత్స తన జీవితాన్ని ఎలా మార్చేసిందో సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేసుకుంది. 

అమీర్‌ ఖాన్‌(Aamir Khan) రీనా దత్తాలు 1986లో వివాహం చేసుకున్నారు. దగ్గర దగ్గర 16 ఏళ్ల వైవాహిక బంధానికి 2002లో స్వస్తి పలికి విడిపోయారు. ఇక వారి ఇద్దరికి కలిగిన సంతానమే జునైద్‌ ఖాన్‌, ఇరా ఖాన్‌. ఇలా ఈ దంపతులు విడిపోవడం వారి కూతురు ఇరాఖాన్‌(Ira Khan)పై తీవ్ర ప్రభావమే చూపించింది. నిజానికి తల్లిదండ్రులు విడిపోతే ఆ ప్రభావం పిల్లలపై గట్టిగానే పడుతుంది. 

అయితే అది కొందరిలో ఆత్మనూన్యత భావానికి లేదా నిరాశ నిస్ప్రుహలకి దారితీస్తుంది. ఇక్కడ ఇరాఖాన్‌ కూడా అలానే తీవ్రమైన డిప్రెషన్‌ బారిన పడింది. తాను ఆ సమస్యతో బాధపడుతన్నానని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. దీన్నుంచి బయటపడేందుకు ఎంతగానో పోరాడింది. 

అందుకోసం ఆమె తీసుకున్న థెరపీ(Therapy) మెదట తాను ఈ సమస్యతో బాధపడుతున్నట్లు అంగీకరించేలా చేసింది. ఆ తర్వాత తన తల్లిదండ్రులు బాంధవ్యం గురించి ఓ స్పష్టమైన అవగాహన కలిగించింది. వాళ్లు కేవలం తన తల్లిదండ్రులుగా మాత్రమే చూడకూడదని, వాళ్లూ మనుషులే, తమకంటూ వ్యక్తిగత ఇష్టాలు ఉంటాయి. వారి సంతానంగా తాను గౌరవించాలని తెలుసుకుంది ఇరా. 

అలా తల్లిదండ్రులను పూర్తిగా అర్థం చేసుకుని డిప్రెషన్‌ను జయించే ప్రయత్నం చేశాను. పిల్లలకు వారి పేరెంట్స్‌తో సన్నిహితంగా ఉండమని ఎవ్వరూ చెప్పారు. ఆ పని మనమే చేయాలి. అదే మనకు మనో ధైర్యాన్ని, శక్తిని అందిస్తుందని సోషల్‌ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆ పోస్ట్‌  నెట్టింట తెగ వైరల్‌గా మారింది. కాగా, ఇటీవలే ఇరాఖాన్‌ తన ప్రియడు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపుర్‌ శిఖరేను పెళ్లిచేసుకుని వివాహం బంధంలోకి అడుగు పెట్టింది. 

(చదవండి: Maha Kumbh 2025: నాగ సాధువుగా తొలి విదేశీయుడు..!)
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)