Breaking News

తెల్లవెంట్రుకలను చూసి చింతించాల్సిన అవసరం లేదు! ఇంట్రస్టింగ్‌ స్టోరీ

Published on Tue, 02/04/2025 - 11:10

ఓ పురాణ కథ ప్రకారం రాజ్య వర్ధనుడనే రాజు తన రాజ్యాన్ని 70 వేలసంవత్సరాలు ధర్మబద్ధంగా పాలించాడు. అతని పాలనలో ప్రజలు అనారోగ్యాలు, అనావృష్టులు లేని జీవనం గడిపారు.  ఒకరోజు రాజపత్ని, రాజు గారి తలలో తెల్ల వెంట్రుకను చూసి కన్నీరు పెట్టింది. రాజు ఎందుకు ఏడుస్తున్నావని అడిగినా చెప్పకుండా దుఃఖిస్తూనే ఉంది. రాజు ఒత్తిడి చేయడంతో ఆయన తలలో తెల్ల వెంట్రుకను చూసి దుఃఖిస్తున్నానంటుంది. అందుకు రాజు: ‘దీనికై బాధ పడకూడదు. ఇన్ని సంవత్సరాలు జీవించాను. ఎన్నో శుభకార్యాలు చేశాను. తెల్ల వెంట్రుకలు వచ్చినా, దేహం ముడతలు పడినా విచారించనవసరం లేదు. ఈ పలిత కేశం వృద్ధాప్యానికి గుర్తు. నేనింక వనాలకు వెళ్ళవలసి ఉంది. ఇన్నాళ్లు లౌకిక సుఖాలు అనుభవించాను. ఇప్పుడు తపస్సు చేసుకుంటాను. కుమారునికి రాజ్యాభిషేకం చేసి వెళతాను’ అన్నాడు.

పలిత కేశం వ్యక్తులు ఇంకా నిర్వహించవలసిన మిగిలిపోయిన బాధ్యతలను గురించి హెచ్చరిస్తుంది. కుటుంబ బాధ్యతలు తీరిపోతే, దైవ సన్నిధిలో, ఆధ్యాత్మిక మార్గంలో జీవించమని హితవు చెబుతుంది. తలలో నెరసిన వెంట్రుకలను చూసి, వయసై పోతోందే అని వ్యధ చెందనవసరం లేదు. లౌకిక జీవన పోరాటంలో కొట్టుమిట్టాడుతున్న వారికి ముక్తి మార్గాన్ని చూపే హితైషి పలిత కేశం. వయసుతోపాటు శరీరంలో  వచ్చే సహజ పరిణా మాలను గుర్తు చేసే సత్య బోధిని పలిత కేశం.

అయితే పై కథలో రాజును విడిచి ఉండలేని ప్రజలు, ఇంకా పదివేల ఏళ్ళు రాజు, స్థిర యవ్వనం, అందమైన కేశాలు కలిగి ఉండి తమనుపాలించాలని సూర్య దేవుని ప్రార్థించి వరం పొందారు. రాజు, ఆ ప్రజలు లేకుండా తాను వర ప్రభావంతో జీవించి ఉండలేనని, తన కోసం ప్రార్థించిన వారి కోసం తనున్నాళ్ళు వారు జీవించేట్లు వరం ఇమ్మని సూర్యదేవుని ప్రార్థించి వరం పొందాడు. ప్రజలను చక్కగా పాలించాడు. ఈ కథ మార్కండేయ పురాణం లోనిది.ఎప్పటికైనా వృద్ధాప్యం (పలిత కేశం) రావడం అనివార్యం అనే వాస్త వాన్ని గ్రహించి తదనుగుణంగా (భగవచ్చింతనతో) మెలగాలి.   
– డా. చెంగల్వ రామలక్ష్మి 

ఇదీ చదవడి: World Cancer Day 2025 : లక్షలాదిమంది బిడ్డలు అనాథలుగా; ముందుగా గుర్తిస్తే!


 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)