Breaking News

చర్మ సంరక్షణకు డార్క్‌ చాక్లెట్‌..!

Published on Fri, 09/13/2024 - 16:11

చాక్లెట్‌ అంటే చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా ఆస్వాదిస్తారు. ఓ చిన్న ముక్క నోట్లో వేసుకుని చప్పరిస్తే ఉండే ఆనందమే వేరబ్బా..!. అలాంటి  చాక్లెట్‌ మీ ముఖ సౌందర్యానికి ఎన్నో అద్భుత ప్రయోజనాలను ఇవ్వగలదని చెబుతున్నారు చర్మ సంరక్షణ నిపుణులు. ఈ రోజు అంతర్జాతీయ చాక్లెట్‌ దినోత్సవం సందర్భంగా డార్క్‌ చాక్లెట్‌ మీ చర్మ సంరక్షణకు ఎలా ఉపయోగపడుతుంది? దీని వల్ల కలిగే ప్రయోజనాలు గురించి నిపుణుల మాటల్లో సవివరంగా చూద్దాం. 

ఇది చర్మానికి మంచి సూపర్‌ పుడ్‌. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్‌ చర్మానికి మెరుపుని అందించడంలో సహాయపడతాయని చెబుతున్నారు నిపుణులు. 

చర్మ సంరక్షణకు ఎలా ఉపయోగపడుతుందంటే..
డార్క్ చాక్లెట్‌లో ఫ్లేవనాయిడ్స్ అనే  శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. అలాగే అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తాయి. ముఖంపై ఏర్పడే గీతలు, ముడతలను దూరం చేస్తుంది. 

హైడ్రేషన్ బూస్ట్: 
డార్క్ చాక్లెట్ తినడం వల్ల  పోషకాలు  చర్మ కణాలకు వేగంగా చేరుకుంటాయి. ఫలితంగా చర్మ హైడ్రేషన్‌ని పెంచి ముఖం మృదువుగా  ఉండేలా చేస్తుంది. 

సన్ ప్రొటెక్షన్: ఇది సన్‌స్క్రీన్‌కు ప్రత్యామ్నాయం కానప్పటికీ డార్క్ చాక్లెట్ కొంత యూవీ సంరక్షణను అందిస్తుంది. చాక్లెట్‌లోని ఫ్లేవనాయిడ్లు సూర్యరశ్మికి చర్మం ప్రతిఘటనను బలపరుస్తుంది. అలాగే కమిలిపోకుండా చేస్తుంది

స్ట్రెస్ బూస్టర్: 
ఒత్తిడి చర్మాన్ని యవ్వన హీనంగా చేస్తుంది.  దీనివల్ల పగుళ్లు ఏర్పడి నిస్తేజంగా ఉంటుంది. డార్క్ చాక్లెట్ కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంటే ఒత్తిడిని తగ్గించి, తాజా యవ్వన మెరుపును మరింత పెంచుతుంది.

డిటాక్స్ డిలైట్: డార్క్ చాక్లెట్‌లో ఉండే మినరల్స్-జింక్, మెగ్నీషియం-కణ పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది. చర్మాన్ని త్వరగా రిపేర్ చేయడంలో సహాయపడుతుంది.

చాక్లెట్ స్మూతీ గ్లో: బచ్చలికూర, బాదం పాలు, అరటిపండుతో పాటు డార్క్ చాక్లెట్  చిన్న ముక్కను స్మూతీలో జోడించండి. ఈ రుచికరమైన మిశ్రమం అద్భుతమైన రుచిని మాత్రమే కాకుండా చర్మానికి లోపలి నుంచి అదనపు మెరుపును కూడా ఇస్తుంది.

స్నాక్ స్మార్ట్: రోజువారీ చిరుతిండిలో భాగంగా 70% లేదా అంతకంటే ఎక్కువ డార్క్ చాక్లెట్‌ని చిన్న ముక్కగా తింటే అద్భుతమైన ఫలితాలు పొందుతారు. 

చాక్లెట్ బాడీ స్క్రబ్: కరిగించిన డార్క్ చాక్లెట్, పంచదార, కొబ్బరి నూనెతో ఉల్లాసంగా ఎక్స్‌ఫోలియేటింగ్ స్క్రబ్‌ను తయారు చేయండి. ఈ తీపి స్క్రబ్ శరీరాన్ని మృదువుగా చేయడమే గాక మృత కణాలను తొలగిస్తుంది. 

(చదవండి: స్ట్రిక్ట్‌ మామ్‌ కాజోల్‌: సరిగా చేస్తే హెలికాప్టర్‌ పేరెంటింగ్‌ విధానం బెస్ట్‌!)
 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)