Breaking News

దొండతో దండిగా ఆదాయం!

Published on Tue, 10/29/2024 - 11:15

ప్రణాళికాబద్ధంగా కష్టపడితే వ్యవసాయం సహా ఏ రంగంలోనైనా రాణించొచ్చు అంటున్నారు ప్రకాశం జిల్లా కంభం పట్టణానికి చెందిన యంజి బీఈడి కళాశాల కరస్పాండెంట్‌ గఫార్‌ అలిఖాన్‌ బీఈడీ కళాశాల పనులపై ఇతర  ప్రాంతాలు వెళ్లి వచ్చే క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలో పండ్ల తోటల్లో అంతర పంటలుగా కూరగాయలు సాగు చేస్తున్న  పొలాలు కంటపడ్డాయి. ఆ పంటలను చూసిన తర్వాత వ్యవసాయంపై మక్కువ కలిగింది. అక్కడి రైతులతో మాట్లాడి వ్యవసాయం లాభదాయకంగా ఎలా చెయ్యాలో తెలుసుకున్నారు. కందులాపురం వద్ద తనకున్న 2.2 ఎకరాల భూమిలో రెండేళ్ళ క్రితం బత్తాయి మొక్కలు నాటారు. అందులో 12 రకాల అంతర పంటలు సాగు చేస్తూ సత్ఫలితాలు  పొందుతున్నారు గఫార్‌.

బత్తాయి తోట కాపునకు వచ్చే సరికి నాలుగేళ్ళ కాలం పడుతుంది. ఈలోగా అంతర పంటలు వేసుకొని సాగు లాభదాయకమని ప్రధాన అంతర పంటగా టొమాటోను ఫెన్సింగ్‌ పద్ధతిలో సాగు చేస్తూ మంచి దిగుబడి  పొందుతున్నారు. బత్తాయి తోట చుట్టూ సుమారు 20 సెంట్లలో పందిళ్లు వేసి దొండ మొక్కలు నాటారు. 

4 నెలలకే పంట చేతికి వస్తున్నది. ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ దొండ రూ. 50 వరకు పలుకుతున్నది. ఇప్పటికే రూ. లక్షన్నరకు పైగా లాభం వచ్చిందని గఫార్‌ వివరించారు. దొండ పందిళ్ల కింద క్యాబేజీ, బీట్‌రూట్‌ సాగు చేస్తున్నారు. పొలం చుట్టూ వేసిన ఫెన్సింగ్‌కు సైతం సొరకాయ చెట్లను పాకించారు. సొర తీగలు కాయలనివ్వటంతో పాటు చీడపీడలను అడ్డుకునే జీవకంచెగా ఉపయోగ పడుతున్నాయన్నారు. కొత్తిమీర, కాకర, మెంతి, కాకర, మిరప, మునగ, కాళీఫ్లవర్, బీర ఇంకా తదితర అంతర పంటలు సాగు చేస్తున్నారు. రెండు ఎకరాల్లో 15 ట్రాక్టర్ల మాగిన పశువుల ఎరువుతో పాటు వర్మీ కం΄ోస్టు, జీవామృతం, వేప పిండి, కానుగ పిండి, ఆముదం పిండి, జీవన ఎరువులను వినియోగిస్తున్నారు.   

బత్తాయిలో సాగు చేసే అంతర పంటలకు పెట్టుబడి తక్కువగానే ఉంటుంది. పందిళ్లు వేసి విత్తనాలు నాటితే చాలు దిగుబడినిస్తాయి. దొండలో వచ్చిన ఆదాయం బత్తాయితో పాటు ఇతర అన్ని పంటల పెట్టుబడికి సరి΄ోతుందని గఫార్‌ స్వీయానుభవంగా చెబుతున్నారు. బీర, సొరకాయ, క్యాబేజీ, ఇతర కూరగాయల సాగు కూడా మంచి లాభదాయకమేనన్నారు.  
 

తక్కువ విస్తీర్ణంలో అంతర పంటలతో మేలు: రెండెకరాల లేత బత్తాయి తోటలో అంతర పంటలుగా కూరగాయలు సాగు చేస్తున్నాను. భూమిని ఖాళీగా వదలకుండా అంతర పంటలు వేశాం. తోటల్లో అంతర పంటలుగా కూరగాయ  పంటలు సాగు చేసుకుంటే మంచి లాభాలు ఉంటాయని నా అనుభవంలో తెలుసుకున్నాను. అంతర పంటలకు పెట్టుబడి తక్కువే. శ్రమ అధికంగా ఉంటుంది. అందుకని రైతులు తక్కువ విస్తీర్ణంలో అంతర పంటలు వేసుకోవటం లాభదాయకం. – గఫార్‌ అలీఖాన్, కంభం 

– ఖాదర్‌ బాష, సాక్షి, కంభం

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)