Breaking News

కోహ్లి చేతికి కొత్త లగ్జరీ వాచ్‌, అదరిపోయే టీ-షర్ట్‌, ధర ఎంతంటే?

Published on Sat, 03/23/2024 - 13:34

ప్రతిష్టాత్మక ఐపీఎల్ 2024 సమరం శుక్రవారం షురూ అయింది. తొలి మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్, విరాట్ కోహ్లీ ఓ సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. టీ20 క్రికెట్‌లో 12 వేల పరుగుల మైలురాయిని అధిగమించాడు. ఈ ఘనతను అందుకున్న తొలి భారత బ్యాటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.  ఈసందర్బంగా కోహ్లీ కొత్త లుక్‌, కొత్త టీషర్ట్‌, లగ్జరీ వాచ్‌ ఇవన్నీ  క్రికెట్‌ ఫ్యాన్స్‌ మధ్య  హాట్‌ టాపిక్‌గా  నిలుస్తున్నాయి.

ఐపీఎల్‌ 2024 సిరీస్‌కోసం సిద్దమైన కోహ్లీ కొత్త హెయిర్‌ కట్‌, గడ్డంతో ముంబై విమానాశ్రయంలో చమక్‌మని మెరిసాడు. కోహ్లీ కొత్త లుక్‌ చూసిన ఫ్యాన్స్‌ అంతా ఫిదా అయిపోయారు.  దీనికి సంబంధించి ఫోటోలు  ఇప్పటికీ నెట్టింట్‌ చక్కర్లు అవుతున్నాయి.

అంతేకాదు ఇటీవల రెండో బిడ్డకు తండ్రి అయిన కోహ్లి తెల్లటి టీ-షర్టులో మరింత అందంగా కనిపించాడు. దీనిపై యానిమేషన్ క్యారెక్టర్‌ బొమ్మతోపాటు, డాడ్‌(DAD) 'డక్ డక్ గూస్' అని రాసి ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది తన పిల్లలపై ఉన్న ప్రేమను నిదర్శనమంటూ కమెంట్స్‌ వినిపించాయి. ఈ టీ-షర్టు ధర రూ.2,076(24.95 డాలర్స్)  అని సమాచారం.

అంతేనా లగ్జరీ వాచ్‌ కలెక్షన్‌ను సొంతం చేసుకున్న కోహ్లీ మరో లగ్జరీ వాచ్‌ కూడా హాట్‌ టాపిక్‌గా నిలిచింది. దీని ధర 38.77 లక్షల అని అంచనా.  కుడి చేతికి ధరించి ఈ సొగసైన వాచ్ లగ్జరీ రోలెక్స్ బ్రాండ్‌ది.  బ్లాక్ డయల్, మరో మూడు సిల్వర్‌ కలర్‌ డయల్స్‌, బ్లాక్ బెల్ట్‌తో రోలెక్స్ డేటోనా బేబీ లే మాన్స్ ఓస్టెర్‌ఫ్లెక్స్ సూపర్‌ లావిష్‌ వాచ్‌ ఇది. కోహ్లి భయ్యా..సూపర్‌ కూల్ అవుట్‌ఫిట్ అంటూ క్రికెట్‌ అభిమానులు మురిసి పోయారు.

కాగా కోహ్లీ, భార్య బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ దంపతులకు ఈ ఏడాది ఫిబ్రవరి 15న లండన్‌లో కుమారుడు అకాయ్‌ జన్మించాడు. వీరికి ఇప్పటికే వామిక అనే పాపకూడా ఉంది.

Videos

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

రెండో టీ20లో వైభవ్ కు చాన్స్.. ఇషాన్ కిషన్ అవుట్

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

Photos

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం