మనస్సాక్షి... ఆత్మవిమర్శ

Published on Mon, 08/10/2026 - 00:12

ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వ్యక్తికి ఆత్మవిమర్శ ఒక దిక్సూచి వంటిది. ఇది లేకపోతే సాధన దిశ కోల్పోతుంది. ఆధ్యాత్మిక చింతనలో ఆత్మవిమర్శ అనేది మానసిక పరిపక్వతకు అత్యంత ముఖ్యమైన మార్గం. ఆత్మవిమర్శ అంటే మనల్ని మనం విశ్లేషించుకోవడం. ఇతరుల తప్పులను వెతకడం సులభం, కానీ మన లోపాలను, అజ్ఞానాన్ని, బలహీనతలను మనం గుర్తించడం చాలా కష్టం.  కానీ ఆధ్యాత్మిక ఆత్మవిమర్శలో అహంకారాన్ని పక్కన పెట్టి, మన లోపాలను నిర్భయంగా, నిజాయితీగా అంగీకరించాలి.  లోపాలను గుర్తించడం మాత్రమే కాదు, వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి.

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు (అరిషడ్వర్గాలు) మన ప్రవర్తనను ఎంతవరకు ప్రభావితం చేస్తున్నాయో గుర్తించి, వాటి స్థానంలో శాంతి, ప్రేమ, ఓర్పును అలవర్చుకోవాలి. బాహ్యస్నానం శరీరానికి ఎంత అవసరమో, ఆధ్యాత్మిక ఆలోచనలతో చేసే ఆత్మవిమర్శ మనస్సుకు అంత అవసరం. ఇది మనస్సును తేలికగా, పవిత్రంగా మారుస్తుంది.

ఆత్మవిమర్శ అంటే మనల్ని మనం నిందించుకోవడం లేదా కుంగి΄ోవడం కాదు. మనలోని లోపాలను గుర్తించి, ఒక మెరుగైన, ప్రశాంతమైన మానవుడిగా ఎదగడానికి చేసుకునే ప్రయాణం. మానవ జీవితం నిరంతరం బాహ్య ప్రపంచంతో సాగించే ఒక నిరంతర యుద్ధం. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మన దృష్టి, ఆలోచనలు, శ్రమ అంతా బయటి విషయాల మీదే ఉంటాయి. ఇతరుల ప్రవర్తనను విశ్లేషించడం, సమాజంలోని లోపాలను వేలెత్తి చూపడం, పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకోవడంలోనే కాలం గడిచిపోతుంది. కానీ, ఆధ్యాత్మిక జీవనంలో అత్యంత కీలకమైన, ప్రాథమికమైన అడుగు– బాహ్య ప్రపంచం నుండి దృష్టిని మళ్లించి అంతరంగం వైపు తిప్పడం. దాన్నే ఆత్మవిమర్శ అంటారు.  

మనం ఇంట్లో పేరుకుపోయిన మురికిని నిత్యం శుభ్రం చేసుకున్నట్లే, మనస్సులో చేరుతున్న ప్రతికూల ఆలోచనలు, పగ, ద్వేషాలను ఆత్మవిమర్శ అనే ఊడ్పు కర్రతో శుభ్రం చేయాలి. లేక΄ోతే అవి మనస్సును కలుషితం చేసి మానసిక ప్రశాంతతను దూరం చేస్తాయి. 

లోపాలను గుర్తించి సరిదిద్దుకోవడం వల్ల మనస్సుపై భారం తగ్గి, అగాధమైన శాంతి లభిస్తుంది.  జీవితంలో వచ్చే ఎదురుదెబ్బలకు ఇతరులను లేదా కాలాన్ని నిందించకుండా, మన పాత్ర ఎంత ఉందో గ్రహించే పరిపక్వత వస్తుంది. బాహ్య ప్రపంచం తాత్కాలికమైనదని, అంతరంగంలోని ఆత్మస్వరూపమే శాశ్వతమైనదని అవగాహన కలుగుతుంది.

ఆధ్యాత్మిక చింతన అనేది బాహ్య వేషధారణలోనో, ఆచారాల్లోనో లేదు. అది మన అంతరంగంలో జరిగే పరివర్తనలో ఉంది. ఆ పరివర్తనకు మూలస్తంభం ఆత్మవిమర్శ. మనం చేసే ప్రతి ఆలోచనను, ప్రతి పనిని మనస్సాక్షితో సమీక్షించుకున్నప్పుడు, మనిషిలోని మృగత్వం నశించి, మానవత్వం వికసించి, అంతిమంగా దైవత్వానికి మార్గం సుగమమవుతుంది. అందుకే, ప్రశాంతమైన జీవితానికి, ఆధ్యాత్మిక ఉన్నతికి నిరంతర ఆత్మవిమర్శే పరమౌషధం.

ఆత్మవిమర్శ అంటే నిరాశతో మనల్ని మనం నిందించుకోవడం కాదు. లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దుకుని ఎదగడానికి చేసే స్వయం ప్రక్షాళన. మానవుడి ఎదుగుదలకు, ఆధ్యాత్మిక పురోగతికి అతిపెద్ద అడ్డంకి అహంకారం. నిరంతరం ఆత్మవిమర్శ చేసుకునే వ్యక్తికి తన పరిమితులు, తనలోని అజ్ఞానం అర్థమవుతాయి అరిషడ్వర్గాలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి. ఆత్మవిమర్శ ద్వారానే మనస్సులో ఏ క్షణంలో కోపం వస్తోందో, ఏ క్షణంలో ఈర్ష్య కలుగుతోందో సాధకుడు గుర్తించగలడు. లోపాన్ని ముందే గుర్తిస్తే దాన్ని నియంత్రించడం సులభమవుతుంది.

– తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి

#

Tags : 1

Videos

నేడు MLA, MLCలతో వైఎస్ జగన్ కీలక సమావేశం

నా కాలు విరిగినా.. నా ప్రాణం పోతాదన్నా జగనన్న కోసం ఎలాంటి కష్టానైనా...

EVM ట్యాపరింగ్ జరిగిందో లేదో చంద్రబాబే చెప్పాలి..! ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్

రాజమండ్రి పోలీసులు అందరూ ఎలాంటివారంటే..! డాక్టర్ ప్రియాంక ఘటనపై అడ్వకేట్ బాల కామెంట్స్

నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేసి... సీదిరి అప్పలరాజు భార్య సంచలన వ్యాఖ్యలు

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది మృతి

విజయ్ సంచలన నిర్ణయం.. డిప్యూటీ సీఎంగా త్రిష?

కారుతో తొక్కేసి మెడికో ప్రియాంకను చంపి పరార్.. పూర్తి CCTV ఫుటేజ్?

కొత్త కరెన్సీ వచ్చేస్తోంది.. 100 కోట్ల ప్లాస్టిక్ నోట్లతో కేంద్రం ట్రయల్

ఒక్క ఉద్యోగం లేని టెసారా కంపెనీలో కోట్ల డబ్బు ఎలా..?

Photos

+5

హైదరాబాద్‌లో మొదలైన వినాయక చవితి 2026 సందడి (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌...(ఫొటోలు)

+5

‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌...ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)

+5

హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు)

+5

ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు)

+5

ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)

+5

యంగ్ హీరోతో నయన్ లవ్ పోజులు (ఫొటోలు)

+5

‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం క్యూట్ ఫ్యామిలీ.. వెకేషన్ (ఫొటోలు)