Breaking News

Trekker Sindhu: తనయ నడిచే.. తండ్రిని గెలిపించే!

Published on Sat, 03/08/2025 - 16:42

ఆధునిక మహిళల విజయాలు వ్యక్తిగతానికి మాత్రమే పరిమితం కావడం లేదు. తమ పిల్లల నుంచి పేరెంట్స్‌ వరకూ సక్సెస్‌ ఫుల్‌ అనిపించుకునేలా కూడా చేస్తున్నాయి. అలాంటి ఓ యువతి.. కృష్ణా రామా అనుకుంటూ కూర్చోవాలి అని సమాజం నిర్దేశించిన వయసులో ఉన్న తండ్రిని యువకులతో సమానంగా ట్రెక్కింగ్‌లో రాణించేలా తీర్చిదిద్దింది.   సాక్షి, సిటీబ్యూరో 

రిటైర్మెంట్‌ తర్వాత శ్రమ పడకూడదని తల్లిదండ్రులను ఇంటి దగ్గరే ఉంచి ఇల్లు, నౌకర్లు, కారు వగైరా సౌకర్యాలన్నీ అమర్చి జాగ్రత్తగా చూసుకునే కూతుళ్లు, కొడుకులను చూసి ఉంటాం. కానీ 60 ఏళ్ల వయసులో తండ్రిని కొండలు, గుట్టలు ఎక్కించి వేల కిలోమీటర్లు తనతోపాటు నడిపించిన కూతుర్ని చూశామా? అంటే..  ‘మా అమ్మాయే నా చేత తొలి అడుగులు వేయించింది..’ అంటూ సంతోషంగా చెబుతారు ఆమె తండ్రి ఏబీఆర్‌పీ రెడ్డి. కొండాపూర్‌లో నివసించే సింధు రెగ్యులర్‌గా కొండలు, గుట్టలు ఎక్కేసే సిటీ ట్రెక్కింగ్‌ లవర్స్‌లో ఒకరు. వ్యాపార వ్యవహారాల నుంచి విశ్రాంతికి షిఫ్ట్‌ అయిన వెంటనే తన ట్రెక్కింగ్‌ హాబీని తండ్రికి వారసత్వంగా అందించారు. తద్వారా ఓ మంచి ట్రెక్కర్‌గా మారేందుకు మాత్రమే కాదు 73 ఏళ్ల వయసులో రికార్డ్స్‌ సృష్టించేందుకు కూడా దోహదపడ్డారు. మార్కెటింగ్‌ రంగంలో ఉన్న సింధు ఇప్పటి వరకూ ఎనిమిది చెప్పుకోదగ్గ సాహసవంతమైన ట్రెక్స్‌ని పూర్తి చేశారు. సింధు ఇటు ఆటలు, అటు సాహసాలతో ఆత్మ సంతృప్తికే ప్రాధాన్యత ఇస్తూ.. విలాసాల వెనుక పరుగులు తీసేవారికి ఓ గుణపాఠంలా నిలుస్తున్నారు. ‘వయసు అనేది ఒక నెంబర్‌ మాత్రమే అంతా మైండ్‌సెట్‌లోనే ఉంది అని నేను నమ్ముతాను’ అంటారు సింధు. అందుకే అరవైలో ఉన్న తండ్రిని సైతం తనతో పాటు సాహస యాత్రలవైపు నడిపించారు. 

చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్‌ యాక్షన్‌ అంటే? మాటలేనా!

‘నాన్న మొదటి నుంచీ చాలా ఫిట్‌గా ఉంటారు. బిజినెస్‌ నుంచి ఫ్రీ కాగానే జిమ్‌లో చేరడమే కాకుండా నాతో పాటు ట్రెక్‌కి రమ్మని ప్రోత్సహించాను’ అంటూ గుర్తు చేసుకున్నారు.. తాను 23 ఏళ్ల వయసులో ట్రెక్కింగ్‌ ప్రారంభించిన సింధు.. రన్నింగ్, సైక్లింగ్‌ ఇలా ప్రతి హాబీనీ తండ్రితో కలిసి పంచుకున్నారు. ‘నాన్నకు చిన్నప్పుడు సాహస యాత్రలు చేసే అలవాటు ఉండేది, అయితే వర్క్‌లో పడిపోయాక దాన్ని మరచిపోయారు. నేను దానిని మళ్లీ గుర్తు చేశా అంతే’ అంటూ చెప్పారామె. గత డిసెంబర్‌లో తన తండ్రితో కలిసి చేసిన ట్రెక్‌.. ఎప్పటికీ మరచిపోలేనిదని అంటారామె. అప్పటి వరకూ ఒక్కసారి కూడా ట్రెక్కింగ్‌ అనుభవం లేని తండ్రి తొలిసారే ఉత్తరాఖండ్‌లో 12వేల కిమీ అధిరోహించి రికార్డ్‌ సృష్టించారు. అయితే నాన్న ఫిట్‌నెస్‌ గురించి నాకు తెలుసు. అలాగే ఎప్పుడైతే మా అడ్వెంచర్‌ గ్రూప్‌లో జాయిన్‌ చేశానో.. దాని నుంచి నాన్న కూడా బాగా ఇన్‌స్పైర్‌ అయ్యారు.’ అంటూ వివరించారామె.

మైండ్‌సెట్‌లోనే అంతా ఉంది.
‘వయసు అనేది ఒక నెంబర్‌ మాత్రమే అంతా మైండ్‌సెట్‌లోనే ఉంది అని నేను నమ్ముతాను’ అంటారు సింధు. అందుకే అరవైలో ఉన్న తండ్రిని సైతం తనతో పాటు సాహస యాత్రలవైపు నడిపించారు. ‘నాన్న మొదటి నుంచీ చాలా ఫిట్‌గా ఉంటారు. బిజినెస్‌ నుంచి ఫ్రీ కాగానే జిమ్‌లో చేరడమే కాకుండా నాతో పాటు ట్రెక్‌కి రమ్మని ప్రోత్సహించాను’ అంటూ గుర్తు చేసుకున్నారు.. తాను 23 ఏళ్ల వయసులో ట్రెక్కింగ్‌ ప్రారంభించిన సింధు.. రన్నింగ్, సైక్లింగ్‌ ఇలా ప్రతి హాబీనీ తండ్రితో కలిసి పంచుకున్నారు. ‘నాన్నకు చిన్నప్పుడు సాహస యాత్రలు చేసే అలవాటు ఉండేది, అయితే వర్క్‌లో పడిపోయాక దాన్ని మరచిపోయారు. నేను దానిని మళ్లీ గుర్తు చేశా అంతే’ అంటూ చెప్పారామె. గత డిసెంబర్‌లో తన తండ్రితో కలిసి చేసిన ట్రెక్‌.. ఎప్పటికీ మరచిపోలేనిదని అంటారామె. అప్పటి వరకూ ఒక్కసారి కూడా ట్రెక్కింగ్‌ అనుభవం లేని తండ్రి తొలిసారే ఉత్తరాఖండ్‌లో 12వేల కిమీ అధిరోహించి రికార్డ్‌ సృష్టించారు. అయితే నాన్న ఫిట్‌నెస్‌ గురించి నాకు తెలుసు. అలాగే ఎప్పుడైతే మా అడ్వెంచర్‌ గ్రూప్‌లో జాయిన్‌ చేశానో.. దాని నుంచి నాన్న కూడా బాగా ఇన్‌స్పైర్‌ అయ్యారు.’ అంటూ వివరించారామె. 
 

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)