Breaking News

Interesting Facts: షేక్స్‌పియర్‌ విషయంలో అది నిజమైంది,ఆయన పిల్లలందరూ..

Published on Fri, 09/15/2023 - 16:50

Intresting Facts:

►  సంతోషంగా ఉండడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు? అయితే కొందరు మాత్రం సంతోషంగా ఉండడానికి భయపడతారు. దీనికి కారణం సంతోషంగా కనిపిస్తే కీడు జరుగుతుందనే మూఢ నమ్మకం. సంతోషంగా ఉండడానికి భయపడే లక్షణాన్ని చెరోఫోబియా అంటారు.

► ‘ది క్విక్‌ బ్రౌన్‌ ఫాక్స్‌ జంప్స్‌ వోవర్‌ ది లేజీ డాగ్‌’ అనే వాక్యంలో ఆంగ్ల వర్ణమాలలోని అన్ని అక్షరాలు కనిపిస్తాయి. 


►     ఒక దురలవాటు దూరం కావాలంటే గట్టిగా 21 రోజులు దాని జోలికి వెళ్లకుండా ఉంటే సరిపోతుందట.
►    ‘వోవర్‌ మారో’ అంటే ఏమిటో కాదు  ది డే ఆఫ్టర్‌ టుమారో(ఎల్లుండి) అని.

‘పండిత పుత్ర పరమ శుంఠ’ అనే నానుడి ఇంగ్లిష్‌ కవి, రచయిత షేక్స్‌పియర్‌ విషయంలో నిజమేననిపిస్తుంది. షేక్స్‌పియర్‌ ప్రపంచ ప్రఖ్యాతి పొందినా, ఆయన పిల్లలందరూ నిరక్షరాస్యులే! 
► కొందరు కూరగాయలను చూస్తే చాలు విపరీతంగా భయపడతారు. కూరగాయల పట్ల ఉండే ఈ అరుదైన భయాన్ని ‘ల్యాకనోఫోబియా’ అంటారు.


► ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అనే సామెత తెలిసిందే గాని, నిజానికి రొయ్య కొంచెం కూత ఘనం అనడమే సమంజసం. ఎందుకంటారా? ‘పిస్టల్‌ ష్రింప్‌’ జాతికి చెందిన రొయ్య మహా అయితే రెండు సెంటీమీటర్లు ఉంటుంది. ఇది చేసే ధ్వని మాత్రం కాంకోర్డ్‌ విమానాల స్థాయిలో ఉంటుంది. ఇది తన డెక్కలను వేగంగా మూసి తెరవడం ద్వారా 230 డెసిబల్స్‌ ధ్వనిని పుట్టించగలదు.


► బ్రిటన్‌ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఎనిమిదో హెన్రీ వద్ద ‘గ్రూమ్స్‌ ఆఫ్‌ స్టూల్స్‌’ పనిచేసేవాళ్లు. వాళ్ల పనేమిటంటే రాజావారు గురుశంక తీర్చుకున్నాక శుభ్రం చేయడం. తన హయాంలో ఈ ఉద్యోగంలో పనిచేసిన నలుగురికీ నైట్‌హుడ్‌ అనుగ్రహించారు రాజావారు. 
► అమెరికా 41వ అధ్యక్షుడు జార్జ్‌ హెచ్‌ డబ్ల్యూ బుష్‌కు బ్రకోలీ అంటే విపరీతమైన అయిష్టం ఉండేది. ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానాల్లో బ్రకోలీ పై నిషేధం విధించారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)