Breaking News

ఇంట్లోనే ఇన్‌స్టంట్‌ గ్లో..!

Published on Fri, 01/31/2025 - 10:28

మామూలుగా చాలా నిరాడంబరంగా ఉండేవారు సైతం ఏదైనా పార్టీ అనగానే ఇన్‌స్టంట్‌ గ్లో రావాలంటే ఏం చేయాలో అప్పటికప్పడు ప్లాన్స్‌ చేసుకునేవారుంటారు. ఇలాంటప్పుడు కొన్ని సమస్యలూ తలెత్తవచ్చు. ముందుగా కొద్దిపాటి అవగాహనతో చర్మ సంరక్షణ పట్ల జాగ్రత్త తీసుకుంటే ఇంట్లోనే ఇన్‌స్టంట్‌ గ్లో పొందవచ్చు. 

ఐసింగ్‌ ... మేకప్‌కు ముందు చర్మం బిగుతుగా, తాజాగా కనిపించడానికి ఐస్‌క్యూబ్స్‌తో మసాజ్‌ చేసుకుంటారు. దీంతో పోర్స్‌ మూసుకుపోయి, మేకప్‌ తాజాగా కనిపిస్తుంది. అరగంట ముందు రోజ్‌ వాటర్, గ్లిజరిన్‌ కలిపి ముఖానికి అప్లై చేస్తారు. పాలతో కూడా చర్మాన్ని మసాజ్‌ చేసుకోవచ్చు. పాలలో మైల్డ్‌ లాక్టిక్‌ యాసిడ్‌ ఉంటుంది కాబట్టి చర్మానికి హాని కలగదు.

ప్రొడక్ట్స్‌తో జాగ్రత్త... ఇన్‌స్టంట్‌ గ్లో కోసం కొన్ని ప్రొడక్ట్స్‌ వాడుతుంటారు. అయితే, సున్నితమైన చర్మం గలవారు, ఎగ్జిమా వంటి సమస్యలు ఉన్నవారు ఆ ప్రొడక్ట్స్‌ గురించి తెలియక వాడితే మరిన్ని కొత్త సమస్యలు తలెత్తవచ్చు. ఇంట్లో వాడే ప్రొడక్ట్స్‌ ఏవైనా నిపుణులు సూచనలతో వాడటం మేలు.

ఫేసియల్స్‌... ఇన్‌స్టంట్‌ గ్లో కోసం కెమికల్‌ పీల్, పంప్కిన్‌ పీల్, హైడ్రా ఫేసియల్స్‌... వంటివి కొంత తాజాదనాన్ని ఇస్తాయి. అయితే, వీటిని వేడుక ఉన్న రోజే కాకుండా రెండు, మూడు రోజుల ముందు నిపుణుల ఆధ్వర్యంలో ప్రయత్నించాలి. 

ఫేసియల్స్‌కి వాడక్ట్స్‌ మీ చర్మతత్వానికి సరిపడతాయో లేదో ముందస్తుగా చెక్‌ చేసుకొని వాడటం మంచిది.    లేజర్‌ వంటి ఇతర బ్యూటీ ట్రీట్మెంట్లు అయితే నిపుణుల ఆధ్వర్యంలో వేడుకకు కనీసం 10–15 రోజుల ముందు చేయించుకోవడం వల్ల చర్మం కాంతిమంతంగా కనిపిస్తుంది. 
డాక్టర్‌ స్వప్నప్రియ, క్లినికల్‌ డెర్మటాలజిస్ట్‌ 

(చదవండి: సోనమ్ కపూర్ వాచ్‌ ధర తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!)

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)