Breaking News

భారతీయ రెస్టారెంట్‌కు ప్రతిష్టాత్మక మిచెలిన్ స్టార్ పురస్కారం!

Published on Fri, 12/13/2024 - 13:48

భారతీయ రెస్టారెంట్‌కు ప్రతిష్టాత్మకమైన మిచెలిన్ స్టార్ పురస్కారం లభించింది. ఇది వంటకాలకు సంబంధించి.. పాక ప్రపంచంలో అత్యున్నత గౌరవంగా పరిగణిస్తారు. నిజానికి భారతదేశంలో మిచెలిన్‌ స్టార్‌ల లభించిన రెస్టారెంట్‌లు లేవు విదేశాల్లో ఉన్న భారతీయ రెస్టారెంట్లే ఈ అత్యున్నత పురస్కారాన్ని దక్కించుకున్నాయి. 

తాజాగా దోహాలో జరిగిన మిచెలిన్ గైడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారతీయ రెస్టారెంట్‌ జమావర్‌ దోహాకి ఈ మిచెలిన్ స్టార్ అవార్డు లభించింది. ఈ కార్యక్రమంలో రెండు రెస్టారెంట్లకే ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. వాటిలో మన భారతీయ రెస్టారెంట్‌ కూడా ఉండటం విశేషం. అంతర్జాతీయ స్థాయిలో తమ రెస్టారెంట్‌ కూడా భాగమవ్వడం సంతోషంగా ఉందన్నారు వ్యవస్థాపకులు ఈ తండ్రికూతుళ్ల ద్వయం దినేష్‌ , సంయుక్తలు. 

ఈ రెస్టారెంట్‌  పేరుని కాశ్మర్‌లోని 16వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ శాలువాల పేరుని ఎంచుకున్నారు ఆ తండ్రి కూతుళ్లు.  అత్యాధునిక హంగులతో ఉండే ఈ రెస్టారెంట్‌లో ఢిల్లీ, కేరళకు సంబంధించిన ప్రసిద్ధ వంటకాలతో సహా వివిధ అద్భుత రుచులతో కూడిన వంటకాలను సర్వ్‌ చేస్తారు . ఈ జమావర్‌ రెస్టారెంట్‌ని మొదటిసారిగా 2001లో ది లీలా ప్యాలెస్ బెంగళూరులో ప్రారంభించారు. అక్కడ నుంచి ప్రసిద్ధ ఐదు భారతీయ నగరాల్లో బ్రాంచ్‌లుగా విస్తరించారు. ఆ తర్వాత 2016లో లండన్‌, 2021లో దోహాలలో కూడా తమ రెస్టారెంట్లను ప్రారంభించారు. అయితే జమావర్‌ లండన్‌ కూడా ఈ ప్రతిష్టాత్మక మిచెలిన్ స్టార్‌ పురస్కారాన్ని దక్షించుకోవడం విశేషం. 

కాగా, దోహా జమావర్‌ రెస్టారెంట్‌ చెఫ్‌ సురేందర్‌ మోహన్‌ ఇన్‌స్టాగ్రాంలో "ఇది తమ టీం సమిష్ట కృషి, అంకిత భావానికి నిదర్శనం. మా కష్టాన్ని గుర్తించి ఈ అత్యున్నత పురస్కారంతో గౌరవించినందుకు మిచెలిన్ గైడ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు". అని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు చెఫ్‌ సురేందర్‌ . ఇక సంయుక్త నాయర్‌  కూడా ఇది కేవలం మా జమావర్‌ దోహకే గర్వకారణం కాదు. ఆ ప్రాంతంలో భారతీయ ఆహారానికి దక్కిన గొప్ప గౌరవం అని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. 

మిచెలిన్ స్టార్ అంటే..
అత్యుత్తమ వంటలను అందించే రెస్టారెంట్లకు ఈ పురస్కారాని ఇస్తారు. మొత్తం ఐదు ప్రమాణాలలను పరిగణలోనికి తీసుకుని ఈ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. పదార్థాల నాణ్యత, రుచుల సామరస్యం, సాంకేతికతలలో నైపుణ్యం, వంటకాలను ప్రెజెంట్‌ చేసే చెఫ్ నైపుణ్యం, ముఖ్యంగా మెనూలో వంటకాల వైవిధ్యం తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఫ్రాన్స్‌కి చెందిన మిచెలిన్ గైడ్ ఈ పురస్కారాలను అందజేస్తుంది. ఇలా 1900 సంవత్సరం నుంచి అందజేస్తోంది.

 

(చదవండి: బిడ్డకు తల్లైనా అంతే అందంగా హీరోయిన్‌! ‘చందమామ’ సీక్రెట్‌ ఇదే!)

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)