Breaking News

మనసు గెలిచింది- ఆ వంద గ్రాములు లెక్కే అంటారా?

Published on Thu, 08/08/2024 - 04:18

నవ్వుతూ మాట్లాడకూడదు. నచ్చిన డ్రెస్‌ అసలే వేసుకోకూడదు. హవ్వ.. అబ్బాయిల్లా ఆ ఆటలు ఏంటి? ఏమ్మా నువ్వైనా నీ బిడ్డకు చెప్పవచ్చు కదా! అసలే తండ్రి లేని పిల్ల... ఇలాంటివి మీకు అవసరమా?  సూదుల్లా గుచ్చే ఇరుగు పొరుగు మాటలు లెక్కచేయలేదు– ఆ తల్లీ.. కూతురు 

తల్లి ఎంతటి ధైర్యశాలో కూతురికి తెలుసు. 32వ ఏటనే భర్తను కోల్పోయినా ఇద్దరు కూతుళ్లను గొప్పగా పెంచింది. ఆడపిల్లలు బలహీనులని భావించక మగాళ్ల గోదాలో రెజ్లర్లుగా దించింది. క్యాన్సర్‌ బారిన పడ్డా కూతుళ్ల కోసం యముడితో పోరాడి బయటపడింది. అవును... ఆ తల్లిని చూసి పోరాడటం నేర్చుకుంది ఆ కూతురు... వినేశ్‌ ఫొగట్‌ డాటరాఫ్‌ సరళాదేవి.

‘పట్టు’ పడితే పతకం మెడలో వాలాల్సిందే. అన్యాయం చేసిన వాళ్ల తాట తీయాల్సిందే. న్యాయపోరాటంలో మొండిగా ముందుకు దూకాల్సిందే. నాన్న లేడని అమ్మను వంకర చూపులు చూసే వాళ్ల తోడేలుతనం ఆమె దృష్టిని దాటి పోలేదు. ఆడవాళ్లకు అదెంత వేదనో స్వయంగా చూసింది. అందుకే తోటి మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులకు గురయ్యామని చెబితే వారికి మద్దతుగా నిలిచింది. కెరీర్‌ను పణంగా పెట్టి రాజధానిలో ఉద్యమానికి ఊపిరిగా మారింది.

పాలకుల ఒంటెత్తు పోకడలను నిరసిస్తూ జీవితకాల శ్రమతో సంపాదించుకున్న ఖేల్‌ రత్న అవార్డును కూడా తృణ్రపాయంగా విడిచిపెట్టింది. ఇంత బరితెగింపా అంటూ అజ్ఞానంతో  అనరాని మాటలు అనే వాళ్లను చిరునవ్వుతో మరింత చికాకు పెట్టింది. మద్దతుగా నిలిచిన వారికి కన్నీళ్లతోనే కృతజ్ఞతలు చెప్పింది. 

ఖేల్‌ ఖతమే అన్న వాళ్ల చెంప చెళ్లుమనిపించేలా అన్ని సవాళ్లను దాటుకుని మూడోసారి ఒలింపిక్స్‌ బరిలో నిలిచింది. అంతేనా..  ఇప్పటి వరకు భారత మహిళా రెజ్లర్లు ఎవరికీ సాధ్యం కాని ఘనత సాధించింది. స్వర్ణ పతకపోరుకు అర్హత సాధించింది.  

ఊహించని విధంగా వందగ్రాములు.. కేవలం వందగ్రాముల అదనపు బరువు కారణంగా పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. పతకం సాధించకపోతేనేమి.. అందరి హృదయాలలో అభిమానాన్ని సంపాదించింది. వీటన్నిటి ముందు ‘ఆ వంద గ్రాములు‘  లెక్కే అంటారా? 

(ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో 50 కిలోల విభాగంలో ఫైనల్‌ చేరిన వినేశ్‌ ఫొగట్‌.. 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్న కారణంగా ఆమెపై అనర్హత వేటు పడింది)
-సుష్మారెడ్డి యాళ్ల

చదవండి: వినేశ్‌ ఊహించలేదా!.. జుట్టు కత్తిరించి, రక్తం తీసినా.. తప్పెవరిది?

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)