Breaking News

ప్రపంచంలోనే బెస్ట్‌ ఫ్రైడ్‌ చికెన్‌ డిష్‌గా చికెన్‌ 65..!

Published on Mon, 12/02/2024 - 16:23

ప్రపంచంలోనే బెస్ట్‌ వంటకాలు, స్వీట్ల జాబితాను విడుదల చేసి వరల్డ్‌ టేస్ట్‌ అట్లాస్‌ తాజాగా బెస్ట్‌ ఫ్రైడ్‌ చికెన్‌ డిష్‌లను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాలుగా ఫ్రైడ్‌ చికెన్‌ని తయారుచేస్తారు. అయితే ఆ జాబితాలో మన భారతీయ వంటకం చికెన్‌65  టాప్‌ 10లో చోటు దక్కించుకుంది. దక్షిణ భారతదేశానికి చెందిన ఈ వంటకం మూడో స్థానంలో నిలిచింది. దీన్ని అల్లం, నిమ్మకాయ, ఎర్రమిరపకాయల కారం, మసాలా దినుసులతో మెరినేట్‌ చేసి.. డీప్‌ ఫ్రై చేస్తారు. భారత్‌లో ఈ రెసిపీ బాగా ఫేమస్‌.

ఆహార ప్రియులకు ఎంతో ఇష్టమైన వంటకం ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. నిజానికి ఈ చికెన్‌ 65 మూలం తమిళనాడుగా చెబుతుంటారు. అయితే చికెన్‌ 65 ఇలా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడం తొలిసారి కాదు. గతేడాది ఆగస్టు 2023లో ఇదే థీమ్‌పై టేస్ట్‌ అట్లాస్‌ జాబితాను విడుదల చేసినప్పుడు చికెన్‌65 పదో స్థానంలో నిలిచింది. కాగా, టేస్టీ అట్లాస్‌ విడుదల చేసిన ప్రస్తుత జాబితాలో కొరియన్ ఫ్రైడ్ చికెన్ (చికిన్) అగ్రస్థానంలో ఉండగా, జపాన్‌కు చెందిన కరేజ్ రెండో స్థానంలో ఉంది. 

గత ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన అయామ్ గోరెంగ్ ఇప్పుడు 5వ స్థానానికి పరిమితమయ్యింది. ఇవేగాక వీటితోపాటు ఈ జాబితాలో చైనీస్ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ (జాజీజీ), తైవానీస్ పాప్‌కార్న్ చికెన్, ఇండోనేషియా అయామ్ పెనియెట్ తదితరాలు టాప్‌10లో చోటు దక్కించుకున్నాయి.

(చదవండి: వాయు కాలుష్యం నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే..!)
 

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)