Breaking News

International Dance Day ఆదిమ వారసత్వం నృత్యం

Published on Tue, 04/29/2025 - 12:12

వినసొంపైన సంగీతం వినబడితే శరీరం అప్రయత్నంగా లయ బద్ధంగా కదులుతుంది. దానినే ‘నృత్యం’ అంటారు. 1760లో రచయిత, ఆధునిక ఫ్రెంచ్‌ నృత్య నాటికల సృష్టికర్త అయిన జీన్‌ జార్జెస్‌ నోవెర్రీ జన్మదినాన్ని పురస్కరించుకొని యునెస్కో ఏప్రిల్‌ 29ని ‘అంత ర్జాతీయ నృత్య దినోత్సవం’గా ప్రకటించింది. నృత్య కళారూపాలను నివేదించడానికీ; ప్రపంచీకరణను, రాజకీయ, సాంస్కృతిక, జాతి అడ్డంకులను అధిగమించడానికీ... నృత్య రీతులు గల ప్రజలందరినీ ఒకే చోటికి తేవడానికీ కృషి చేయడం ఈ దినోత్సవ లక్ష్యం. ఇంట ర్నేషనల్‌ డ్యాన్స్‌ కమిటీ ప్రవేశపత్రం ఆధారంగా ప్రతీ ఏటా ఒక అద్భుతమైన నృత్య దర్శకుడు లేదా నర్తకుడిని ఎంపిక చేసి ఆ రోజు వారి సందేశాన్ని అందించడానికి ఆహ్వానిస్తారు. 

ఆదిమ సంస్కృతికి చిహ్నం
నృత్యం. అదివాసీలు ప్రకృతిని, సూర్యుని, చంద్రుని దేవుళ్ళుగా భావించేవారు. కొన్ని తెగల వారు ప్రత్యేకించి (గోత్రం పరంగా) కొన్ని జంతువులను మాత్రమే దేవుళ్ళుగా పూజిస్తూ వాటి మాంసాన్ని ముట్టరు. రాతి యుగం నాటి ఫ్రాన్స్, స్పెయిన్, ఇండియా వంటి దేశాలలోని కొండ గుహలలో ఆదిమ మానవుల వేట, నాట్యం, దృశ్యాలు కన్పిస్తున్నాయి. వీటిని బట్టి ఆదిమ కాలం నుండి నాట్యం అనేది ప్రస్తుత మానవునికి వారసత్వంగా లభించిందని చెప్పవచ్చు.  

నృత్యం లేకుండా ఆదివాసీలలో ఏ సంబురాలూ జరుగవు. మన తెలుగు రాష్ట్రాల్లోని ఆదిమ తెగలలో థింసా, గుస్సాడీ, రేలా, దండారీ, కొమ్ము నృత్యాలు ప్రసిద్ధి. అయితే భరతనాట్యం, కూపూడి, ఒడిస్సీ, మణిపురి, మోహినీ ఆట్టం వంటి భారతీయ శాస్త్రీయ నృత్యాలుగా పిలిచేవాటికే ప్రపంచవ్యాప్తంగా మం గుర్తింపు ఉంది. భారతీయ నాట్య ప్రపంచంలో చిందు బాగోతుల వారు ఆడే ఆట, పులినృత్యం వంటి ఎన్నో జానపద నృత్యాలూ ఉన్నాయి. అయితే అనేక నృత్య రీతులు ఇప్పుడు కనుమరుగవ్వడం విచారకరం. భారతీయ
సంస్కృతి -సంప్రదాయాలలో భాగమైన నృత్యకళను రక్షించుకోవా లంటే సంబంధిత నృత్య కళాకారులకు ప్రభుత్వం సరైన జీవనభృతి కల్పించాలి.

– గుమ్మడి లక్ష్మీనారాయణ, సామాజిక రచయిత 
(నేడు అంతర్జాతీయ నృత్య దినోత్సవం)

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)