Breaking News

ఈ పిజ్జా చాలా ఫేమస్‌.. దీని చరిత్ర తెలుసుకుంటే షాక్‌ అవ్వాల్సిందే!

Published on Sun, 07/16/2023 - 10:14

ఇటలీకి చెందిన పిజ్జా ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఖండఖండాంతరాల్లో చాలామంది అభిమానించే పిజ్జా వంటకం పద్దెనిమిదో శతాబ్దిలో ఇటలీలోని నేపుల్స్‌ ప్రాంతంలో పుట్టిందని చెబుతారు. పిజ్జా గురించి ఇప్పటి వరకు తెలిసిన చరిత్ర ఇదే! అయితే, పిజ్జా అంతకంటే పురాతనమైనదేననేందుకు తాజా ఆధారం లభించింది. నేపుల్స్‌కు చేరువలోని పోంపే నగరంలో రోమన్‌ కాలానికి చెందిన పురాతన శిథిల భవనంలో గోడలపై ఉన్న కుడ్యచిత్రాల్లో పిజ్జా చిత్రం కూడా ఉంది. ఇటీవల పురాతత్త్వ శాస్త్రవేత్తలు దీనిని గుర్తించారు.

సహజమైన రంగులతో చిత్రించిన ఈ కుడ్యచిత్రంలో వెండిపళ్లెంలో పిజ్జాను తలపించే రొట్టె, పండ్లు, మధుపాత్ర ఉన్నాయి. ఈ చిత్రంలోని రొట్టె పిజ్జాకు తొలిరూపం కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రోమన్‌ నాగరికత కాలానికి చెందిన ఈ భవంతి క్రీస్తుపూర్వం మూడో శతాబ్దికి చెందినదని వారు చెబుతున్నారు. ఇక్కడకు చేరువలోని మౌంట్‌ వెసూవియస్‌ అనే అగ్నిపర్వతం క్రీస్తుశకం 79లో బద్దలైనప్పుడు పాంపే, ఆప్లాంటిస్‌ నగరాలు లావాలోను, బూడిదలోను కూరుకుపోయాయి. ఇటీవల అక్కడ జరిపిన తవ్వకాల్లో ఈ పురాతన భవంతి, అందులోని పిజ్జా కుడ్యచిత్రం బయటపడటం విశేషం.

చదవండి America PPP Fraud: ప్రపంచంలోనే అత్యంత ఘరానా మోసం.. అమెరికా సర్కార్‌కే షాక్‌!

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)