Breaking News

ఐఐటీ హైదరాబాద్‌ ఘనత..త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీతో బ్రిడ్జ్‌ తయారీ..!

Published on Thu, 06/20/2024 - 18:35

ఐఐటీ హైదరాబాద్​ అరుదైన ఘనత సాధించింది. యువ స్టార్టప్‌ సింప్లిఫోర్జ్ క్రియేషన్సతో కలిసి భారతదేశపు మొట్టమొదటి ప్రోటోటైప్ బ్రిడ్జ్‌ను తయారుచేసింది. స్వదేశీ 3D ప్రింటింగ్ టెక్నాలజీతో ఈ బ్రిడ్జ్ తయారు చేయడం విశేషం. ఈ త్రీడీ ప్రింటెడ్‌ బ్రిడ్జ్‌ని ఐఐటీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. దీన్ని కేవీఎల్‌ సుబ్రమణ్యం అతని రీసెర్చ్‌ గ్రూప్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ బృందం కలిసి పాదాచారుల బ్రిడ్జ్‌ని రూపొందించారు. లోడ్‌ పరీక్ష తర్వాత పూర్తి స్థాయి 7.50 మీటర్ల వంతెనను రూపొందించే యత్నం చేశారు. 

కాంక్రీట్‌ ఉపబలాన్ని తగ్గించి ఈ నిర్మాణాన్ని అభివృద్ధి చేశారు. ఈ వంతెనలో మెటీరియల్‌ ప్రాసెసింగ్‌, డిజైన్‌ మెథడాలజీలలో అనేక పురోగతులు హైలెట్‌గా నిలిచాయి. నిజానికి ఈ త్రీడి కాంక్రీట్‌ ప్రింటింగ్‌ అనేది అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు నిదర్శనం. పైగా తక్కువ బరువుతో వేగవంతమైన సమర్థవంతమైన వంతెనలు, నిర్మాణాలను అభివృద్ధి చేసే నిర్థిష్ట ఆప్టమైజ్‌ అప్లికేషన్‌ త్రీడీ టెక్నాలజీ. ఈ మేరకు ఈ ప్రోటోటైప్ వంతెనను అభివృద్ధి చేసిన కేఎల్‌ సుమ్రమణ్యం, అతని బృందాన్ని ఐఐటీ హైదరబాద్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి అభినందించారు. 

వేగవంతమైన సమర్థవంతమైన నిర్మాణాలకు సాంకేతికతో కూడిన పరిష్కారాలు అత్యంత అవసరమని అన్నారు. సమర్థవంతమైన నిర్మాణం కోసం స్వదేశీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం అనేది ఆత్మ నిర్బర్‌ కలను సాకారం చేసుకునే దిశగా డిజిటల్‌క్నాలజీని అభివృద్ధిపరిచే ఘనమైన ముందుడగు అని ప్రశంసించారు. ఇలాంటి ఆవిష్కరణలు ఆర్థిక పరంగా స్థానిక అభివృద్ధికి మాత్రమే గాక మౌలిక సదుపాయల రంగానికి మరిన్ని ప్రయోజనాలు అందించగలదని భావిస్తున్నానని అన్నారు.

(చదవండి: ఆరోజు రాత్రి వ‌ర‌కు అబ్బాయి.. లేచిన వెంట‌నే అమ్మాయిగా మార్పు..!)

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)