Breaking News

గడ్డం కావాలా? గర్ల్‌ ఫ్రెండ్‌ కావాలా? రోడ్డెక్కిన కాలేజీ అమ్మాయిలు

Published on Sat, 10/19/2024 - 13:23

ఎలాంటి భర్త కావాలి?   లేదా ఎలాంటి భార్య కావాలి? అని  పెళ్లీడుకొచ్చిన  పిల్లల్ని పెద్దలు అడగడం  సాధారణం.  అలాగే నాకు ఎర్రగా, బుర్రగా ఉన్న అమ్మాయి కావాలి అని అబ్బాయిలు, ఆరడుగులుంటాడా? ఆరెంకెల జీతం ఉందా? అని అమ్మాయిలు ఆశపడటం చాలా కామన్‌. కానీ ఇపుడు ట్రెండ్‌మారింది అంటున్నారు ఇండోర్‌ యువతులు. అంతేకాదు ఏకంగా ‘మాకొద్దీ గడ్డం బూచోళ్లు’,‘నో క్లీన్ షేవ్‌.. నో గ‌ర్ల్‌ఫ్రెండ్' అంటూ రోడ్డుమీద కొచ్చారు.  దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌  కావడమే కాదు. ఫ్యాషన్‌గా గెడ్డం పెంచుకుంటున్న  పెళ్లి కాని ప్రసాదుల గుండెల్లో బాంబు పేల్చింది.

ఇండోర్‌లో కొంద‌రు కాలేజీ యువ‌తులు  'గ‌డ్డం తొలిగించండి.. ప్రేమ‌ను కాపాడండి' అనే నినాదంతో యువ‌తులు  ర్యాలీ తీశారు. ముఖాల‌కు గ‌డ్డం మేక‌ప్‌ వేసుకొని మరీ అబ్బాయిల గ‌డ్డం విష‌య‌మై ర్యాలీ  తీయడం హాట్‌ టాపిక్‌గా నిలిచింది., ‘గడ్డం రఖో యా జిఎఫ్ రఖో’(గడ్డం కావాలా? గర్ల్‌ఫ్రెండ్‌కావాలా),  'గడ్డం హటావో ప్యార్ బచావో' నినాదాలతో వీధుల్లోకి వచ్చారు. 'నో క్లీన్ షేవ్.. నో ల‌వ్‌', 'నో క్లీన్ షేవ్‌.. నో గ‌ర్ల్‌ఫ్రెండ్'  అనే ప్లకార్డులతో తీసిన ర్యాలీ నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. ఈ వీడియోను ఓ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌)లో పోస్ట్ చేశారు.  దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో ఫన్నీగా స్పందిస్తున్నారు.

వారి డిమాండ్ క‌రెక్టేగా  కనీసం వారానికి ఒక‌సారైనా క్లీన్ షేవ్ కాకున్నా క‌నీసం ట్రీమ్ చేసుకుంటే బాగుంటుంది. అప్పుడే మ‌నం ఎలుగుబంటిలా కాకుండా జెంటిల్‌మెన్‌లా  ఉంటాం అంటూ కామెంట్‌  చేయడం విశేషం. మరికొందరు దీని వెనుకున్న మతలబు ఏంటి భయ్యా అంటూ  దీర్ఘాలోచనలో పడిపోయారు.

ఇదీ చదవండి: నిద్రపోనివ్వని కల అంటే ఇదే! శభాష్‌ మల్లవ్వ!

 

కాగా  పురుషులు గడ్డాలతో అందంగా కనిపిస్తారా లేదా గడ్డం లేకపోతే అందంగా కనిపిస్తారా?  అనేది పెద్ద చర్చే. గడ్డాలున్న పురుషులనే మహిళలు  ఇష్టపడతారని అనేక అధ్యయనాలు చెబుతున్నప్పటికీ, క్లీన్ షేవ్‌ మెన్‌ మరింత ఆకర్షణీయంగా ఉంటారని మరికొందరి వాదన.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)